four arrested
-
విశాఖ నుంచి కేరళకు గంజాయి
తిరువనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి కేరళకు తీసుకువచ్చిన 155 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి తీసుకువచి్చన గంజాయిని తిరువనంతపురంలోని పల్లితురలోని ఓ గోదాములోకి మార్చుతుండగా అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు 61 గ్రాముల ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరువనంతపురం నుంచి విశాఖకు వెళ్లిన నలుగురిలో ఇద్దరు విమానంలో తిరిగి రాగా మిగిలిన ఇద్దరు వాహనంలో డ్రగ్స్‌ను తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థి స్వాత్విక్ సూసైడ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు నార్సింగి పోలీసులు హాజరుపరిచారు కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. గత మంగళవారం రాత్రి క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. చదవండి: సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. -
గిఫ్ట్ కార్డుల పేరుతో వసూలు
చిత్తూరు అర్బన్: గిఫ్ట్‌కార్డుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కార్లు, బైక్‌లు వచ్చాయంటూ నమ్మబలికి.. జీఎస్టీ, ఎన్వోసీ తదితరాల పేర్లతో లక్షలాది రూపాయలు కొట్టేసిన బిహార్, కర్ణాటకకు చెందిన నిందితులను పోలీసులు చిత్తూరులో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వివరాలను బుధవారం చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలు.. బిహార్‌కు చెందిన ముకేశ్‌కుమార్ ఆన్లైన్ ద్వారా పలు వస్తువులు కొనుగోలు చేసిన 5 లక్షల మంది చిరునామాలను సంపాదించాడు. ప్రతి ఒక్కరి అడ్రస్‌కు ఓ ఉత్తరం, ఈ–కామర్స్ కంపెనీల స్టాంప్ ముద్రలతో గిఫ్ట్‌కార్డులు పంపించేవాడు. ఆ బహుమతిని సొంతం చేసుకునేందుకు తమను సంప్రదించాలంటూ ఆ ఉత్తరాల్లో తమ ఫోన్ నంబర్లు ఉంచేవాడు. ఇలా చిత్తూరు జిల్లాలో పలువురికి ఉత్తరాలతో పాటు గిఫ్ట్‌కార్డులు వచ్చాయి. వాటిని స్క్రాచ్ చేసి చూడగా.. కార్లు, బైకులు గెల్చుకున్నట్లు ఉంది. దీంతో వారు ఉత్తరంలోని నంబర్లకు ఫోన్ చేయగా.. కారు పంపించేందుకు గాను జీఎస్టీ కింద రూ.5 వేలు కట్టాలని నమ్మబలికారు. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన 26 మంది.. నిందితుడు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఆ సొమ్మును జమ చేశారు. ఆ తర్వాత ఎన్వోసీ కోసమని, ట్యాక్స్ చెల్లించాలని రకరకాల పేర్లతో మభ్యపెట్టి రూ.లక్షల్లో వసూలు చేశారు. చివరకు తాము మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రిషాంత్‌రెడ్డి.. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు, పెనుమూరు ఎస్ఐ అనిల్‌కుమార్ తదితర సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రధాన నిందితుడు ముకేశ్‌తో పాటు కర్ణాటకకు చెందిన సందేష్, కిరణ్, హెచ్ఎస్ కిరణ్, జైనుల్ అబిద్లను చిత్తూరులోని ఫారెస్టు రోడ్డులో పట్టుకున్నారు. నిందితుల నుంచి నకిలీ గిఫ్ట్‌కార్డులు, 30 సెల్ఫోన్లు, 30 ఏటీఎం కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, రూ.1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి.. నగదు రివార్డులు అందజేశారు. -
బాలికపై అఘాయిత్యం కేసులో నలుగురి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం/కడప అర్బన్/సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారానికి సంబంధించిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు.. పఠాన్ సాధక్, షేక్ అబ్దుల్ రసూల్, బత్తల సిమోన్, బి.సిపాయి చిన్నయ్య ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో ఉండగా అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ నీలం పూజిత తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు ఆమె వివరాలను వెల్లడించారు. విచారణలో భాగంగా తనపై నలుగురు అత్యాచారం చేసినట్లు బాలిక వెల్లడించిందన్నారు. చదవండి: కాకినాడ: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, నిందితులపై కేసు నమోదు చేశాక మీడియాలో స్క్రోలింగ్ వచ్చిందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాక అసత్యాలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కడపలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4న ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ నాగరాజుకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఆ ప్రాంత అంగన్వాడీ టీచర్ ద్వారా సమాచారం అందుకున్న మహిళా పోలీసు మల్లేశ్వరి ఒక మైనర్ బాలిక గర్భంతో ఉండి వీధుల్లో తిరుగుతోందని సీఐకి సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన సీఐ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకురమ్మని మహిళా పోలీసుకు సూచించారన్నారు. అయితే బాలిక మానసికస్థితి సరిగా లేకపోవడంతో తన వివరాలను పోలీసులకు వెల్లడించలేకపోయిందన్నారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఎవరో తేలకపోవడంతో సంరక్షణ నిమిత్తం బాలికను మైలవరంలోని డాడీహోంకు తరలించామన్నారు. తండ్రి మానసిక స్థితి కూడా సరిగా లేదు.. ఈ నెల 9న త్రీటౌన్ పరిధిలో ఉన్న బాలిక తండ్రిని గుర్తించి సమాచారం ఇచ్చామని ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. అయితే అతడి మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో ఫిర్యాదు ఇవ్వలేకపోయాడన్నారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీవో హైమావతి ఫిర్యాదు మేరకు ఈ నెల 11న ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ క్రమంలో బయటి వ్యక్తులకు వెళ్లిన పలు వీడియోలను పరిశీలించి కేసులో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాలిక తల్లి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించిందని చెప్పారు. బాలికకు ఆరు నెలలుగా ఒక వ్యక్తితో పరిచయం ఉందని.. అతడు అనుభవించి మోసం చేశాడన్నారు. అంతేకాకుండా అతడి ఇద్దరు బంధువులు కూడా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. నాలుగు నెలల క్రితం ఇంకో వ్యక్తి 20 రోజుల పాటు బాలికను పనిమనిషిగా పెట్టుకొని మోసం చేశాడన్నారు. దర్యాప్తును వేగవంతం చేయండి: వాసిరెడ్డి పద్మ కాగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ఎస్పీ అన్బురాజన్‌తో గురువారం ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని కోరారు. బాలిక ఆరోగ్యం కుదుటపడేవరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్షి్మని హుటాహుటిన బాధిత బాలిక వద్దకు పంపారు. ఈ కేసును కమిషన్ సుమోటోగా స్వీకరిస్తుందని.. బాధితురాలికి అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. -
పిన్నెల్లిపై దాడి కేసులో మరో నలుగురి అరెస్టు
సాక్షి, మంగళగిరి: ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి కేసులో మరో నలుగురు నిందితులను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామం వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 7న జరిగిన జాతీయ రహదారి దిగ్బంధం, ఆందోళనలో భాగంగా ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. ఇప్పటికే తాడికొండకు చెందిన ఉన్నం రామ్మోహన్రావు, చినకాకానికి చెందిన సోమారపు ప్రకాశరావును అరెస్ట్ చేశామన్నారు. తాజాగా శనివారం చినకాకానికి చెందిన కఠారి సాంబవెంకటప్రసాద్, పిడుగురాళ్లకు చెందిన షేక్ ఇంతియాజ్, తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన ఫణిదపు వెంకటసాయి, దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పేరూరి సత్యనారాయణను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ముద్దాయిలకు కోర్టు రిమాండ్ విధించింది. చదవండి: ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాయత్నం పిన్నెల్లిపై హత్యాయత్నం; ఇద్దరి అరెస్టు -
రద్దయి రెండేళ్లయినా...ఇంకా పాతనోట్లు..
అహ్మదాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఆ నోట్లు పెద్దమొత్తంలో పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లోని నౌరాసిలో రూ.3.5 కోట్ల విలువైన పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఓ కారులో ఈ నగదును తరలిస్తుండగా...పోలీసులు పట్టుకున్నారు. పాత నోట్లు పట్టుబడిన విషయాన్ని గుజరాత్ ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పాత కరెన్సీని ఎక్కడకు తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది. గడువు పూర్తి అయిన తర్వాత ఎవరి వద్దనైనా పాత నోట్లు ఉంటే శిక్షార్హం అంటూ కేంద్రం జీవో కూడా అమల్లోకి తెచ్చింది. అయినా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా రద్దయిన నోట్లను సీజ్ చేస్తూనే ఉన్నారు. -
ప్రభుత్వ భూమి ఆక్రమణ..నలుగురిపై కేసు నమోదు
బెల్లంపల్లి ఆదిలాబాద్ : బెల్లంపల్లి కన్నాలబస్తీ వ్యవసాయ మార్కెట్ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు కొందరు సిద్ధపడ్డ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుట్టుచప్పుడు కాకుండా బుధాకలాన్ శివారు సర్వే నంబర్ 170లోని ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు వారం రోజుల నుంచి భూమిని చదును చేయిస్తున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ భూమిని పరిశీలించారు. సదరు భూమి సర్వే నంబర్ 170 పీపీ అని నిర్ధారించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చదును చేయించడం సరికాదని, వెంటనే పనులను నిలిపి వేయాలని ఆక్రమణదారులను ఆదేశించారు. అయినా వారు వినలేదు. ఈ విషయాన్ని తహసీల్దార్ కె.సురేశ్.. సబ్ కలెక్టర్ పీఎస్ రాహుల్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సోమవారం ఘటనాస్థలికి వెళ్లి భూ ఆక్రమణను పరిశీలించారు. తక్షణమే నిలుపుదల చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు పాతి పెట్టాలని, తమ ఆదేశాలను ఆక్రమణదారులు అతిక్రమిస్తే పోలీసు కేసు పెట్టాలని హుకూం జారీ చేశారు. దీంతో ఆక్రమణదారులకు వీఆర్వో నచ్చచెప్పిన కబ్జా పనులు మానుకోలేదు. యథావిధిగా చదును చేయించే పనులు ముమ్మరం చేయడంతో మంగళవారం వీఆర్వో లక్ష్మయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఆక్రమిత భూమివద్ద ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. సదరు ఆక్రమిత భూమిని వన్‌టౌన్ ఎస్సై ప్రేమ్ కుమార్, వీఆర్వోతో కలిసి సందర్శించారు. నలుగురిపై కేసు నమోదు ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన బెల్లంపల్లి మధునన్న నగర్‌కు చెందిన నలుగురిపై పోలీసు కేసు నమోరైంది. అక్రమంగా భూ ఆక్రమణకు పాల్పడిన దండెబోయిన భాస్కర్ రెడ్డి, నీలమ్మ, ఎండీ సలీమా, ధోని, రాజేశ్వరిపై తహసీల్దార్ కె.సురేశ్ ఆదేశాల మేరకు వీఆర్వో ఎస్.లక్ష్మయ్య వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో సదరు ఆక్రమణదారులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు. -
తాగొచ్చి కొడుతున్నాడని భర్తను చంపిన భార్య
సాలూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తాగి కొడుతున్నాడన్న కారణంగా తల్లిదండ్రులు, దగ్గర బంధువు సాయంతో భార్యే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పార్వతీపురం ఏఎస్పీ దీపికాపాటిల్ తెలిపారు. శుక్రవారం ఆమె స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ ఇలియాజ్ మహ్మద్‌తో కలిసి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాచిపెంట మండలం బుర్రమామిడివలస గ్రామ సమీపంలో కొండపై ఒడిశాకు చెందిన తిరుపతిగౌడ చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావించి స్థానికులు దహన సంస్కారాలు చేశారు. అయితే విషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో గుట్టు బయటపడింది. బొర్రమామిడివలస గ్రామానికి చెందిన పాగి సోములమ్మ, ఒడిశాకు చెందిన తిరుపతి గౌడ ప్రేమించి, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే సోములమ్మ తల్లిదండ్రులు వివాహాన్ని వ్యతిరేకించడంతో కులపంరంగా 10 వేల రూపాయల తప్పు కట్టి తిరుపతి గౌడ అత్తవారింటిలోనే జీవనం సాగిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా తిరుపతి ప్రతిరోజూ తప్పతాగి వచ్చి సోములమ్మను కొట్టేవాడు. ఈ క్రమంలో ఇటీవల గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వరుసకు సోదరుడైన వ్యక్తితో సోములమ్మ డ్యాన్స్ చేసిందన్న కారణంతో తిరుపతి గౌడ ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సోములమ్మ భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఎలాగైనా అతడ్ని మట్టుబెట్టాలని భావించి తల్లిదండ్రులైన పాగి వెంకటి, జానకమ్మలకు తెలియజేసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 8న సోములమ్మ, ఆమె తల్లిదండ్రులు వెంకటి, జానకమ్మ, దగ్గరి బంధువు తిరగల లక్ష్మణ్‌లు కలిసి ఇంటిలోనే తిరుపతిగౌడను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలో ఉన్న కొండపైకి తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. కొద్దిరోజుల తర్వాత కుక్కల అరుపులతో అక్కడికి వెళ్లిన గ్రామస్తులు చెట్టుకువేలాడుతున్న మృతదేహాన్ని కిందికి దించి దహనసంస్కారాలు చేశారు. కొద్ది రోజుల తర్వాత తిరుపతి గౌడ మరణవార్త తెలియడంతో అతని కుటుంబ సభ్యులు గ్రామాని కి వచ్చి సోములమ్మ కుటుంబ సభ్యులను నిలదీశారు. మరణవార్త తమకెందుకు తెలియజేయలేదని ప్రశ్నించగా వారి నుం చి సరైన సమాధానం రాలేదు. దీంతో మృ తుని కుటుంబ సభ్యులు పాచిపెంట పోలీ సులకు మే 2వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా పూర్తి వివరాలు బయటకువచ్చాయి. -
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
గరివిడి(చీపురుపల్లి) : ఓ పాన్ షాప్‌లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కిందనున్న సురేష్ పాన్‌షాప్‌లో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందన్న రహస్య సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్న పాన్‌షాప్ యజమాని సురేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.53,030 నగదును, ఒక ఆండ్రాయిడ్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వరకట్నం వేధింపుల కేసులో నలుగురు అరెస్టు
పాలకొండ రూరల్: అత్యాశకు పోయి కట్టుకున్న ఇల్లాలిని అదనపు కట్నం కోసం వేధించి ఆమె మృతికి కారణమైన అత్తింటి కుటుంబం చివరకు కటకటాల పాలైంది. సీతంపేట మండలం గుజ్జి గ్రామానికి చెందిన వివాహిత గత నెల 29న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ జి.స్వరూపారాణి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గుజ్జి గ్రామానికి చెందిన నారాయణశెట్టి శివకృష్ణకు హిరమండలానికి చెందిన కేతన అలియాస్ ప్రశాంతి(22)తో 2017 మార్చిలో వివాహమైంది. నిరుపేద కుటుంబానికి చెందిన కేతన వివాహ సమయంలో వారి బంధువులు చందాలు పోగు చేసి కట్నంగా రూ.40వేల నగదుతోపాటు నాలుగు తులాల బంగారాన్ని అందించారు. అయితే వరుడి తల్లిదండ్రులు సూర్యనారాయణ, హేమలతలు తోడికోడలైన కుసుమ అదనపు కట్నం తీసుకురావాలని కేతనను 10 నెలలుగా వేధిస్తూ వచ్చారు. ఇటీవల సంక్రాంతి పండగకు కేతనను పుట్టింటికి తీసుకువచ్చిన భర్త శివకృష్ణ తనకు తులం బంగారం ఇవ్వాలని అత్తమామలను అడిగాడు. అంత ఇచ్చుకోలేక వారు కొంత బంగారాన్ని ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని శివకృష్ణ భార్యను పుట్టింట్లో వదిలి వెళ్లాడు. ఈ క్రమంలో కేతన తండ్రి సర్దిచెప్పి కూతుర్ని భర్త వద్దకు చేర్చాడు. తాను అడిగిన బంగారం తేకపోవటంతో మళ్లీ వేధింపులు ప్రారంభం కావడంతో గత నెల 29న కేతన ఇంటి సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీతంపేట పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి కేతన భర్త, అత్తమామలు, తోటికోడలిని శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
కిడ్నీ రాకెట్ కేసులో పాత్రదారులు అరెస్ట్
-
వృద్ధ దంపతుల హత్యకేసులో నలుగురి అరెస్ట్
కాజీపేట: వృద్ధ దంపతులను హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అజయ్ తెలిపారు. కాజీపేట పోలీసుస్టేషన్లో మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. సోమిడికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సుంచు ఎల్లయ్య (70) మొదటి భార్య చని పోవడంతో కుటుంబసభ్యుల సమ్మతితో పూలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులున్నారు. ఎల్లయ్యకు కుమారులకు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. ఎల్లయ్యకు రెండో కుమారుడు శ్రీనివాస్‌తో తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఓ రోజు ఎల్లయ్య మిమ్మల్ని సర్వనాశనం చేస్తానని అనడంతో మంత్రాలు చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తాడేమోననే భయం శ్రీనివాస్ కుటుంబసభ్యులకు కలిగింది. దీంతో ఎలాగైనా తల్లిదండ్రులను చంపాలని శ్రీని వాస్‌తో పాటు కుమారుడు నిర్ణయించుకున్నారు. అదునుకోసం చూస్తు న్న శ్రీనివాస్ కుమారుడు ఆశిష్ (19) ఈనెల 1న రాత్రి తాత ఎల్లయ్య ఇంటికి మద్యం తీసుకెళ్లి తాగించాడు. రాత్రి ఆరుబయట ఉన్న బాత్రుం కు వచ్చిన పూలమ్మపై ఆశిష్ వెనుక నుంచి దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. పూలమ్మ మెడలో ఉన్న 5తులాల బంగారం గొలుసును జేబు లో వేసుకుని బయట ఉన్న తండ్రి శ్రీనివాస్‌కు ఇచ్చాడు. ఆ తరువాత ఇంట్లో పడుకున్న ఎల్లయ్యపై ఇద్దరు మూకుమ్మడిగా దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పోడవడంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఏం తెలి యనట్లుగా బయటకు వచ్చిన తండ్రీ కొడుకులు ఎల్లయ్య కుమారులు రమేష్, తిరుపతిలకు జరిగిన విషయాన్ని చెప్పడంతో విషయం బయటకు రాకుండా నిందితులకు సహకరించారు. హత్య విషయం 2వ తేదీ వెలుగుచూడడంతో పరారిలో ఉన్న ఆశిష్, శ్రీనివాస్‌లను మంగళవారం కాజీపేట రైల్వేజంక్షన్ ప్రాంతంలో తిరుగుతుండగా పట్టుకుని విచారించారు. ఈ మేరకు ఎల్లయ్య పెద్ద కుమారుడు రమేష్, చిన్న కుమారుడు తిరుపతిల పాత్రను బహిర్గతం చేశారు. వెంటనే వారిద్దరిని సోమిడిలో అదుపులోకి తీసుకుని నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
యువతుల కోసం వశీకరణ కాటుక
చెన్నై: తమిళనాడు పెరంబలూరులో సంచలనం సృష్టించిన క్షుద్రపూజల కార్తికేయన్ ఉదంతంలో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షుద్రపూజలకు పాల్పడిన అతడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెరంబలూరు ఎంఎం నగర్‌కు చెందిన కార్తికేయన్ (32) తన ఇంట్లో క్షుద్రపూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (చదవండి...పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా) ఇలా వుండగా పోలీసులు తాజాగా జరిపిన విచారణలో ఇతగాడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు సమాచారం. కాగా ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్‌ను కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే అతడు నివాసం ఉంటున్న ఇంట్లో యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా
► చేతబడి, వశీకరణ విద్యలతో భుక్తి ► చెక్కపెట్టెలో యువతి మృతదేహం.. పెరంబలూరులో దారుణం ► నరబలి అనుమానంతో మంత్రవాది కార్తికేయన్, భార్య సహా నలుగురు అరెస్ట్ ► మంత్రులు, మాజీ మంత్రులు, బడా రాజకీయనేతలూ పూజలు చేయించుకున్నట్లు విచారణలో వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడతా, వారు ఆశపడిన కోర్కెలు తీరకుండానే మరణించి ఉన్నట్లయితే వారి నుంచే తెలుసుకుంటా...పరిహారాలు చేయించాలని బంధువుల నుంచి సొమ్ము తీసుకుంటా...’ పెరంబలూరులో పోలీసులకు పట్టుబడిన ఒక మంత్రవాది చెప్పిన భయానక మాటలు ఇవి. మానవుని బలహీనతలే అతనికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. మూఢనమ్మకాలే పొట్ట నింపుతున్నాయి. నరబలులు చేసే మాంత్రికుడిగా అనుమానిస్తూ కార్తికేయన్ అనే మంత్రవాదిని, అతని భార్య నశీమా అలియాస్ దీపిక, ఇద్దరు సహచరులను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. కార్తికేయన్ వద్దకు మంత్రపూజల నిమిత్తం తమిళనాడు, పుదుచ్చేరీలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, బడా రాజకీయనేతలు వస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... తమిళనాడులోని పెరంబలూరు మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే దారిలోని ఎంఎంనగర్లో శెట్టికుళం గ్రామానికి చెందిన శరవణన్‌కు రెండస్థుల భవనం ఉంది. ఈ భవనంలో పెరంబలూరు కల్యాణనగర్కు చెందిన కార్తికేయన్ (32) నెలకు రూ.20వేల అద్దె చెల్లిస్తూ గత మూడేళ్లుగా కాపురం ఉంటున్నాడు. కార్తికేయన్‌తోపాటు ఆయన భార్య, ఇద్దరు పనివాళ్లు కూడా అక్కడే నివసిస్తున్నారు. అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పెరంబలూరు ఎస్పీ సోనాల్ చంద్ర నేతృతంలో పోలీసు బృందం అక్కడికి చేరుకుని ఇంటిని తనిఖీ చేయగా, ఒక గదిలో రెండు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవుతో తెల్లని వస్త్రంతో చుట్టబడిబడి ఉన్న శవపేటికలో కుళ్లిపోయిన స్థితిలో యువతి శవం ఉంది. శవపేటిక పక్కనే సుమారు 20కి పైగా మానవ పుర్రెలు, పెద్ద సంఖ్యలో ఎముకలు పడి ఉన్నాయి. ఇతర గదుల్లో పూజసామగ్రి చిందరవందరగా పడి ఉంది. ఇంటిలో కాపురం ఉంటున్న కార్తికేయన్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రూ.5వేలు చెల్లించి చెన్నై నుంచి ఈ శవాన్ని తెచ్చుకున్నానని, దెయ్యాలతో సంబంధం ఉండే అఘోరీ పూజలు చేస్తూ మంత్రవాదిగా జీవిస్తున్నానని తెలిపాడు. అర్ధరాత్రి వేళల్లో పూజలు నిర్వహించి తన వద్దకు వచ్చే వ్యక్తుల కోర్కెమేరకు గతించిన వారి పూర్వీకుల ఆత్మలతో సంభాషిస్తానని, చనిపోయిన వారి కోర్కెలను అడిగి తెలుసుకుంటానని చెప్పాడు. కోర్కెలు తీరకుండానే ప్రాణాలు విడిచిన వారి ఆత్మలు చెప్పిన వివరాలను బంధువుల దృష్టికి తీసుకెళ్లి పరిహారం చేయిస్తానని చెప్పి డబ్బులు పుచ్చుకుంటానని పోలీసులకు వివరించాడు. అంతేగాక చేతబడి, పురుషులు, స్త్రీల వశీకరణం తదితర పూజలు కూడా నిర్వహిస్తానని అన్నాడు. కార్తికేయన్ చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న అనంతరం ఎస్పీ స్వర్ణలత క్లూస్‌టీమ్‌ను పిలిపించారు. శవపేటికలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఉందని క్లూస్‌టీమ్ తెలిపారు. రీపోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్తికేయన్, ఆయన భార్య నశీమాభాను, సుమారు 40 ఏళ్ల వయస్సున్న వారి సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో మంత్రతంత్రాలు చేయడం, ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణపై కార్తికేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా ఇటీవలే బెయిల్‌పై బైటకు వచ్చిరాగానే తన వైఖరిని మార్చుకోకుండా అదే వృత్తిని కొనసాగించడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
వారికి శిక్ష పడే వరకు సినిమాల్లో నటించను
నేరస్తులకు శిక్ష పడే వరకు నేను సినిమాల్లో నటించనని నటి భావన శపథం చేశారు. తన మాజీ కారు డ్రైవర్ సహా ఆరుగురు నటి భావనను కిడ్నాప్‌నకు పాల్పడిన సంఘటన దక్షిణాది చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటి స్నేహ సహా పలువురు నటీమణులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భావన కిడ్నాప్ సంఘటన గురించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికరవైున అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే కిడ్నాప్‌నకు పాల్లడ్డ వ్యక్తుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి సెల్ఫోన్ల ద్వారా భావన కిడ్నాప్ సంఘటనలో ఒక ప్రముఖ నటుడు, ఒక రాజకీయనాయకుడి ఇద్దరు కొడుకులు వారితో పలుమార్లు మాట్లాడినట్లు, నేరస్థుల వాగ్మూలంలో ఈ సంఘటనకు రూ.50 లక్షలు బేరం జరిగినట్లు బయట పడింది. ఈ వ్యవహారంలో ఓ మలయాళ నటుడు ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నటి భావన కిడ్నాప్ కేసులో తనకెలాంటి సంబంధం లేదని అతను స్పష్టం చేశారు. అయితే ఆ మళయాళ నటుడి మాజీ భార్యకు నటి భావనకు మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి. భర్తతో తనకు ఎదురైన చేదు అనుభవాలను భావనతో పంచుకున్నారని, భావన ఈ విషయాలను ప్రముఖ నటులకు, కొందరు రాజకీయనాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు న్యాయం జరిగేలా పోరాడినట్లు ప్రచారం జరిగింది. దీంతో 2014 తరువాత ఆమెకు మలయాళంలో అవకాశాలు లేవు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించిన భావన అక్కడ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.దీంతో మళ్లీ మలయాళంలో అవకాశాలు రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం నటుడు పృథ్వీరాజ్‌కు జంటగా ఒక చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే తనను కిడ్నాప్ చేసిన దోషులకు తగిన శిక్ష పడేవరకూ తాను సినిమాల్లో నటించనని భావన శపథం చేసినట్లు నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా నటి భావనను లైంగికంగా వేధించిన దృశ్యాలను సెల్‌ఫోన్ లో చిత్రీకరించిన వ్యక్తులు వాటిని బయట పెట్టకుండా ఉండాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
నలుగురు దొరికారు, ఇద్దరు పరారీ
బెంగళూరు: కమ్మనహళ్లి కాముకుల్లో నలుగురు పోలీసులకు చిక్కారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులకు పట్టుబడ్డ నిందితుల్లో ముగ్గురు 20 ఏళ్లు లోపువారు కావడం గమనార్హం. ఘటన వెలుగులోకి వచ్చిన దాదాపు 48 గంటల్లోపు పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 1 అర్థరాత్రి 1:40 గంటలకు కమ్మనహళ్లి వద్ద నడుచుకుని వెళుతున్న యువతితో స్కూటీపై వచ్చిన ఇద్దరు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆరుగురూ కలిసి మూడు బైక్‌లలో ఆమెను వెంబడించారు. నిందితులు అయ్యప్ప అలియాస్ నితీష్‌కుమార్ (19) (ఏ1), లెనో అలియాస్ లెనిన్ ప్యాట్రిక్ (20), సుదేష్ అలియాస్ సుధి (20), సోమశేఖర్ అలియాస్ చిన్ని (24)లని పోలీసు కమిషనర్ ప్రవీణ్‌సూద్ మీడియాకు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులందరూ స్థానికంగా ఉంటూ చిన్నాచితకా ఉద్యోగాలు చేసేవారు. తన ఇంటి బయటి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన చిత్రాలను పరిశీలించి, వాటిని పోలీసులకు అందజేసిన యజమాని ప్రశాంత్ ఫ్రాన్సిస్‌ను నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్ సూద్ అభినందించారు. -
అమెరికా మహిళపై గ్యాంగ్‌రేప్.. నలుగురి అరెస్టు
భారతదేశంలో పర్యటిద్దామని వచ్చిన అమెరికన్ మహిళపై గ్యాంగ్‌రేప్ చేసిన కేసులో నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఈ నేరం గురించి అక్టోబర్‌లో ఫిర్యాదు చేసినా, ఎఫ్ఐఆర్ మాత్రం డిసెంబర్ 3వ తేదీన దాఖలైంది. అనుమానితుల్లో ఒక టూరిస్టు గైడు, డ్రైవర్, క్లీనర్, హోటల్ సిబ్బందిలో ఒకరు ఉన్నారు. వీరిని ఐదు గంటల పాటు ప్రశ్నించి, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు కూడా పలు సందర్భాలలో వీళ్లందరినీ విచారించారు. వారి పాస్‌పోర్టులను సీజ్ చేసి, అనుమతి లేకుండా నగరం వదిలి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. డిసెంబర్ 8న నేపాల్ నుంచి తిరిగొచ్చిన టూరిస్టు గైడ్‌ను విచారించగా, అతడు తనపై ఆరోపణలు తప్పని చెప్పాడు. కానీ బాధితురాలు మాత్రం.. అతడు కూడా అత్యాచారం చేసినట్లు చెప్పింది. ఇంతకుముందు కూడా వీరిని అనుమానించినా, వాళ్లు పనిచేసిన ట్రావెల్ ఏజెన్సీ విచారణ జరిపి.. వాళ్లకు క్లీన్ చిట్ ఇవ్వడంతో అరెస్టు చేయలేదు. దాంతోపాటు బాధితురాలు కూడా మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలం ఏమీ చెప్పలేదు. ఆమె ఆరోపణలన్నీ తప్పని.. తాము అత్యాచారం చేసినట్లుగా ఆమె చెబుతున్న తర్వాత రోజు తమతో కలిసి ఆమె ఆగ్రా వచ్చిందని వాళ్లు అంటున్నారు. అందుకు సాక్ష్యంగా ఫొటోలపు చూపించారు. కానీ, తర్వాత బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ మళ్లీ అమెరికా నుంచి ఢిల్లీ వచ్చి పోలీసుల వద్ద తన వాంగ్మూలం రికార్డు చేసింది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు చూపించిన గైడు మొదట్లో తనతో స్నేహంగా ఉండేవాడని, తర్వాత ఏప్రిల్ 8న మర్నాటి కార్యక్రమం గురించి మాట్లాడే నెపంతో తన స్నేహితులతో కలిసి రూంలోకి వచ్చి, మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరుగా తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. తర్వాతి రోజు కూడా తనపై అత్యాచారం చేశారని, ఈ విషయం ఎక్కడైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారని చెప్పింది. నిందితుల వద్ద అత్యాచారానికి సంబంధించిన వీడియో కూడా ఉన్నట్లు ఆమె ఆరోపించింది. పోలీసులకు చెబితే దాన్ని బయటపెడతామని బెదిరించినట్లు తెలిపింది. -
‘నానక్‌రామ్‌గూడ’ ఘటనలో నలుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో భవన యజమాని తుల్జారామ్ సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తూ సింగ్, అతని కుమారుడు అనిల్ కుమార్‌సింగ్, మేస్త్రి బిజ్జా వేణుగోపాల్, సివిల్ ఇంజనీర్ అల్లం శివరామకృష్ణ ఉన్నారు. వీరిపై ఐపీసీ 304(టూ), 304(ఏ), 338, 427 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద గచ్చిబౌలి ఠాణాలో కేసులు నమోదు చేశారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి సులువుగా డబ్బు వస్తుందనే ఆశతో భవనాన్ని నిర్మించారని పోలీసులు చెబుతున్నారు. గురువారం కూలిన భవనానికి పక్కనే ఉన్న ఇంటి యజమాని తుల్జారామ్ బీరేందర్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. (ఆశలు సమాధి!) నిబంధనలు అతిక్రమించారు: ‘భవన యజమాని సత్తూ సింగ్ 267 చదరపు గజాల్లో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించారు. సరైన ప్లాన్ లేకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి శివరామకృష్ణ ప్లాన్ ఇవ్వడం, దాన్ని మేస్త్రి వేణుగోపాల్ అమలు చేశారని విచారణలో తేలింది’ అని అడిషనల్ డీసీపీ(క్రైమ్స్) శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ నిర్మాణం విషయంలో కొంత మంది జీహెచ్ఎంసీ అధికారులకు లంచం ఇచ్చినట్టుగా కూడా గుర్తించామన్నారు. భవన శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగిస్తే ఆ ప్రమాద తీవ్రత తెలుస్తుందన్నారు. నిందితులు గతంలో నిర్మించిన భవన నిర్మాణాల డిజైన్లను నిఫుణులకు అందించామని, వారి నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నలుగురు దొంగలు అరెస్ట్
అనంతపురం సెంట్రల్ : బంగారు నగలు, గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అనంతపురం నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 తులాల బంగారు నగలు, 15 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐలు జీటీనాయుడు, శ్రీరామ్‌లు వెల్లడించారు. కంబదూరు మండల కేంద్రానికి చెందిన ఎరికల ముత్యాలు అలియాస్ జొల్లోడు, సోమశేఖర్‌ల నుంచి 7 తులాల బంగారు, కదిరి మండలం దేవరపల్లికి చెందిన నరసింహ నుంచి 2 తులాల బంగారు, కంబదూరు మండలానికి చెందిన వన్నూరప్ప నుంచి 15 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా వేర్వేరుగా దొంగతనాలకు పాల్పడేవారు. ఇటీవల నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి, ఒంటిరిగా వెళుతున్న మహిళల మెడల్లోని బంగారు నగలను ఎత్తుకెళ్లేవారు. ఇటీవల చోరీలపై నిఘాపెట్టిన నాల్గవ పట్టణ పోలీసులు రాత్రి సమాయాల్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 9 తొమ్మిదితులాలు బంగారు నగలను స్వాదీనం చేసుకున్నారు. పలుచోట్ల దొంగతనం చేసిన గొర్రెల వివరాలను కూడా విచారణలో వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్ఐలు వివరించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ నరసింహులు, కానిస్టేబుళ్లు పవన్‌కుమార్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో తాబేళ్ల అక్రమ రవాణా
- నలుగురి అరెస్టు జీకేవీధి: విశాఖ జిల్లా జీకేవీధి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు దాదాపు 250 తాబేళ్లను బస్తాల్లో నింపి ఆర్టీసీ బస్సులో నర్సీపట్నం తీసుకెళ్తున్నారు. జీకేవీధి మండలం ముల్లుమెట్ట గ్రామం వద్ద అటవీశాఖ అధికారులు బస్సును సోదా చేయగా బస్తాల్లో ఉన్న తాబేళ్లు బయటపడ్డాయి. ఈ మేరకు ఒడిశా వాసులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తాబేళ్లను జలాశయాల్లో వదిలివేస్తామని చెప్పారు. -
ఇద్దరు యువతులపై సామూహికంగా..
దేశరాజధాని నగరం ఆడవాళ్లకు సురక్షితం కాదన్న విషయం మరోసారి తేలిపోయింది. ఇద్దరు టీనేజి యువతులపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నలుగురు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 17, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులు తమ స్నేహితులతో కలిసి ముకుంద మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక నిర్జన ప్రాంతానికి వెళ్లారు. అక్కడే అబ్బాయిలను కొట్టి.. అమ్మాయిలపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో నలుగురిని గుర్తించి గురువారం రాత్రే పోలీసులు అరెస్టు చేశారు. ఐదో వ్యక్తిని కూడా గుర్తించినా, అతడు పరారీలో ఉన్నాడు. నిందితులు కూడా యువతులు ఉండే ప్రాంతంలోనే ఉంటారని, అయితే పరిచయం లేరని అంటున్నారు. పోస్కో చట్టంతో పాటు ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద వారిపై అమన్ విహర్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు డీసీపీ విక్రమ్‌జీత్ సింగ్ తెలిపారు. నిందితుల్లో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్ పట్టివేత : నలుగురి అరెస్ట్
చిత్తూరు : తిరుపతి విమానాశ్రయంలో ఆర్డీఎక్స్ కలకలం సృష్టించింది. పేలుడు పదార్థాలతో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను తిరుపతి ఎయిర్పోర్ట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా లిక్విడ్ ఆర్డీఎక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నలుగురి అనుమానితులను ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారీగా లిక్విడ్ ఆర్డీఎక్స్ను గుర్తించారు. పోలీసు ఉన్నతాధికారులు నలుగురిని విచారిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు వ్యాపార నిమిత్తం వచ్చిన వీరు.. తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయంలో పట్టుబడినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్రికెట్ బుకీలపై పోలీసుల దాడులు
-
వ్యభిచార గృహంపై దాడి.. నలుగురి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్‌లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం గృహం నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించి రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ముగ్గురు మహిళలతో పాటు దీంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
షాపింగ్ సైట్ హ్యాక్ చేసి.. రూ. 4 కోట్ల మోసం
ఇండియా టుడే షాపింగ్ సైట్‌ను హ్యాక్ చేసి, కస్టమర్లను రూ. 4 కోట్ల మేర మోసం చేసిన కేసులో నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాగిట్ టుడే అనే తమ షాపింగ్ సైట్ హ్యాకింగ్‌కు గురైందని ఇండియాటుడే గ్రూప్ ఈనెల 1వ తేదీన ఫిర్యాదు చేసినట్లు ఘజియాబాద్ ఎస్పీ ఎస్కే సింగ్ తెలిపారు. ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అన్నారు గానీ, తమకు ఎలాంటి ప్రయోజనాలు కలగలేదంటూ కస్టమర్లు ఫిర్యాదు చేశారు. ఐటీ నిపుణులు దీన్ని పరిశీలించి.. విజయ్ నగర్‌లోని ఓ ఇంట్లో ఉన్న నకిలీ కాల్ సెంటర్ ఆధారంగానే ఇదంతా జరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ పోలీసులు సోదా చేయగా ఏడు కార్డ్‌లెస్ ఫోన్లు, ఒక ప్రింటర్, ఒక ల్యాప్‌టాప్, ఏడు సిమ్ కార్డులు దొరికాయి. బ్యాగిట్ టుడే కస్టమర్లను మోసగించినట్లు అంగీకరించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లను మోసం చేయడం ద్వారా నిందితులు దాదాపు రూ. 4 కోట్లు వెనకేశారని సింగ్ చెప్పారు. నిందితుల్లో అజయ్, అవశేష్ అనే ఇద్దరు కవలలతో పాటు ధీరేంద్ర, మనోజ్ అనే మరో ఇద్దరు ఉన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
20 రోజుల్లో 25 దోపిడీలు చేసిన యువకులు హనుమాన్‌జంక్షన్ రూరల్(కృష్ణా జిల్లా): జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించేందుకు దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు యువకుల ముఠాను శుక్రవారం కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ చదివిన వీరు తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో 25కి పైగా దోపిడీలు చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 27 సెల్ఫోన్లు, రెండు బంగారు ఉంగరాలు, కారు, దాడికి ఉపయోగించిన వంటపాత్ర, కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వీరిని నూజివీడు డీఎస్పీ వి.శ్రీనివాసరావు మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారి వివరాలు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కేపీహెచ్‌బీ ఆల్విన్ కాలనీకి చెందిన చేబత్తిన అఖిల్, షేక్ ఫయాజ్, కల్యాణం వికాస్, చాగంటి శ్రీకాంత్ ఇంటర్లో క్లాస్మేట్స్. మద్యం, హుక్కా వంటి వ్యసనాలకు, జల్సాలకు అలవాటుపడిన వీరు ముఠాగా ఏర్పడి తొలుత చిన్నచిన్న నేరాలు చేశారు. క్రమంగా దోపిడీ దొంగలుగా మారారు. ఈ నెల మూడో తేదీన హైదరాబాద్‌లో ఓ క్యాబ్ మాట్లాడుకుని ఎక్కిన ఈ నలుగురు డ్రైవర్‌ను దారిలో చితకబాది అదే కారులో ఉడాయించారు. తర్వాత వీళ్లు అద్దెకు తీసుకున్న ఫ్లాట్ యాజమాని అమెరికా వెళ్లడంతో ఆయన కారు నంబరును వీరు దొంగిలించిన కారుకు పెట్టుకుని తిరిగారు. హైదరాబాద్ నుంచి కారులో ప్రయాణం మొదలుపెట్టిన వీరు ఏలూరు వరకు దారిపొడవునా పలుచోట్ల దోపిడీలకు పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకుని తర్వాత వారిని చితకబాది నగదు, నగలు, సెల్ఫోన్లు దోచుకునేవారు. వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. జాతీయ రహదారిపై వీరవల్లి వద్ద నిర్వహించిన తనిఖీల్లో నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండడం, కారులో గుట్టగా సెల్ఫోన్లు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరచరిత్ర బయటపడింది. ఈ ముఠాను పట్టుకున్న హనుమాన్‌జంక్షన్ సి.ఐ. జయకుమార్, ఎస్.ఐ. తులసీధర్, వీరవల్లి ఎస్.ఐ. మురళీకృష్ణలను డీఎస్పీ అభినందించారు. -
నకిలీ కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్
జడ్చర్ల: నకిలీ చెరెన్సీ చెలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.80 వేల విలువైన 1000 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా నాయకుడు అరుణ్ పరారీలో ఉన్నాడు. వీరంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, మిగతా నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. -
రైతులకు రూ.కోటి టోకరా : నలుగురి అరెస్ట్
హుస్నాబాద్: కరీంనగర్ జిల్లాలో శనివారం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హుస్నాబాద్‌లో దుండగులు రైతులకు బోర్లు, మోటార్లు ఇస్తామని రూ.కోటి వరకు వసూలు చేశారు. దీనిపై మోసపోయామని గుర్తించిన రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
విశాఖపట్టణం: పాలేరు నుంచి మద్రాసుకు అక్రమంగా తరలిస్తున్న 408 కిలోల గంజాయిని మంగళవారం విశాఖ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.కోటి ఉంటుందని తెలుస్తుంది. గంజాయిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి ఓ కారును, మోటర్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను స్టేషన్‌కు తరలించారు. -
కళేబరాలతో నూనె తయారీ ముఠా అరెస్ట్
నల్గొండ: నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మోటకొండూరులో జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కి తరలిచారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే జంతు కళేబరాల నుంచి తయారు చేసిన నూనెను పోలీసులు ధ్వంసం చేశారు. జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్నట్లు స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేసి... నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్
కడప అర్బన్: కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను కడప తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..కడప తాలూకా పరిధిలో నివాసముండే శంకర్ రాజు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మధు అనే వ్యక్తి దగ్గర రూ.5 లక్షలు అప్పు చే శాడు. ఎంతకీ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో మధు తన స్నేహితులతో కలిసి రాజు ఇంటికి చేరుకుని మాట్లాడదామని కారులో ఎక్కించుకెళ్లాడు. ఉదయం వెళ్లిన వ్యక్తి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భయపడిన రాజు భార్య కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిమ్స్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నారు. వారి నుంచి శంకర్ రాజును విడిపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
భార్యే సూత్రధారి
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే.. సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ వీడిన వ్యాపారిపై హత్యాయత్నం కేసు మిస్టరీ భార్యతో పాటు మరో నలుగురి అరెస్టు బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో రెండు రోజుల క్రితం పట్టపగలు రోడ్డుపై ఓ వ్యాపారిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మరికొందరితో కలిసి భార్యే అతడిని చంపేందుకు యత్నించిందని తేల్చారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... జూబ్లీహిల్స్ గాయత్రీ హిల్స్‌లో నివాసం పతంగిరాము, అంజలి (32) నివాసం ఉంటున్నారు. రాము రాజరాజేశ్వరి ఔట్‌డోర్ యూనిట్ పేరుతో సినిమా షూటింగ్‌లకు జనరేటర్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన అంజలిని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకుని వెంకటగిరిలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, తమ రాజరాజేశ్వరి యూనిట్లో మేనేజర్‌గా పని చేస్తున్న వెలవలేటి దుర్గ(24) అనే యువకుడితో అంజలి మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చి ప్రియుడితో కాపురం పెట్టాలని ఆమె భావించింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లో ఉండే తన సన్నిహితుడు ముక్కు కార్తీక్ ఫణీందర్(29)ను పది రోజుల క్రితం సంప్రదించింది. సుపారీ తీసుకుని హత్య చేసే వ్యక్తి ఉన్నాడని, అతడితో ఫోన్లో మాట్లాడిస్తానని కార్తీక్ చెప్పాడు. అతను చెప్పినట్టే మంగళహాట్ ఇందిరానగర్‌కు చెందిన కొలుసునూరి రాకేష్(24) అనే బౌన్సర్ అంజలికి ఫోన్ చేసి.. రూ. 5 లక్షలు ఇస్తే నీ భర్తను హత్య చేస్తానన్నాడు. ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించిన అంజలి... అడ్వాన్స్‌గా అతడికి రూ.15వేలు ఇచ్చింది. తన స్నేహితుడు అవినాష్ (19)తో కలిసి రెండు రోజుల పాటు రాము కద లికలపై రాకేష్ రెక్కీ నిర్వహించాడు. నెల 8వ తేదీ సాయంత్రం రాము స్కూల్నుంచి పిల్లల్ని తీసుకురావడ ం కోసం వెళ్తుండగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలకు గురైన రాము వారి నుంచి తప్పించుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. ఫిర్యాదును అందుకున్న జూబ్లీహిల్స్ సీఐ సామల వెంకటరెడ్డి, ఎస్సై శ్రీనివాస్ దర్యాప్తు చేసి కేసులోని మిస్టరీని ఛేదించారు. నిందితురాలు అంజలితో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డ రాకేష్, అవినాష్, కార్తీక్, అంజలి ప్రియుడు దుర్గను అరెస్ట్ చేశారు. -
చౌక వ్యాక్సిన్ పేరుతో టోకరా
-
చౌక వ్యాక్సిన్ పేరుతో టోకరా: నలుగురి అరెస్ట్
విశాఖపట్నం: మెదడువాపు వ్యాక్సిన్ వేస్తామంటూ తిరుగుతున్న నలుగురు సభ్యుల ముఠాను విశాఖపట్టణం పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కన్నా తక్కువ ధరకే మెదడువాపు వ్యాక్సిన్ వేస్తామంటూ ఆరిలోవాలో హల్చల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ జగన్ మోహన్ రావు సహా ముగ్గురు మహిళలను ఆరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ముగ్గురు మహిళలకు వైద్యం గురించి ఏమీ తెలియదని పోలీసులు తెలిపారు. -
ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో.. టీటీడీ బ్లాక్ టికెట్లు
తిరుపతి: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ సిఫార్సు లేఖతో ప్రత్యేక దర్శనం టికెట్లు పొందినట్టు సమాచారం. ఎల్1 దర్శనం టికెట్లను ఒక్కొక్కటి రూ.10వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అక్రమ ఆయుధాలు పట్టివేత
-
ఎక్సైజ్ దాడులు.. నలుగురు అరెస్ట్
ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా దమ్మపేట - అశ్వారావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం ఎక్సైజ్ అధికారులు అకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో సుమారు 90 లీటర్ల కాపు సారాను స్వాధీనం చేసుకున్నారు.అలాగే 3300 లీటర్ల బెల్లం పానకాన్ని కూడా స్వాధీనం చేసుకుని... ధ్వంసం చేశారు. కాపు సారా తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ సీఐ రాంమూర్తి వెల్లడించారు. అశ్వారావుపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంమూర్తి ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండల కేంద్రం, మండలంలోని నారవారిగూడెం గ్రామంలో, దమ్మపేట మండలం ముష్టిదండ, వడ్లగూడెం, మందలపల్లి గ్రామాల్లో దాడులు జరిపారు. -
లైంగికదాడి కేసులో మరో నలుగురి అరెస్టు
పోలీసుల అదుపులో మొత్తం ఏడుగురు వివరాలు వెల్లడించిన డీఎస్పీ సౌజన్య తెనాలిరూరల్ : ప్రేమజంటను అటకాయించి, యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్టయింది. డీఎస్పీ సీహెచ్ సౌజన్య తన కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలను తెలియజేశారు. వేమూరు నియోజకవర్గలోని కొల్లూరుకు చెందిన యువతి ప్రేమికుడు రాజేష్‌తో కలసి జూన్ 26వ తేదీ రాత్రి లారీలో వేమూరు వచ్చింది. రైల్వే గేటు వద్ద వారిని రేపల్లెకు చెందిన అడుసుమల్లి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్, భూపతి గోపి అటకాయించారు. తాము పోలీసులమని బెదిరించడంతో ఐడీ కార్డులు చూపించమని ప్రేమ జంట అడిగింది. దీంతో వారు సమీప పొలాల్లో అప్పటికే మరో యువతితో గడుపుతున్న ఆర్మీ జవాను రాతంశెట్టి సుధాకర్, భూపతి వెంకటరత్నంలకు ఫోను చేసి పిలిపిం చారు. సుధాకర్ తన ఐడీ కార్డు చూపించి పోలీసులుగా నమ్మించి, ఆ మరుసటి రోజు భట్టిప్రోలు పోలీస్స్టషన్కు రమ్మని రాజేష్‌తో చెప్పి, అతడి వెంట ఉన్న యువతిని వెంకటేశ్వరరావు మోటారుసైకిల్‌పై ఎక్కించి రావికంపాడు సమీప పొలాల్లోకి తీసుకువెళ్లారు. ఆందోళనపడిన రాజేష్ వెంటనే 100కు ఫోను చేసి సమాచారం అందించారు. వేమూరు పోలీసులు రంగంలోకి దిగి యువతిని రక్షించారు. అయితే అప్పటికే వెంకటేశ్వరరావు, సుధాకర్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గోపి, రత్నం అంతకుముందే వారు తెనాలి నుంచి తీసుకొచ్చిన యువతి దగ్గర ఉన్నారు. వీరికి కొద్ది దూరంలో గూడవల్లి వెంకటప్రసాద్, నెల్లూరు అనిల్‌కుమార్ కాపలా ఉన్నారు. మొదట ఈ కేసులో నలుగురిని నిందితులుగా భావించామని, దర్యాప్తులో మరో ఇద్దరు కాపలా ఉన్న విషయం తేలిందని డీఎస్పీ చెప్పారు. ఘటన జరిగిన మరుసటి రోజే వెంకటేశ్వరరావు, సుధాకర్, వారితో ఉన్న యువతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, గోపి, వెంకటరత్పంలను 7వ తేదీన, వెంకటప్రసాద్, అనిల్‌కుమార్‌ను 8వ తేదీన రేపల్లెలో అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు.నిందితులపై కిడ్నాప్, మో సం,ఇంపర్సనేషన్, లైంగికదాడి, నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసిన తాలూకా సీఐ యు.రవిచంద్ర, కొల్లూరు, వేమూరు ఎస్ఐలు ఎ. వెంకటేశ్వర్లు, ఎం.మోహన్‌ను డీఎస్పీ అభినందించారు. -
గుడుంబా స్థావరాలపై దాడి: నలుగురు అరెస్ట్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వాలుగొండలో గుడుంబా స్థావరాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 25 వేల లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. అందుకు సంబంధించి నలుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకుని... వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు చెందిన నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. -
కక్షతోనే చంపేశారు...
►వలీ హత్య కేసులో నలుగురు అరెస్ట్ ►కుమారుడిని చంపేశాడనే అనుమానంతో.. ►విలేకరులతో సీఐ సదాశివయ్య చెన్నూరు : కొడుకును చంపి, సంసారంలో జోక్యం చేసుకొని కోడలిని దూరం చేశారనే కక్షతో వలీ(30)ని హుస్సేన్‌బీ అలియాస్ బీబీ(ఈరమ్మ), ఆమె కుమారుడు పెద్దహుస్సేన్ తలపై రోకలిబడెతో కొట్టి, గొంతుకోసి హత్య చేశారని కడప అర్బన్ సీఐ సదాశివయ్య అన్నారు. చెన్నూరులో గురువారం రాత్రి ఎస్ హనుమంతుతో కలిసి విలేకర్ల ఎదుట హంతకులను, హత్యకు ఉపయోగించిన కత్తి, రోకలిబడెలను హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వినుగొండ మండలం దర్శి గ్రామానికి చెందిన హుస్సేన్‌బీ 15 ఏళ్ల క్రితం వలసవచ్చి చెన్నూరులోని ఎల్లమ్మకాలనీలో ఆవుల వ్యాపారం, భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఈమెకు ఖాజీ పేటలోని మైదుకూరు రోడ్డు సమీపంలో నివసిస్తున్న షేక్‌వలీ బంధువు. హుస్సేన్‌బీ రెండవ కుమారుడు నడిపి హుస్సేన్, షేక్‌వలీలు స్నేహితులు. వీరిద్దరు ఖాజీపేటకు బైకులో వెళ్లి తిరిగి హుస్సేన్ ఒక్కడే వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందాడు. వలీనే కుమారుడిని చంపాడని, అలాగే పెద్దకుమారుని భార్య విషయంలో వలీ జోక్యం చేసుకొని కోడలిని దూరం చేశాడని కక్ష పెంచుకొన్నారు. పథకం ప్రకారం... ప్రశ్నించకుండా అతనితో మాట్లాడుతూ ఈ నెల 11న మధ్యాహ్నం వలీని ఇంటికి రమ్మని పెద్దహుస్సేన్ ద్వారా ఫోన్ చేసి పిలిపించారు. పూటుగా మద్యంతాపి, భోజనం తిని మత్తులో ఉండగా హుస్సేన్‌బీ పథకం ప్రకారం తలపై రోకలిబడెతో కొట్టింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న వలీని స్థానికుడైన పోతుబోయిన గంగయ్య సహకారంతో పెద్దహుస్సేన్ కత్తితో గొంతు కోశాడు. రక్తం బయటకు రాకుండా బొంతలు చుట్టారు. యూరియా సంచుల్లో శవం కనపడకుండా ఫ్యాక్ చేశారు. రాత్రి వరకు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని చీకటి పడ్డాక గంగయ్య, పెద్దహుస్సేన్‌లు వలీ బైకులోనే తీసుకెళ్తుండగా జారిపోవడంతో రోడ్డు పక్కనే మృతదేహాన్ని పడేశారు. కడప బిర్యాని సెంటర్లో పని చేస్తున్న బుక్కే శంకర్‌నాయక్ లగేజి ఆటో తీసుకొని కడప నుంచి రాగానే అతన్ని పిలిపించి అర్ధరాత్రి దాటాక ఉప్పరపల్లె రోడ్డు మీదుగా గోపవరం సమీపంలోని కేసీ కాల్వకట్ట పక్కనే పడేశారు. కత్తి, రోకలిబడె, వాహనాలు స్వాధీనం... 12న స్థానికుల సమాచారం మేరకు వీఆర్ఓ ఓబయ్య ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు. హంత కులిద్దరిని, సహకరించిన వారిని బలసింగాయపల్లె సమీపంలోని కై లాసగిరికోన వద్ద అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి కత్తి, రోకలిబడె, ఆటో, సెల్‌ఫోన్ హత్యకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. శుక్రవారం కోర్టుకు హాజరు పెట్టనున్నట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా పని చేసిన ఎస్ఐ హనుమంతు, ఏఎస్ఐ అనసూయ, ెహ డ్ కానిస్టేబుళ్లు సతీష్, భాస్కర్‌రెడ్డి, శర్మ, కానిస్టేబుళ్లు నాగరాజు, గంగరాజు, నందకుమార్, ప్రసాద్‌ను అభినందించి రివార్డు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదిస్తున్నట్లు ఆయన వివరించారు. -
40కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాలోని నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
కదులుతున్న కారులో నైజీరియన్‌పై గ్యాంగ్‌రేప్
దేశ రాజధాని నగరంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతోంది. 35 ఏళ్ల నైజీరియన్ మహిళపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని డీఎన్డీ టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున 2.45 గంటల సమీపంలో ఆమె స్పృహలేకుండా పడి ఉంది. టోల్‌ప్లాజా సిబ్బంది గమనించి పోలీసులకు చెప్పడంతో వాళ్లు ఆమెను అక్కడకు సమీపంలోని ఎల్వీఎస్ ఆస్తత్రికి తరలించారు. టోల్‌ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలలోని ఫుటేజి ఆధారంగా హ్యుందయ్ ఎసెంట్ కారులో వెళ్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్ వద్ద ఆమెను కారులో ఎక్కించుకుని అరగంటలో టోల్ ప్లాజా వద్దకు తీసుకొచ్చారు. వాళ్లంతా 22- 25 ఏళ్ల మధ్య వయసు వాళ్లే. 2014 సంవత్సరంలో ఢిల్లీలో 2069 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ. -
అత్యాచార నిందితుల అరెస్ట్
మిర్యాలగూడ(నల్లగొండ): మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. మతిస్థిమితం లేని మైనర్ బాలికపై కొంత మంది యువకులు రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. కాగా, ఈ నెల 9న ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం పరారీలో ఉన్న మురళీ, హరికుమార్, కొత్తపల్లి ప్రవీణ్, మనోజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కూడా ఇద్దరు మైనర్ బాలురున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కుక్కల ఉపేందర్ కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయి. నిందితులను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. -
39 నాటు బాంబులు స్వాధీనం
వెంకటాపురం: వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రం చివర ఉన్న ఓ మొక్కజొన్న పొలంలో 39 నాటు బాంబులను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. మొక్కజొన్న పంటను అటవీ జంతువుల బారి నుంచి కాపాడుకోవటానికి కొంత మంది రైతులు పొలంలో అక్కడక్కడా నాటు బాంబులు పెట్టారు. ఈ నెల 10న అందులోని ఓ నాటు బాంబు పేలి రాజేశ్వర్ రావు అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మొత్తం 40 బాంబులు పాతిపెట్టగా అందులో ఒక బాంబు పేలింది. రాజేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు కంచం అశోక్, రెడ్డి దామోదర్, గంటా నరసింగం, మేకల మల్లయ్య అనే రైతులను పోలీసులు అరెస్టు చేశారు. -
నలుగురు ఆకతాయిల అరెస్ట్
హైదరాబాద్ క్రైం: హైదనాబాద్ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో గురువారం రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోకి వచ్చిన ప్రేమ జంటలను వేధిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో చోరీ: నలుగురి అరెస్ట్
టీ.నగర్: చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల వస్తువులను చోరీ చేసిన ఉద్యోగులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు విలువైన వస్తువులు చోరీకి గురవుతూ వచ్చాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ సూట్‌కేసుల్లో విలువైన వస్తువులు తీసుకురావడం పరిపాటి. ఇళ్లకు వెళ్లి చూడగా వస్తువులు కనిపించడం లేదు. ఇవి ఎలా చోరీకి గురవుతున్నాయో తెలియక పలువురు ఫిర్యాదు చేయడం లేదు. కొందరు మాత్రం ఫిర్యాదు చేస్తున్నారు. చోరీలకు బద్షా అనే ప్రైవేటు సంస్థ ఉద్యోగులు పాల్పడుతున్నట్లు తెలిసింది. విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజీని కన్వేయర్ బెల్ట్‌లో వేసే పనుల్లో ఈ ఉద్యోగులు నిమగ్నమవుతుంటారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. దీంతో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం పోలీసులు దీనిపై నిఘా ఉంచారు. బుధవారం రాత్రి వచ్చిన ప్రయాణికుల లగేజీ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను బద్షా సంస్థ ఉద్యోగులు చోరీ చేసినట్లు కెమెరాల్లో నమోదైంది. పోలీసులు నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసి వారి వద్ద విచారణ జరుపుతున్నారు. -
బీజేపీ నేత హత్య కేసులో నలుగురి అరెస్టు
గ్రేటర్ నోయిడా: బీజేపీ స్థానిక నాయకుడు విజయ్ పండిట్ హత్య కేసులో నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు బుధవారం చెప్పారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని, ఈ కేసులో జీతూ, సన్నీ, మరో ఇద్దరు షార్ప్‌షూటర్లు అంకిత్ గుజ్జర్, అన్నీలను అరెస్టు చేశామని డీఐజీ కే సత్యనారాయణ చెప్పారు. జీతూ, సన్నీ, అశోక్, గగన్, భోలూ ఈ హత్యకు పథకం వేశారని అన్నారు. తమ పథకం అమలుకు వీరు సుందర్ భాటీ, అనిల్ దుజన గ్యాంగ్‌లను సంప్రదించారని చెప్పారు. విజయ్ పండిట్‌కు నిందితులకు మధ్య గత రెండేళ్లుగా కక్షలు రగులుకొంటున్నాయని అన్నారు. రెండేళ్ల క్రితం పండిట్ సహచరుడు రవీందర్ శర్మ హత్యకు గురయ్యాడని, ఆ కేసులో కూడా ఈ అయిదుగురు నిందితులని వివరించారు. ఈ హత్యనంతరం స్థానికంగా పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని, పలువురి ఇండ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. ఇళ్ల దహనం కేసులో విజయ్ పండిట్ నిందితుడని అన్నారు. ఈ కేసులో విషయంలో రవీందర్ శర్మ కుటుంబం రాజీకి వచ్చినప్పటికీ పండిట్ అడ్డుకున్నాడని దీంతో నిందితులు బీజేపీ నాయకునిపై కక్ష పెంచుకున్నారని డీఐజీ చెప్పారు. ఈ నెల 7న దాద్రీలోని ఒక స్కూలు వద్దకు నిందితులు చేరుకున్నారని, అటువైపుగా వస్తున్న పండిట్‌పై ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారని చెప్పారు. ఈ కేసుపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని పండిట్ సతీమణి, దాద్రీనగర్ పంచాయత్ చైర్పర్సన్ గీత డిమాండ్ చేస్తున్నారు. -
ఐపీఎస్ అధికారి భార్యకూ వేధింపులు!!
ఐపీఎస్ అధికారి భార్యను వేధించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని హజ్రత్‌గంజ్ ప్రాంతానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఓ మాల్లో జరిగింది. సీబీసీఐడీలో పనిచేసే సదరు అధికారి భార్య.. షాపింగ్ కోసమని మాల్‌కు వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు ఆమె వెంట వెళ్లి, వేధించడం మొదలుపెట్టారు. దాంతో ఆమె వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తన భర్తకు ఈ విషయం చెప్పారు. ఫోన్ చేసినది తమ ఉన్నతాధికారి భార్య కావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం మాల్లోని సీసీటీవీ ఫుటేజ్ చూసి.. అకిల్ అహ్మద్, ఇర్షాద్ అహ్మద్, గులాం అలీ, పర్వేజ్ ఆలమ్ అనే నలుగురిని అరెస్టు చేశారు.