సాక్షి, తిరుపతి: తిరుపతి విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రన్ వేలో ఏర్పడిన సమస్యలతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్, విజయవాడ వెళ్లే విమానాలు నిలిపి వేయడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎయిర్‌పోర్ట్ మూసివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరికొన్ని గంటల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment