విశాఖలో తాబేళ్ల అక్రమ రవాణా
- నలుగురి అరెస్టు
జీకేవీధి: విశాఖ జిల్లా జీకేవీధి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు దాదాపు 250 తాబేళ్లను బస్తాల్లో నింపి ఆర్టీసీ బస్సులో నర్సీపట్నం తీసుకెళ్తున్నారు. జీకేవీధి మండలం ముల్లుమెట్ట గ్రామం వద్ద అటవీశాఖ అధికారులు బస్సును సోదా చేయగా బస్తాల్లో ఉన్న తాబేళ్లు బయటపడ్డాయి. ఈ మేరకు ఒడిశా వాసులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తాబేళ్లను జలాశయాల్లో వదిలివేస్తామని చెప్పారు.