ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు నిన్ననే (నవంబర్ 15) తమ రిటెన్షన్ లిస్ట్‌తో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో కొందరిని అవమానకర రితీలో వదిలించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రిలీజ్ చేసిన ఆటగాళ్ల గత రికార్డులు, వారి సామర్ధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఫ్రాంచైజీలు.. సదరు ఆటగాళ్ల గత సీజన్ ఫామ్, ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే కొలమానంగా తీసుకుని, కనీసం ముందస్తు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా తప్పించాయని సమాచారం.
ఫ్రాంచైజీలు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా రిలీజ్ చేయడంపై చాలా మంది ఆటగాళ్లు తీవ్ర మనస్థాపానికి గరయ్యారని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్‌సైట్ పేర్కొంది. ముఖ్యంగా కొందరు స్టార్ ఆటగాళ్లు, మెగా వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు.. ఫ్రాంచైజీలు ఇలా అవమానకర రీతిలో తమతో వ్యవహరిస్తాయని ఊహించలేదని వాపోయినట్లు తెలుస్తోంది.
ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (14 కోట్లు)
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (14 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్: నికోలస్ పూరన్ (10.75 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్: జేసన్ హోల్డర్ (8.75 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్: రొమారియో షెపర్డ్ (7.75 కోట్లు)
ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా..
గుజరాత్ టైటాన్స్: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్. వీరిలో రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్లను కేకేఆర్ ట్రేడింగ్ చేసుకోగా, మిగిలిన ముగ్గురిని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం వేలానికి వదిలి పెట్టింది.
ఢిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్. వీరిలో శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ చేసుకోగా, ఢిల్లీ యాజమాన్యం మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలేసింది.
రాజస్తాన్ రాయల్స్: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. వీరిలో డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లను ఆర్‌ఆర్ యాజమాన్యం చిన్నచూపు చూసింది.
కేకేఆర్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. వీరిలో పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్ వివిధ కారణాల చేత స్వతాహాగా లీగ్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించగా.. అలెక్స్ హేల్స్, అజింక్య రహానే, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే లాంటి స్టార్లకు అవమానకర ఉద్వాసన తప్పలేదు.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. వీరలో కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్ అత్యంత దారుణ పరాభవం కాగా, ఒడియన్ స్మిత్ లాంటి విదేశీ ప్లేయర్‌ను ఫ్రాంచైజీ అస్సలు పట్టించుకోలేదు.
ఆర్సీబీ: జేసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. వీరిలో జేసన్ బెహ్రెండార్ఫ్‌ను కేకేఆర్ ట్రేడ్ చేసుకోగా.. రూథర్‌ఫోర్డ్‌కు బలవంతపు ఉద్వాసన తప్పలేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ఈ ఫ్రాంచైజీనే అత్యధికంగా స్టార్ ఆటగాళ్లను తప్పించింది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్ లాంటి విదేశీ స్టార్లు తీవ్రంగా మనసు నొచ్చుకున్నట్లు సమాచారం.
ముంబై ఇండియన్స్: వేలానికి ముందు అత్యధిక మంది ప్లేయర్లను వదిలిపెట్టిన ఫ్రాంచైజీ ఇదే. ఈ జట్టు కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది. ఎంపై మేనేజ్‌మెంట్.. వీరిలో పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుని తృప్తి పరచగా.. డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్ టైమల్ మిల్స్ లాంటి ఆటగాళ్లకు అవమానం తప్పలేదు.
లక్నో సూపర్ జెయింట్స్: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. వీరిలో ఆండ్రూ టై, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే లాంటి పేరున్న ఆటగాళ్లను యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా రిలీజ్ చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. వీరిలో డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. క్రిస్ జోర్డాన్‌పై వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment