సాక్షి, మంగళగిరి: ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి కేసులో మరో నలుగురు నిందితులను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామం వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 7న జరిగిన జాతీయ రహదారి దిగ్బంధం, ఆందోళనలో భాగంగా ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. ఇప్పటికే తాడికొండకు చెందిన ఉన్నం రామ్మోహన్‌రావు, చినకాకానికి చెందిన సోమారపు ప్రకాశరావును అరెస్ట్ చేశామన్నారు. తాజాగా శనివారం చినకాకానికి చెందిన కఠారి సాంబవెంకటప్రసాద్, పిడుగురాళ్లకు చెందిన షేక్ ఇంతియాజ్, తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన ఫణిదపు వెంకటసాయి, దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పేరూరి సత్యనారాయణను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ముద్దాయిలకు కోర్టు రిమాండ్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment