Tirupati airport
-
శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా తిరుపతి ఎయిర్పోర్ట్ పేరు !
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో రెండు ఎయిర్‌పోర్ట్‌ల పేర్ల మార్పునూ ప్రతిపాదించింది. 10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. దర్బంగా ఎయిర్‌పోర్ట్‌ను విద్యాపతి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని బిహార్ కోరింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నాయి. -
గుడ్‌న్యూస్.. త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చింది. అయితే, ఇప్పటివరకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, తిరుపతి నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు నడిచేలా కృషి చేస్తోంది. ముందుగా తిరుపతి విమానాశ్రయం నుంచి కువైట్‌కు సర్వీసులు ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు విమానయాన సంస్థలతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్), స్థానిక ఎంపీ, ఎయిర్‌పోర్టు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విమాన సర్వీసులు ప్రారంభించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఓపెన్ స్కై పాలసీ కింద కువైట్‌కు విమాన సర్వీసులు ప్రారంభించాలని స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు. ఈ పాలసీ కింద 400 సీట్లు కేటాయించాలని కోరగా కేంద్రం నుంచి సానుకూల స్పందన వచి్చనట్లు అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి కువైట్‌కు సర్వీసులు నడపడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని తిరుపతి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. ఇండిగో, ఎయిర్‌ఏíÙయా సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తక్షణం అంతర్జాతీయ సరీ్వసులు నడపడానికి వీలుగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్, ఇమిగ్రేషన్‌కు అవసరమైన సౌకర్యాలతో పాటు విదేశీ ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు, కన్వేయర్ బెల్ట్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి సరీ్వసులు ప్రారంభిస్తే ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులను నియమించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తీరునున్న అవస్తలు రాయలసీమ ప్రాంత వాసులు విదేశాలకు వెళ్లేందుకు తిరుపతి విమానాశ్రయం చాలా అనుకూలంగా ఉంటుంది. రాయలసీమ నుంచి ముఖ్యంగా చిత్తూరు, రాజంపేట, రాయచోటి, నెల్లూరు ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వ్యయప్రయాసలకోర్చి చెన్నై వెళ్లి, అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. అదే తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి సరీ్వసులు అందుబాటులోకి వస్తే ఈ అవస్థలు తప్పుతాయని, చాలా సౌకర్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించడానికి ఎంపీ గురుమూర్తి కేంద్రస్థాయిలో సంప్రదింపులు నడుపుతున్నారని, ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయని, త్వరలోనే తిరుపతి నుంచి అంతర్జాతీయ సరీ్వసులు ప్రారంభమవుతాయని ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్ రెడ్డి తెలిపారు. -
శంషాబాద్‌లో స్పైస్‌జెట్ అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: స్పైస్ జెట్ విమానం తిరిగి శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు తిరుపతి ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. ఉదయం 7.45 నిమిషాలకు తిరుపతి బయలుదేరిన విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. -
ఆ రోజు మమ్మల్ని ఆపినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది?
సాక్షి, తాడేపల్లి: ఓటమిని జీర్ణించుకోలేకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాలు చేస్తున్నాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని అన్నాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చంద్రబాబుకు తెలీదా అని ప్రశ్నించారు. నిరసనకు అనుమతి లేదని నిన్ననే పోలీసులు నోటీసులు ఇచ్చారని, చంద్రబాబుపై టీడీపీ కార్యకర్తలకు విశ్వాసం పోయిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. తమను విశాఖ ఎయిర్‌పోర్టులో ఆపినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని మండిపడ్డారు. ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందునే చంద్రబాబును ఆపారని తెలిపారు. చంద్రబాబు డ్రామాలు ఇకపై సాగవన్నారు. చంద్రబాబు ఉదయం నుంచి రేణిగుంటలో ఒక హై డ్రామా నడుపుతున్నారని, బాబు ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించేవారు కాదని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారని, చిత్తూరు జిల్లాలో ఎదో అన్యాయం జరిగిందని నిరసన చేస్తానని వెళ్లారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్, కోవిడ్ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. వెళ్లాలనుకుంటే ఎన్నికల కమిషన్ వద్ద అనుమతి తీసుకోవాల్సిందని, అనుమతి తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. పోలీసులు దండం పెట్టి చెప్పినా వినకపోవడం ఏమిటమని ధ్వజమెత్తారు. చదవండి: ఓడింది నువ్వా? ప్రజాస్వామ్యమా? ఇప్పుడు చెప్పు చంద్రబాబూ.. -
తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
-
శ్రీవారి ఫ్యాబ్రిక్ కంపెనీలో అగ్నిప్రమాదం
సాక్షి, తిరుపతి : తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి ఫ్యాబ్రిక్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల లేక ఇంకా ఏదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
సాక్షి, తిరుపతి : తిరుపతి విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి ముప్పు తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతికి వచ్చిన స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలినట్లు తెలిసింది. దీంతో అందులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా విమానాన్ని టేకాఫ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విమానానికి మరమ్మత్తులు చేపట్టారు. టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం కూడా ఇదే తరహాలో స్పైస్ జెట్ విమానంలో సాంకేతికత లోపించడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. -
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
సాక్షి, తిరుపతి : తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6గంటలకు రావాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటికి రాకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు పడిగాపులు గాస్తు ఇబ్బందికి గురవుతున్నారు. కాగా మొత్తం 172 మంది ప్రయాణికులు స్పైస్ జెట్ విమానం రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విమానం రాకపోవడానికి సాంకేతిక కారణాలే కారణం కావొచ్చని అధికారులు పేర్కొన్నారు. -
బుల్లెట్లతో దొరికిపోయిన టీడీపీ నేత!
సాక్షి, రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో శనివారం టీడీపీ నేత వద్ద 20 బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతోంది. తనిఖీల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా నర్సింహారెడ్డి ముఖ్య అనుచరుడు, సింగిల్ విండో చైర్మన్ సాయినాథ్ శర్మ వద్ద 20 తూటాలు లభించాయి. దీంతో ఆయనను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సాయినాథ్ శర్మ లైసెన్స్డ్ గన్ను పోలీసులకు డిపాజిట్ చేయలేదని సమాచారం. అధికార బలంతో ఆయన గన్ను తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయినాథ్ శర్మ ఆయుధాన్ని అప్పగించారా లేదా అనేదానిపై కమలాపురం పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు... సాయినాథ్ శర్మ వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే నెల (మే) మూడో తేదీతో గడువు ముగియనుంది. లైసెన్స్ దారుడు తన వద్ద ఉన్న ఆయుధాన్ని డిపాజిట్ చేస్తే పోలీసులు రసీదు ఇస్తారు. ఆ రసీదు ఆధారంగా ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా లైసెన్స్‌దారుడు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి పూర్తయ్యేవరకూ ఆయుధంతో పాటు తుటాలను కూడా కచ్చితంగా పోలీసుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆయుధం నెంబర్, లైసెన్స్‌లో ఉన్న నంబర్ అదేవిధంగా జారీ చేసిన బుల్లెట్లకు సంబంధించిన నంబర్లు పరిశీలించిన తర్వాతే డిపాజిట్‌ను స్వీకరిస్తారు. ఆయుధ లైసెన్స్ ఉన్నప్పటికీ, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి బుల్లెట్లు కలిగి ఉండటం నేరమని స్థానిక డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. టీడీపీ నేత సాయినాథ్ శర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విషయంపై టీడీపీ నేత సాయినాథ్ స్పందిస్తూ.. పోలీసులు తనకు నోటీస్ ఇవ్వకున్నా...ఆర్మ్ హౌస్ వద్ద గన్ డిపాజిట్ చేశానని తెలిపారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. -
తిరుపతి ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా మూసివేత
సాక్షి, తిరుపతి: తిరుపతి విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రన్ వేలో ఏర్పడిన సమస్యలతో ఎయిర్పోర్ట్ అధికారులు అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్, విజయవాడ వెళ్లే విమానాలు నిలిపి వేయడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎయిర్పోర్ట్ మూసివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరికొన్ని గంటల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. -
తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలి
సాక్షి, న్యూఢిల్లీ : తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చినా అక్కడి నుంచి విదేశాలకు విమానాలు తిరగడంలేదని వైఎస్సార్సీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని గుర్తుచేశారు. అంతే కాకుండా రాయలసీమ నుంచి ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళుతున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి అంతర్జాతీయ వైమానిక సేవలను ప్రారంభించినా అవి అమల్లోకి రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుపతి విమానాశ్రయం నుంచి విదేశాలకు ఎయిర్ ఇండియా విమానాలను నడపాలని డిమాండ్ చేశారు. అలాగే కడప ఎయిర్ పోర్టులో రన్‌వే విస్తరణ ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలపాలని కోరారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కడప విమానాశ్రయ అభివృద్ది పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుండి విదేశాలకు విమానాలు నడపండి -
విమానాశ్రయంలో జగన్‌కు ఘనస్వాగతం
-
విమానాశ్రయంలో జగన్‌కు ఘనస్వాగతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని, అనంతరం రొట్టెల పండుగలో కూడా పాల్గొంటారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్ పట్టివేత : నలుగురి అరెస్ట్
చిత్తూరు : తిరుపతి విమానాశ్రయంలో ఆర్డీఎక్స్ కలకలం సృష్టించింది. పేలుడు పదార్థాలతో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను తిరుపతి ఎయిర్పోర్ట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా లిక్విడ్ ఆర్డీఎక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నలుగురి అనుమానితులను ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారీగా లిక్విడ్ ఆర్డీఎక్స్ను గుర్తించారు. పోలీసు ఉన్నతాధికారులు నలుగురిని విచారిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు వ్యాపార నిమిత్తం వచ్చిన వీరు.. తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయంలో పట్టుబడినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్‌రెడ్డిపై కేసు
ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి (వైఎస్సార్ జిల్లా) : ఎలాంటి తప్పు లేకపోయినా.. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్‌రెడ్డిపై కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం నెల్లూరు జైలులో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన ఫోన్ ద్వారా ‘సాక్షి’తో మాట్లాడారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఎలాంటి సంఘటనలు జరగకపోయినా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ఎయిర్‌పోర్టు మేనేజర్‌తో ఫిర్యాదు చేయించారన్నారు. ఎయిర్‌పోర్టులో చోటు చేసుకున్న సంఘటనపై మేనేజర్ ఎంపీకి క్షమాపణలు చెప్పారన్నారు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఏ తప్పూ చేయని ఎంపీపైనే ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారన్నారు. ఇదిలా ఉండగా శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు విమానంలో సీటు కేటాయింపు విషయంలో ఎయిర్ హోస్టెస్‌ను అంతుచూస్తానంటూ బెదిరించిన సంఘటనపై ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ద్వారా ఒత్తిడి చేయించి ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదును తొక్కి పెట్టేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలను ఏ విధంగా గౌరవిస్తున్నారో ఈ సంఘటనను బట్టి తెలుస్తోందన్నారు. ఏమీ జరగకపోయినా రాజకీయ కక్షసాధింపుతో మిథున్‌రెడ్డిపై కేసు న మోదు చేశారని, స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయంలో మాత్రం ఒక మహిళకు తీవ్ర అన్యాయం జరిగినా పట్టించుకోలేదన్నారు. ఇదేం న్యాయమని ఆయన ప్రశ్నించారు. -
శ్రీకాళహస్తి-నడికుడి మార్గంతో..పారిశ్రామికాభివృద్ధి వీచిక !
రాజధానిపై నియమించిన డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పిన వైనం {పధానమైన రైలుమార్గానికి అత్తెసరు నిధులే కేటాయిస్తున్నారంటూ ఆక్షేపణ బెంగళూరు-కడప రైలుమార్గంతో దక్షిణాంధ్ర ప్రగతికి నాంది అన్న కమిటీ తిరుపతి విమానాశ్రయం అభివృద్ధికి రూ.1200 కోట్లు అవసరమని నివేదన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం వెన్నెముకగా నిలుస్తుందని రాజధానిపై నియమించిన డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పింది. అత్యంత కీలకమైన ఆ రైలుమార్గానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడాన్ని ఆక్షేపించింది. రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రగతికి బెంగళూరు-కడప రైలుమార్గం నాంది పలుకుతుందని అభిప్రాయపడింది. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించడానికి కనీసం రూ.1200 కోట్ల వ్యయం చేయాలని అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి సమర్పించిన నివేదికలో శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. ఆ కమిటీ చేసిన సూచనలను అమలుచేస్తే జిల్లా సమగ్రాభివృద్ధి సుసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని ఎంపికపై డాక్టర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్రం నియమించిన విషయం విదితమే. ఆ కమిటీ జూలై 9న తిరుపతిలో పర్యటించి.. ప్రజల అభిప్రాయాలు స్వీకరించింది. ఈ-మెయిల్స్, లేఖలు, వినతిపత్రాల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించింది. గత నెల 30న కేంద్రానికి కమిటీ నివేదిక అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజధానిపై వచ్చిన 4,728 విజ్ఞప్తుల్లో తిరుపతిని రాజధానిగా చేయాలని కోరుతూ 113 మంది వినతిపత్రాలు సమర్పించినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించాలంటే విశాఖపట్నం, గుంటూరు-విజయవాడతో పాటు తిరుపతిని కూడా మెగా సిటీగా అభివృద్ధి చేయాలని సూచించింది. 2051 నాటికి తిరుపతి జనాభా 14 లక్షలకు చేరుకుంటుంది.. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెగా సిటీగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడింది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి పారిశ్రామికాభివృద్ధి ఒక్కటే శరణ్యమని విశ్లేషించింది. తెరపైకి శ్రీకాళహస్తి స్పైన్.. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే రైలుమార్గాలు అత్యంత ఆవశ్యకమని తేల్చింది. తరచుగా వచ్చే తుఫాన్లు, సముద్ర అలల తాకిడి వంటి ప్రతికూల పరిస్థితులు విశాఖ-చెన్నై రహదారిలో రవాణాకు అడ్డంకిగా మారుతాయని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. పైగా ఆ మార్గంలో రవాణా ఖర్చులు సైతం అధికంగా ఉంటాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి స్పైన్‌ను తెరపైకి తెచ్చింది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం నిర్మిస్తే.. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడింది. ఆ రైలు మార్గాన్ని కృష్ణపట్నం, దుగరాజపట్నం ఓడరేవులతో అనుసంధానం చేస్తే.. నవ్యాంధ్ర పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలుస్తుందని విశ్లేషించింది. శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకూ 308 కిమీల మేర రైలు మార్గం నిర్మాణానికి రూ.1500 కోట్లు అవసరమని తేల్చింది. అత్యంత ప్రధానమైన ఆ రైలుమార్గానికి ఇప్పటిదాకా రూ.1.76 కోట్లే ఖర్చు చేశారని వివరించింది. 2013-14 బడ్జెట్లో రూ.కోటి.. 2014-15 బడ్జెట్లో రూ.ఐదు కోట్లను మాత్రమే శ్రీకాళహస్తి-నడికుడి మార్గానికి కేటాయించారని.. నిధుల కేటాయింపులో అలసత్వం పారిశ్రామికాభివృద్ధిపై పెను ప్రభావం చూపుతుందని తెలిపింది. రవాణ సౌకర్యాలే అడ్డంకి.. సీమ పారిశ్రామికాభివృద్ధికి రవాణా మార్గాలు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా కమిటీ పేర్కొంది. కడప-మదనపల్లె-బెంగళూరు రైలుమార్గం పూర్తయితే సీమ పారిశ్రామికాభివృద్ధి సుసాధ్యమయ్యే అవకాశం ఉందని తెలిపింది. 225 కి.మీల పొడవున నిర్మించే ఈ రైలుమార్గం అంచనా వ్యయం రూ.2,250 కోట్లని పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఆ రైలుమార్గాన్ని వేగంగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. జాతీయ రహదారులు, రైలుమార్గాలతోపాటు వాయుమార్గాల(ఎయిర్ కనెక్టివిటి)ను కూడా అభివృద్ధి చేయాలని పేర్కొంది. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అభివృద్ధి చేయాలని సూచించింది. ఇందుకు రూ.1200 కోట్ల మేర వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైలు మార్గాలను పూర్తిచేసి.. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తే దక్షిణాంధ్ర(రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం) పారిశ్రామికాభివృద్ధి సాధించడం ఖాయమని పేర్కొంది. శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తే జిల్లా అభివృద్ధికి తిరుగుండదని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. -
అంతర్జాతీయ విమానాశ్రయం.. తూచ్
తిరుపతి ఎయిర్‌పోర్టుకు ఇంటర్నేషనల్ హోదా మాత్రమే! విస్తరణకు అనువుగా లేదన్న అలోక్ సిన్హా కమిటీ నత్తనడకన విమానాశ్రయ విస్తరణ పనులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేవని ఐఐఏ(ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతినిధి బృందం తేల్చిచెప్పింది. కేవలం అంతర్జాతీయ హోదా కల్పిస్తామని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. రోజూ తిరుమలకు వేలాదిమంది భక్తులు వస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ నాణ్యమైన సోనా బియ్యం.. మామిడి, చీనీ, దానిమ్మ, కూరగాయల ఉత్పత్తి జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి రొయ్యలు, చేపలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఉన్న చిత్తూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా సాగుతోంది. దీన్ని పసిగట్టిన కేంద్రం తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తామని అక్టోబర్ 8, 2008న అప్పటి కేంద్ర విమానయానశాఖ మంత్రి ప్రపుల్‌కుమార్ ప్రకటించారు. సెప్టెంబర్ 1, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు హోదా కల్పించే పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆ హామీకి స్థానం కల్పించారు. లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రధాని నరేంద్రమోడీ ఇదే విషయంపై మరోసారి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐఐఏ చైర్మన్ అలోక్ సిన్హా నేతృత్వంలోని ఐఐఏ ప్రతినిధి బృందం మంగళవారం తిరుపతి విమానాశ్రయాన్ని సందర్శించింది. చేతులెత్తేసిన ఐఐఏ.. అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలంటే రన్‌వే కనీసం 12,500 అడుగుల మేర ఉండాలి. కనీసం ఏడాదికి పది మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు(టెర్మినల్, ఎయిర్‌క్రాఫ్ట్ బేస్, కామన్ చెక్ పాయింట్లు, సెల్ఫ్ చెక్ పాయింట్లు, ఇమ్మిగ్రేషన్ సెంటర్లు, ఫోర్ లెవల్ బ్యాగేజ్ సిష్టం, ఏఫ్రాన్) కల్పించాలి. ఇందుకు కనీసం మూడు వేల ఎకరాల భూమి అవసరమని ఐఐఏ ప్రతినిధి బృందం తేల్చింది. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం 140 ఎకరాల్లో ఉంది. 7,500 అడుగుల మేర రన్ వే ఉంది. రోజుకు కేవలం 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే విమానాశ్రయంలో ఉన్నాయి. రన్‌వే విస్తరణకు తూర్పున వికృతమాల ఎస్సీ కాలనీ.. పశ్చిమాన మర్రిగుంట గ్రామం, మర్రికుంట, యాదయ్యకుంట, శేషయ్యకుంట, కొత్తపాళెం చెరువులు, వందలాది వాగులు, వంకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రన్‌వేను 12,500 అడుగుల నుంచి తొమ్మిది వేలకు కుదించినా.. ఆ మేరకు భూమి లభ్యత కాదు. అవసరమైన మేరకు భూమి లభించకపోవడం వల్ల తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయలేమని అలోక్ సిన్హా కమిటీ మంగళవారం తేల్చింది. తిరుపతి విమానాశ్రయానికి అంత్జాతీయ హోదా మాత్రమే కల్పించవచ్చునని స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుకు నివేదిక ఇచ్చింది. నత్తనకడన హోదా పనులు.. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు 702 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. ఆ మేరకు విమానాశ్రయం చుట్టుపక్కలా భూమి ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 290 ఎకరాలు ప్రభుత్వ భూమి. తక్కిన 412 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది. నష్టపరిహారం చెల్లింపుపై భూ నిర్వాసితులు పేచీ పెట్టడంతో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రాలేదు. రూ.100 కోట్లతో టెర్మినల్, రూ.80 కోట్లతో రన్‌వే నిర్మించాలని ఐఐఏ అంచనా వేసింది. భూసేకరణ పూర్థిస్థాయిలో జరగకపోయినా జూలై 22, 2011న అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు టెండర్లు పిలిచింది. రూ.96 కోట్లకు పనులను దక్కించుకున్న కేఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది. కానీ.. ఇసుకనేల కావడంతో పనులు గిట్టుబాటు కావని కేఆర్ఆర్ ఇన్ఫ్రా ఆదిలోనే చేతులెత్తేసింది. అవే పనులను త్రీటీ అనే సంస్థ చేపట్టింది. గిట్టుబాటు కావడం లేదని త్రీటీ సంస్థ కూడా చేతులెత్తేసింది. ఇసుకనేల కావడం వల్ల విమానాశ్రయం నిర్మాణానికి 30 అడుగుల బదులు 60 అడుగుల పునాది వేయాల్సి వస్తోందని.. పనులు గిట్టుబాటు కావడం లేదని ఆ సంస్థ స్పష్టీకరించింది. దాంతో.. ఆ టెండరును రద్దు చేసిన ఐఐఏ మరోసారి టెండర్లు పిలిచింది. రూ.124.19 కోట్లతో ఐఐఏ ఇంజనీరింగ్ విభాగం, శ్యామ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టాయి. ఆ పనులు కూడా నత్తనడకన సాగుతుండటంపై ఐఐఏ ప్రతినిృధిబందం అసంతృప్తి వ్యక్తం చేసింది. -
రాజధానిపై అయోమయం
-
రాజధానిపై అయోమయం
* కొత్త ప్రాంతాల అన్వేషణలో సర్కారు * ప్రభుత్వ భూములున్న ప్రాంతాల పరిశీలన * ఏర్పేడు-వెంకటగిరి మధ్య 40 వేల ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి * తిరుపతి విమానాశ్రయం, జాతీయ రహదారి, కృష్ణపట్నం, దుగరాజపట్నం పోర్టులకు సులువుగా రవాణా * పూర్తి స్థాయి సర్వే జరపాలంటూ చిత్తూరు, నెల్లూరు జిల్లాల రెవెన్యూ అధికారులకు సర్కారు ఆదేశం * దొనకొండలో 40 వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందన్న ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉంటుందంటూ వ్యూహాత్మకంగా తెలుగుదేశం నేతలు చేసిన ప్రచారానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సృష్టిస్తున్న హడావుడితో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో కొత్త రాజధానికి భూ సేకరణ అతిపెద్ద సవాలుగా మారనుంది. దీనికితోడు రాజధానికి చాలినన్ని భూముల లభ్యతపైనా సందేహాలు అలుముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ భూములెక్కడున్నాయి? అలా ప్రభుత్వ భూములున్న ప్రాంతాల్లో రాజధానికి అనువైన ప్రాంతాలేవీ? వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో అధికారులు ఎక్కడికక్కడ వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. తాజాగా అధికారులు అందిస్తున్న నివేదికలతో ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దులోని వెంకటగిరి తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు-నెల్లూరు జిల్లా వెంకటగిరి మధ్య సుమారు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, 30 వేల ఎకరాలదాకా అటవీ భూమి ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే ఎకరం భూమి కూడా కొనాల్సిన పని ఉండదని సీఎంకు నివేదించారు. వెంకటగిరికి 3 కి.మీ. దూరంలోనే తెలుగుగంగ కాలువ ఉండగా.. 30 కి.మీ. దూరంలో కండలేరు రిజర్వాయరు ఉన్నందున సులువుగా నీటిని సరఫరా చేయవచ్చని సూచించారు. వరదముప్పు కూడా లేనందున పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎంత భూమి అందుబాటులో ఉందో తేల్చాలంటూ ప్రభుత్వం చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు సమాచారం. వెంకటగిరి నుంచి 30 కిలోమీటర్లలోపే రేణిగుంట విమానాశ్రయముంది. రెండున్నర గంటల్లో చెన్నయ్ విమానాశ్రయానికి చేరుకునే వీలుంది. గంట వ్యవధిలోనే కృష్ణపట్నంతోపాటు ప్రతిపాదిత దుగరాజపట్నం పోర్టుకు చేరుకునే వీలుంది. వెంకటగిరి నుంచి 39 కిలోమీటర్ల దూరం నాలుగులేన్ల రహదారి నిర్మించుకుంటే నాయుడుపేట వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానించే వీలుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దొనకొండపైనా నివేదిక.. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో 40 వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ, అటవీ భూమి ఉన్నట్లు లెక్కతేల్చిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ప్రాంతంలోని అటవీ భూమిని డీ నోటిఫై చేయిస్తే రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందనే సూచనలు సర్కారుకు అందాయి. దొనకొండకు సమీపంలోనే సాగర్ కెనాల్, వెలిగొండ రిజర్వాయర్లు ఉండటంతో ఇక్కడి నుంచి నీటిని తరలించుకోవచ్చని ప్రతిపాదించారు. పైగా ఇక్కడున్న పురాతన విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించుకునే అవకాశాలూ ఉన్నాయని నివేదించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకేచోట ప్రభుత్వ భూముల్లేవు... కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు జరిపించిన సర్వేలో నిడిముక్కల, మోతడక, కర్లపూడి, పెదమద్దూరు, తాడేపల్లి, కొండవీడు ప్రాంతాల్లో 16,935.7 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి(వీజీటీఎం) అభివృద్ధి సంస్థ పరిధిలో 5,178.75 ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్ భూములున్నట్లు గుర్తించారు. అయితే ఇందులో ఎక్కడా నాలుగైదు వేల ఎకరాల భూమి ఒకేచోట లేదు. కాగా ఉడా భూమిలో తాడికొండ వద్ద గల లాంఫారమ్‌లోని 534 ఎకరాలను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదించారు. 676 ఎకరాలు తాడికొండ చెరువుగా పేర్కొన్నారు. దీనినిబట్టి ఈ ప్రాంతంలో అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యే నివాసగృహాలు, ఐఏఎస్‌ల నివాసగృహాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకోసం తప్పనిసరిగా రైతులనుంచి భూమి కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. గుంటూరు జిల్లా అమరావతి పరిసర ప్రాంతాల్లో 10,292 ఎకరాల అటవీ భూమి ఉన్నా ఈ ప్రాంతం వరద తాకిడికి గురవుతూ ఉండటంతో ఇక్కడ రాజధాని నిర్మాణం క్షేమం కాదన్న భావన వ్యక్తమైంది. మరోవైపు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మార్గంలో సుమారు 14 వేల ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములను గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో కాలుష్య కారక కర్మాగారాలున్నందున రాజధాని నిర్మాణానికి తగదని అధికారులే అభిప్రాయపడ్డారు. దీనికితోడు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉంటుందంటూ సీఎం చంద్రబాబుతోసహా టీడీపీ నేతలు చేసిన ప్రచారంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు భూసేకరణ సవాలుగా మారింది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేయనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌కు స్థలాలను ఇక్కడే గుర్తించినందున రాజధాని ఈ ప్రాంతంలో ఉండబోదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా అందుతున్న సమాచారంతో ఇప్పటికే ఇక్కడి భూముల ధరలు పెంచేసి అగ్రిమెంట్లు చేసుకుంటూ కృత్రిమ మార్కెట్‌ను సృష్టించిన వ్యాపారులు తాము కొనుగోలు చేసిన భూముల అమ్మకాలపై దృష్టి సారించారు. -
రూ. 125 కోట్లతో తిరుపతి విమానాశ్రయం ఆధునీకరణ
చిత్తూరు: తిరుపతి విమానాశ్రయాన్ని 125 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు కేంద్ర విమానయానా శాఖ మంత్రి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. ఆయన ఈరోజు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓనం పండుగ సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.