కదులుతున్న కారులో నైజీరియన్పై గ్యాంగ్రేప్
దేశ రాజధాని నగరంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతోంది. 35 ఏళ్ల నైజీరియన్ మహిళపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని డీఎన్డీ టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున 2.45 గంటల సమీపంలో ఆమె స్పృహలేకుండా పడి ఉంది. టోల్ప్లాజా సిబ్బంది గమనించి పోలీసులకు చెప్పడంతో వాళ్లు ఆమెను అక్కడకు సమీపంలోని ఎల్వీఎస్ ఆస్తత్రికి తరలించారు.
టోల్ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలలోని ఫుటేజి ఆధారంగా హ్యుందయ్ ఎసెంట్ కారులో వెళ్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్ వద్ద ఆమెను కారులో ఎక్కించుకుని అరగంటలో టోల్ ప్లాజా వద్దకు తీసుకొచ్చారు. వాళ్లంతా 22- 25 ఏళ్ల మధ్య వయసు వాళ్లే. 2014 సంవత్సరంలో ఢిల్లీలో 2069 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ.