GANJA TRANSPORT
-
విశాఖ నుంచి కేరళకు గంజాయి
తిరువనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి కేరళకు తీసుకువచ్చిన 155 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి తీసుకువచి్చన గంజాయిని తిరువనంతపురంలోని పల్లితురలోని ఓ గోదాములోకి మార్చుతుండగా అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు 61 గ్రాముల ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరువనంతపురం నుంచి విశాఖకు వెళ్లిన నలుగురిలో ఇద్దరు విమానంలో తిరిగి రాగా మిగిలిన ఇద్దరు వాహనంలో డ్రగ్స్‌ను తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. -
డీసీఎంను రీ డిజైన్ చేసి గంజాయి సరఫరా
నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే 400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్ వీరన్న, శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన కేతావత్ శంకర్‌నాయక్, వరంగల్ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు శనివారం ఉదయం డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐలు మల్లికార్జున్‌రెడ్డి, మహేష్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
అరకు నుంచి గంజాయి తరలిస్తూ బస్‌ను ఓవర్టేక్ చేయబోయి..
పెందుర్తి: నాయుడుతోట సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్ద బీఆర్టీఎస్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన గోపీ మనోజ్ (23), అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌కు చెందిన శేఖరమహంతి వరుణ్ కలిసి అరకు నుంచి నగరానికి స్కూటీపై వెళుతున్నారు. ఆర్ఆర్ వెంకటాపురం వద్దకు వచ్చే సరికి ముందు వెళుతున్న ఆర్టీసీ బస్‌ను ఓవర్టేక్ చేసే క్రమంలో స్కూటీ అదుపు తప్పింది. దీంతో రోడ్డుపై తుళ్లిపడిన మనోజ్ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న వరుణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరు ప్రయాణించిన స్కూటీని పరిశీలించగా అందులో రెండున్నర కిలోల గంజాయి(రెండు ప్యాకెట్లు) కనిపించింది. ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న క్రమంలో వీరు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన మనోజ్ నగరంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. గాయపడ్డ వరుణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్ఐ బి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Guntur: ఫోన్ మాట్లాడుతుండగా బస్సు ఢీకొని యువకుడు మృతి -
జెడ్పీటీసీ హత్యాయత్నానికి కుట్ర.. గుట్టు రట్టుచేసిన పోలీసులు! ప్లాన్ ఇదీ..
సూర్యాపేట క్రైం : జాజిరెడ్డిగూడెం జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ను మట్టుబెట్టుందుకు సుపారీ తీసుకున్న ఓ ముఠాను ముందస్తుగా అరెస్టు చేసినట్లు హత్యాయత్నాన్ని భగ్నం చేసినట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలతోనే జెడ్పీటీసీని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించేందుకు ఇద్దరు సమీప బంధువులతో పాటు మరొకరు కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. సూత్ర, పాత్రధారుల్లో నలుగురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. బుధవారం సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన దావుల వీరప్రసాద్ యాదవ్, ముదిరాజ్ కులానికి చెందిన లింగంపల్లి జగన్నాథం రెండో భార్య కూతురు మనీషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం జగన్నాథం అనారోగ్యంతో చనిపోగా తలగొరివి పెట్టే విషయంలో గొడవ జరిగింది. జగన్నాథం పెద్ద భార్య కుమార్తె కవితతో తలగొరివి పెట్టించాలని అనుకోగా రెండవ భార్య కుమార్తె శ్వేతతో తలగొరివి పెట్టించారు. అప్పటి నుంచి జగన్నాధం అన్న కొడుకు లింగంపల్లి సుధాకర్, అతడి బంధువులు, వీరప్రసాద్‌కు మనస్పర్థలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ విషయాల్లో తలదూరుస్తూ.. దావుల వీరప్రసాద్ తరచూ జగన్నాథం కుటుంబ విషయాల్లో తలదూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరప్రసాద్ కొద్దిరోజుల క్రితం తోడల్లుడు జిన్నే శ్రీను, అతడి కుమారుడు అశ్విన్‌లపై అర్వపల్లి కి చెందిన మేకల సంతోష్‌పై జరిగిన దాడి విషయంలో తప్పుడు కేసులు పెట్టించాడు. దీంతో వారు జెడ్పీటీసీపై కోపం పెంచుకున్నారు. దీంతో పాటు ఇదే గ్రామానికి చెందిన లింగంపల్లి సంజయ్ 3 గుంటల భూమి పంచాయితీలో దావుల వీరప్రసాద్ తలదూర్చి భూమి రాకుండా అడ్డుపడినట్లు అనుమానం పెంచుకున్నారు. మూసీ మాజీ చైర్మన్ అలువాల వెంకటస్వామి ఇంటిపై కూడా బండి సంజయ్ గ్రామానికి వచ్చిన సమయంలో దావుల వీరప్రసాద్ అనుచరులు గొడవ చేశారని కక్ష పెంచుకున్నారు. అడ్డు తొలగించుకోవాలని.. ప్రతి విషయంలో అడ్డుతగులుతున్న వీరప్రసాద్ మట్టుబెట్టాలని లింగంపల్లి సుధాకర్, జిన్నే శ్రీను, అలువాల వెంకట స్వామి నిర్ణయించుకున్నారు. అందుకు కిరాయి హంతకుడు ప్రస్తుతం పూణేలో ఉంటున్న బంధువు లింగంపల్లి సంజయ్‌ను సంప్రదించారు. అతడి ద్వారా రౌడీ షీటర్ పోతురాజు సైదులుతో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 22న జనగాం క్రాస్ రోడ్డులోని ఓ బార్లో జిన్నా శ్రీను మినహా మిగిలిన నలుగురు కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా పట్టణంలోనే మారణాయుధాలు కొనుగోలు చేశారు. గంజాయి విక్రయిస్తున్నారని.. పట్టణంలోని సీతారాంపురం కాలనీలోని రౌడీ షీటర్ పోతరాజు సైదులు ఇంట్లో గంజాయి కలి గిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్న సమాచారంపై బుధవారం సీఐ అర్కపల్లి ఆంజనేయులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ లింగంపల్లి సుధాకర్, లింగంపల్లి సంజయ్, పోతరాజు సైదులును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి, రెండు వేట కొడవళ్లు, కంకి కొడవలి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడే ఉండగా అలువాల వెంకట స్వామి మారుతీవ్యాన్‌లో రావడంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. వ్యాన్‌ను సోదా చేయగా కత్తి లభించింది. వ్యాన్‌తో పాటు మారణాయుధాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా హత్యకుట్ర విషయం బయటపడిందని తెలిపారు. కాగా, ఈ కేసులో జిన్నా శ్రీను పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన టౌన్ సీఐ అర్వపల్లి ఆంజనేయులు , ఎస్ఐ శ్రీనివాస్, చివ్వెంల ఎస్ఐ విష్ణు, ఐటీ కోర్ ఎస్ఐ శివ కుమార్, క్రైం సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్, సైదులు, శ్రవణ్, మల్లేశ్‌లను ఎస్పీ అభినందించారు. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
ఒకపక్క ఉక్కుపాదం.. మరోపక్క గుప్పు గుప్పు
సాక్షి, నెట్వర్క్: ఎంత ఉక్కుపాదం మోపినా గంజాయి ఇంకా గుప్పుమంటూనే ఉంది. రవాణా చేస్తూ కొందరు.. పంట సాగుచేస్తూ ఇంకొందరు.. ఇంట్లోనే పెంచుతూ ఒకరు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆయా దాడుల్లో దాదాపు 600 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకోగా, పదుల సంఖ్యలో మొక్కల్ని పోలీసులు ధ్వంసం చేశారు. గురువారం నమోదైన ఆయా కేసుల వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని మారేడుమిల్లి నుంచి రాజమండ్రి, అశ్వారావుపేట, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు నిందితులు ట్రాలీ అడుగు భాగంలో ప్రత్యేక అరను తయారుచేసి 566 కేజీల గంజాయి ప్యాకెట్లను రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సత్తుపల్లిలో బుధవారం రాత్రి సదరు ట్రాలీని, అందులోని రూ.1.42 కోట్ల విలువైన 566 కేజీల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు గురువారం ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్లు యోగేష్ లింబాజీ థోర్వ్, ఇర్ఫాన్ సదర్ పఠాన్‌ను అరెస్ట్చేశామని, మరో ప్రధాన నిందితుడు గణేష్ ఉబలే పరారీలో ఉన్నాడని తెలిపారు. దర్జాగా రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణం ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన నిలంచల పట్నాయక్, ప్రకాష్‌చంద్ర బెహర డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయిని ముంబైలో అమ్మాలనుకున్నారు. 20 కేజీల ఎండు గంజాయిని 4 ప్యాకెట్లుగా ప్యాక్‌చేసి రెండు క్లాత్‌బ్యాగుల్లో పెట్టి అనుమానం రాకుండా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు వరంగల్ రైల్వేస్టేషన్‌కు రాగానే పోలీసులు అనుమానంతో వీరిని తనిఖీచేయగా గుట్టురట్టయింది. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు అమ్మకం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని మడద క్రాసింగ్ వద్ద వాహన తనిఖీల్లో ఇద్దరు యువకుల నుంచి పోలీసులు 280 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మెదక్ జిల్లా రామాయంపేటలో విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న నవీన్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని 3 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బయట దొరకట్లేదని ఇంట్లోనే సాగు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధి అరుంధతినగర్‌లో ఉండే ఆయాజ్‌ఖాన్ అంబులెన్స్ డ్రైవర్. గంజాయి మత్తుకు అలవాటుపడిన అతడు.. బయట ఎక్కడా సరుకు దొరక్కపోవడంతో ఇల్లు అద్దెకు తీసుకొని మేకలను పెంపకం మాటున గంజాయి మొక్కల్ని పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడిచేసి గంజాయి మొక్కలను, 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. పత్తిచేనులో ‘మత్తు’సాగు ఆదిలాబాద్ జిల్లా బొసార గ్రామంలో, బోథ్ మండలం పార్డి కె గ్రామ శివారులో పత్తిచేను మాటున గంజాయి సాగుచేస్తున్న క్షేత్రాలపై పోలీసులు దాడులు చేశారు. రెండుచోట్లా 80 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. సాగుచేస్తున్న రైతులు సీతారాం, ఈశ్వర్‌పై కేసు నమోదుచేశారు. -
సరిహద్దుల్లో మాఫియా..
భద్రాచలం: అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలతో భద్రాచలం ప్రాంతం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రగిరి మీదుగా గంజాయి పెద్ద ఎత్తున తరలిపోతోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల బోర్డర్లు కూడా ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉండటంతో స్మగ్లింగ్‌కూ అడ్డాగా మారుతోంది. కొందరు మాఫియాగా ఏర్పడి, గంజాయి, టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఉండే నాలుగు రాష్ట్రాల అటవీ ప్రాంతాన్ని స్మగ్లింగ్‌కు సేఫ్‌జోన్‌గా చేసుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన సురేష్ అనే వ్యక్తి జాతీయ నిఘా విభాగం ఎస్ఐగా నకిలీ అవతరమెత్తి ఎటపాక(ఆంధ్రా) పోలీస్ స్టేషన్‌ను కేంద్రంగా అనేక దందాలకు పాల్పడ్డాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటంతో అతను నిఘా విభాగానికి చెందినవాడే అయిఉండవచ్చని అటు ఏపీ పోలీసులు నకిలీ ఎస్సై బాగోతాలపై ఏమాత్రం దృష్టి సారించలేకపోయారు. గంజాయి రవాణాకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి భద్రాచలం మీదుగానే తీసుకెళ్తున్నారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో ఎక్సైజ్ శాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఉన్నా ఫలితంలేకుండా పోయింది. రంగారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పాడి గేదెలను దొంగతనంగా తీసుకొచ్చిన ఓ వ్యక్తి వాటిని భద్రాచలానికి సమీపంలోని ఎటపాకలో ఉంచి విక్రయాలు చేస్తూ, దర్జాగా వ్యాపారం సాగించాడు. ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించే వరకు ఈ మోసగాడి బాగోతం బయటకు రాలేదు. భద్రాచలంలో పట్టుబడిన కలప(ఫైల్) భద్రాచలం ఇందిరాక్రాంతి పథం కార్యాలయంలో క్లస్టర్ కో ఆర్డినేటర్‌గా పనిచేసే సాంబశివరావు కొంతకాలం క్రితం ఇక్కడికి సమీపంలోని ఏపీలో గల గుండాల జామాయిల్ తోటలో హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ప్రాంతం ఏపీలో ఉండటంతో అక్కడి పోలీస్టేషన్లో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు పూర్వాపరాలు మొత్తం తెలంగాణలోని భద్రాచలంతో ముడిపడి ఉండటంతో ఇప్పటి వరకూ ఈ కేసు మిస్టరీని వెల్లడించలేదు. గిరిజన ప్రాంతం కావటంతో సారాయి తయారీ జోరుగానే సాగుతోంది. నల్లబెల్లం భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉన్న గుండాల, పురుషోత్తపట్నం, తుమ్మల గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు. కానీ వ్యాపారులంతా భద్రాచలానికి చెందిన వారే. ఇక్కడి ఎక్సైజ్ అధికారులు ఒక్కో సారి హద్దులను దాటి ఏపీలోకి వెళ్లి కూడా బెల్లం నిల్వలను స్వాధీనం చేసుకుని, ఇక్కడి వ్యాపారస్తులపై కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ వేరే రాష్ట్రంలో ఎలా దాడులు చేస్తారని వ్యాపారస్తులు వారిపైనే ఎదురుదాడి చేస్తున్నారు. నిఘా పెంచాల్సిందే.. సరిహద్దుల సమస్య ఇక్కడి అధికారులకు కూడా తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెంచాల్సి ఉంది. కొన్నివర్గాల పేరుతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కూడా నిశిత పరిశీలన అవసరం ఉంది. ఆ దిశగా రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం వాసులు కోరుతున్నారు. -
తూర్పు వయా పశ్చిమ
జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు లేదు. అయినా.. ప్రధాన దారుల్లో దాని ఘాటు గుప్పుమంటోంది. తూర్పు అటవీ ప్రాంతం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా టన్నుల కొద్దీ గంజాయి తరలిస్తున్నారు. ఇందుకోసం వ్యాన్లతోపాటు అత్యంత ఖరీదైన కార్లను సైతం వినియోగిస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులు సాగుతున్నాయి. ఈ స్మగ్లర్ల మాఫియా పోలీస్ శాఖలోని కీలక అధికారులను సైతం వశం చేసుకుని దందా నడిపే స్థాయికి ఎదిగింది. తాజాగా.. బుధవారం దేవరపల్లి, గోపాలపురం సమీపంలోని జగన్నాథపురం వద్ద వెయ్యి కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గంజాయి అక్రమ రవాణాకు మన జిల్లా కేంద్రంగా మారుతోంది. విశాఖపట్నంలోని ఏజెన్సీ గ్రామాల నుంచి నర్సీపట్నం కేంద్రంగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణాలో కీలక పాత్రధారులు జిల్లాకు చెందిన వారు ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటుతోం ది. దేవరపల్లిలో బుధవారం 800 కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకోగా.. గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద ప్రమాదానికి గురైన కారులో మరో 200 కేజీలు లభ్యమైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఇటీవల కాలంలో కొవ్వూరు–గోపాలపురం మధ్య పోలీసులు తరచూ దాడులు నిర్వహించిన భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా.. అక్రమ రవాణా ఆగటం లేదు. హైదరాబాద్, మహారాష్ట్ర వరకూ.. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాం తాల్లో గంజాయి సాగు పెద్దఎత్తున జరుగుతోంది. విశాఖలో పండించిన గంజాయిని నర్సీపట్నం కేంద్రంగా.. తూర్పు గోదావరి జిల్లా చింతూరు, డొంకరాయి అటవీ ప్రాంతాల్లో పండించిన గంజా యిని అక్కడి నుంచి నేరుగా రవాణా చేస్తున్నారు. ఇందుకోసం మన జిల్లా మీదుగా ప్రత్యేకమైన రూట్లను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా కొందరు.. దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకా తిరుమల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా మరికొందరు సరుకును రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందుకు జిల్లాలోని వ్యక్తులతోపాటు కొందరు పోలీసులు సైతం సహకరిస్తున్నట్టు తెలు స్తోంది. ఇటీవల గంజాయి రవాణా వ్యవహారంలో తలదూర్చిన చింతలపూడి సీఐ జి.దాస్‌పై సస్పెన్షన్ వేటు పడిన విషయం విదితమే. ఫిబ్రవరి 21న గంజాయి లారీని పోలీసులు స్వాధీనం చేసుకోగా.. ప్రధాన నిందితుడిని వదిలేసేందుకు సీఐ రూ.4 లక్షలు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ప్రధాన నిందితుడు ప్రతినెలా, ప్రతి లోడుకు కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారం బయటపడటంతో సీఐపై వేటు పడింది. గతనెల 12న దేవరపల్లి వద్ద వ్యాన్‌లో మామిడికాయల మాటున తరలిస్తున్న 330 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌లోనూ జిల్లా వాసులు నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో అంతర్ రాష్ట్ర గంజాయి వ్యాపారి గుట్టును కశింకోట పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులున్న ముఠాను శనివారం అరెస్ట్ చేసి వారినుంచి 504 కిలోల గంజాయి, మూడు దేశీయ పిస్తోళ్లు, వ్యాన్, కారు, మోటార్ సైకిల్, రూ.17,500 నగదు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు విశాఖ ఏజెన్సీలో కొనుగోలు చేసిన గంజాయిని ప్యాకెట్ల రూపంలో గోనె సంచుల్లో నింపి ఇతర రాష్ట్రాలకు వ్యాన్లు, కార్లలో తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం శిరగాలపలి్లకి చెందిన శ్రీనివాసరావు అలియాస్ బాబా, విశాఖ జిల్లాకు చెందిన కొందరిని కలుపుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. శ్రీనివాసరావు పదేళ్లగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. స్వగ్రామంలో తొలుత కట్టెల వ్యాపారం చేసేవాడు. లాభదాయకంగా ఉండటంతో గంజాయి స్మగ్లింగ్ బాట పట్టాడు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని శ్రీని వాసనగర్‌లో ఉంటూ.. కొంతమందితో ముఠా కట్టి విశాఖ ఏజెన్సీ నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పెద్దఎత్తున రవాణా చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కూడబెట్టిన సంపాదనతో రాజమండ్రిలో ఒక ప్లాట్, తన గ్రామంలో ఎకరం భూమి, ఇల్లు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. జిల్లాలోని దేవరపల్లి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసు స్టేషన్లలోనూ ఇతనిపై గంజాయి రవాణా కేసులున్నాయి. ప్రత్యర్థి ముఠాలతో విభేదాలున్న నేపథ్యంలో అతడు ఆయుధాలు కూడా కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తాజాగా దేవరపల్లిలో పోలీసులకు 800 కిలోల గంజాయి పట్టుబడింది. గోపాలపురం వద్ద కారు ప్రమాదానికి గురికాగా, అందులో రవాణా చేస్తున్న గంజాయి కూడా బయటపడింది. ఆ కారులో వేర్వేరు నంబర్ ప్లేట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదానికి గురి కాకపోతే ఈ గంజాయి గమ్యస్థానానికి సురక్షితంగా చేరేదే. ఒకేరోజున పెద్దఎత్తున గంజాయి పట్టుబడటంతో, రోజూ ఎంత మొత్తంలో తరలి వెళుతోందోనన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.