
(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: స్పైస్ జెట్ విమానం తిరిగి శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.
దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు తిరుపతి ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. ఉదయం 7.45 నిమిషాలకు తిరుపతి బయలుదేరిన విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.