
బెట్టింగ్ రాయళ్లతో పోలీస్ సిబ్బంది
గరివిడి(చీపురుపల్లి) : ఓ పాన్ షాప్‌లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కిందనున్న సురేష్ పాన్‌షాప్‌లో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందన్న రహస్య సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు.
అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్న పాన్‌షాప్ యజమాని సురేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.53,030 నగదును, ఒక ఆండ్రాయిడ్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment