
తిరువనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి కేరళకు తీసుకువచ్చిన 155 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి తీసుకువచి్చన గంజాయిని తిరువనంతపురంలోని పల్లితురలోని ఓ గోదాములోకి మార్చుతుండగా అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు.
గంజాయితోపాటు 61 గ్రాముల ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరువనంతపురం నుంచి విశాఖకు వెళ్లిన నలుగురిలో ఇద్దరు విమానంలో తిరిగి రాగా మిగిలిన ఇద్దరు వాహనంలో డ్రగ్స్‌ను తీసుకువచ్చారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment