spicejet plane
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెనుప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే.. ఎయిర్‌పోర్ట్‌లో సేప్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. -
శంషాబాద్‌లో స్పైస్‌జెట్ అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: స్పైస్ జెట్ విమానం తిరిగి శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు తిరుపతి ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. ఉదయం 7.45 నిమిషాలకు తిరుపతి బయలుదేరిన విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. -
విమానంలోనే కన్నుమూత
బ్యాంకాక్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. విమానం ఆకాశంలో ఎగురుతుండగానే, థాయ్ పర్యాటకుడు(53) గుండెపోటుతో కన్నుమూశాడు. ప్రయాణికుడికి తీవ్ర గుండెపోటు రావడంతో, వారణాసిలో ఆ విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. కానీ అప్పటికే ఆ ప్రయాణికుడు కన్నుమూసినట్టు వైద్యాధికారులు చెప్పారు. బ్యాంకాక్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న పర్యాటక గ్రూప్‌లో ఈ వ్యక్తి సభ్యుడు. ఆ ప్రయాణికుడితో పాటు భార్య, సోదరి, ఏడుగురు కుటుంబ సభ్యులు ఆ విమానంలో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. అందర్ని వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో డిబోర్డు చేశారు. థాయ్‌లాండ్ రాయబారి కార్యాలయానికి ఈ సంఘటన గురించి తెలియజేశారు. బ్యాంకాక్ నుంచి ఉదయం 7.40 గంటలకు 189 మంది ప్రయాణికులతో ఈ విమానం టేకాఫ్ అయింది. ప్రయాణికుడికి గుండె పోటు వచ్చిందని విమాన సిబ్బంది, ఆ విమానాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయనున్నట్టు అధికారులకు తెలిపారు. ల్యాండ్ అయిన వెంటనే, సమీపంలో ఉన్న వైద్య అధికారుల వద్దకు అతన్ని తరలించారు. కానీ ఆయన అప్పటికే కన్నుమూసినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఇటీవలే ఖతార్ ఎయిర్వేస్లో కూడా ఓ 11నెలల చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురై, ఆ బాబు మరణించాడు. -
ల్యాండ్ అవుతూ పక్కకు ఒరిగిన విమానం
కోజికోడ్: పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగుతుండగా విమానం అదుపుతప్పి పక్కకు ఒరిగింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం సంభవించలేదు. కాలికట్ ఎయిర్‌పోర్టు అధికారులు కథం ప్రకారం.. స్పైస్ జెట్ క్యూ400 అనే విమానం చెన్నై నుంచి 60 మంది ప్రయాణికులతో కాలికట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా అదుపుతప్పి, రన్‌వేపై ఓ పక్కకు ఒరిగిపోయింది. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని నెమ్మదిగా రన్‌వేపై తేవడంతో ప్రమాదం తప్పింది. ఈ యత్నంలో రన్‌వేపై ఉన్న గైడింగ్ లైట్స్ ధ్వంసమయ్యాయి. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దించేశారు. వర్షాల కారణంగా రన్‌వేపై నీళ్లు నిలిచిన కారణంగా బ్రేక్స్ జరిగ్గా అప్లై కాకపోవడంతో విమానం పక్కకు ఒరిగినట్లు తెలిపారు. కాలికట్ నుంచి వెళ్లే రెండు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
రన్ వేపై విమానాన్ని అడ్డుకున్న కోతులు
న్యూఢిల్లీ: రన్ వేపైకి జంతువులు రావడం వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తాజాగా ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో కోతులు ఆటంకం కలిగించాయి. స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం అహ్మదాబాద్ నుంచి చెన్నైకు వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం టేకాఫ్ తీసుకోవడానికి కొన్ని క్షణాల ముందు కోతులు రన్ వేపై ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేసి విమానాన్ని ఆపేశారు. అదృష్టవశాత్తూ విమానాన్ని సకాలంలో ఆపగలిగామని, ఎవరికీ ప్రమాదం జరగలేదని చెప్పారు. గతంలో జంతువుల వల్ల విమానాలకు అంతరాయం ఏర్పడిన ఘటనలు ఉన్నాయి. -
పందులను ఢీకొన్న స్పైస్‌జెట్ విమానం
సరిగ్గా రన్‌వే మీద దిగబోతుండగా.. అడవి పందులు అడ్డు రావడంతో వాటిని ఢీకొన్న స్పైస్‌జెట్ విమానం ఒకటి దారుణంగా దెబ్బతింది. 49 మంది ప్రయాణికులతో కూడిన ఈ విమానం జబల్పూర్లోని డుమ్నా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రన్‌వే మీద నుంచి విమానం పక్కకు వెళ్లిపోతున్నా, దాన్ని పైలట్ ఎలాగోలా నియంత్రించగలిగారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. కెప్టెన్ అమర్త్య బసుకు 10 వేల గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉందని, ఆయనవల్లే భారీ ప్రమాదం తప్పిందని స్పైస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 49 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, విమానానికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని తెలిపారు. ముంబై నుంచి జబల్పూర్ వస్తున్న ఈ విమానం ల్యాండ్ అవుతుండగా అడవిపందుల గుంపు ఒకేసారి రన్‌వే మీదకు వచ్చేసిందని, దాంతో విమానం రన్‌వే నుంచి పక్కకు దిగిపోయిందని తెలిపారు. కొన్ని అడవిపందులు ఈ ప్రమాదంలో చనిపోయాయి. రాత్రిపూట కావడం, విమానాశ్రయం సరిహద్దుల్లో ఉన్న ఫెన్సింగ్‌కు రంధ్రం ఉండటంతో అడవిపందులు లోపలకు వచ్చేశాయని చెబుతున్నారు. ఇంతకుముందు 2014 నవంబర్ నెలలో సూరత్ విమానాశ్రయం రన్‌వే మీద స్పైస్ జెట్ విమానం ఓ గేదెను ఢీకొంది. -
స్పైస్ జెట్ విమానంలో సాంకేతికలోపం
హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగేందుకు అధికారులు అనుమతించ లేదు. దాంతో విమానం దాదాపు 45 నిముషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం ఎయిర్పోర్ట్ అధికారులు విమానం ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ విమానంలో దాదాపు102 మంది ప్రయాణీకులు న్యూఢిల్లీ బయలుదేరారు. అయితే వారిని మరో విమానంలో న్యూఢిల్లీ పంపేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్పైస్ జెట్ విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు సాంకేతిక నిపుణులు సత్వర చర్యలు చేపట్టారు.