ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్ పట్టివేత : నలుగురి అరెస్ట్
చిత్తూరు : తిరుపతి విమానాశ్రయంలో ఆర్డీఎక్స్ కలకలం సృష్టించింది. పేలుడు పదార్థాలతో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను తిరుపతి ఎయిర్‌పోర్ట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా లిక్విడ్ ఆర్డీఎక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నలుగురి అనుమానితులను ఎయిర్పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారీగా లిక్విడ్ ఆర్డీఎక్స్ను గుర్తించారు. పోలీసు ఉన్నతాధికారులు నలుగురిని విచారిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు వ్యాపార నిమిత్తం వచ్చిన వీరు.. తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయంలో పట్టుబడినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.