ల్యాండ్ అవుతూ పక్కకు ఒరిగిన విమానం
కోజికోడ్: పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగుతుండగా విమానం అదుపుతప్పి పక్కకు ఒరిగింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం సంభవించలేదు. కాలికట్ ఎయిర్‌పోర్టు అధికారులు కథం ప్రకారం.. స్పైస్ జెట్ క్యూ400 అనే విమానం చెన్నై నుంచి 60 మంది ప్రయాణికులతో కాలికట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.
అయితే రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా అదుపుతప్పి, రన్‌వేపై ఓ పక్కకు ఒరిగిపోయింది. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని నెమ్మదిగా రన్‌వేపై తేవడంతో ప్రమాదం తప్పింది. ఈ యత్నంలో రన్‌వేపై ఉన్న గైడింగ్ లైట్స్ ధ్వంసమయ్యాయి. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దించేశారు. వర్షాల కారణంగా రన్‌వేపై నీళ్లు నిలిచిన కారణంగా బ్రేక్స్ జరిగ్గా అప్లై కాకపోవడంతో విమానం పక్కకు ఒరిగినట్లు తెలిపారు. కాలికట్ నుంచి వెళ్లే రెండు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు రద్దయ్యాయి.