pinnelli ramakrishna reddy
-
చంద్రబాబుకి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కౌంటర్
-
జగన్ పండగ చేస్తే.. చంద్రబాబు దండగ చేశారు: వైఎస్సార్సీపీ
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం రైతులను నిలువున ముంచేసిందని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనే నాధుడే లేడు. రేపు(శుక్రవారం) రైతుల తరఫున వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్లకు మెమోరాండం సమర్పిస్తారని ఆయన చెప్పారు.మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నరసరావుపేటలో మనం ప్రత్యక్షంగా చూశాం. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడని ఆమె మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండగ చేశారని.. కూటమి ప్రభుత్వం దండగ చేసిందన్నారు. బస్తాకు 400 రూపాయలు నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాం. ఉచితంగా పంటల బీమా కల్పించాం. ఏ సీజన్లో పంటకు నష్టం వస్తే అదే సీజన్లో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాం. కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసిందన్నారు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు పైన కేసులు బనాయిస్తోంది. ఇదే దృష్టి పాలన పైన పెట్టాలి. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. -
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పీఏ కిడ్నాప్‌నకు యత్నం
మాచర్ల: మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పీఏ ఎం.శ్రీనివాస శర్మను కిడ్నాప్ చేయడానికి టీడీపీ వర్గీయులుగా భావిస్తున్న కొందరు గూండాలు ప్రయత్నించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన్ని వదిలేసి పరారయ్యారు. శర్మ కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. పిన్నెల్లికి చాలా కాలం నుంచి పీఏగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను టీడీపీ వర్గీయులు కొందరు టార్గెట్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఆయన ఇంటికి టీడీపీ గుర్తులు కలిగిన స్కారి్పయో వాహనంలో గుర్తు తెలియని ఐదుగురు దుండగులు వచ్చారు.ఇంటి ముందు వాహనాన్ని ఆపి హడావుడిగా దిగారు. ఆ ప్రాంతానికి ఇతరులు రాకుండా ముగ్గురు నిలబడగా, ఇద్దరు ఇంటి ముందు తలుపులను కర్రలతో కొట్టారు. అవి రాకపోవటంతో మరో వైపు నుంచి తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి శ్రీనివాస శర్మను బెదిరించారు. తన భర్తను ఏమీ అనవద్దని, కొట్టవద్దని శర్మ భార్య వేడుకొన్నా వారు దౌర్జన్యంగా ప్రవర్తించారు. శర్మ రావాల్సిందేనని, లేకపోతే ఊరుకునేది లేదని బెదిరించారు. శ్రీనివాసశర్మ రానని చెప్పటంతో బయట ఉన్న ముగ్గురు కూడా లోపలకు వచ్చారు. శర్మను బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్లి వాహనంలో ఎక్కించారు.స్కార్పియోలో గుంటూరు రోడ్డు వైపు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి కూడా పలువురు సమాచారమిచ్చారు. పట్టణ, నియోజక వర్గంలోని సీఐలు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాప్ చేసిన వారి ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కిడ్నాపర్లు శ్రీనివాస శర్మను కారంపూడి సమీపంలో వదిలివేసి పరారయ్యారు. ఆయన తెలిసిన వారి వాహనం ఎక్కి మాచర్లలోని ఇంటికి చేరుకున్నారు. వెంటనే కారంపూడి, మాచర్ల అర్బన్, రూరల్ సీఐలు శర్మ ఇంటికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మాచర్ల అర్బన్ సీఐ చెప్పారు. -
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పై కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్షన్
-
జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి విడుదల
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల..
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడిలో నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా, అక్రమ కేసుల కారణంగా పిన్నెల్లి 55 రోజుల పాటు జైలులో ఉన్న ఉండాల్సి వచ్చింది.ఇక, పిన్నెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం. పిన్నెల్లి ఏం నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు.చాలాచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. కానీ, పిన్నెల్లిపై మాత్రమే కేసు పెట్టారు. అందుకే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. శ్రేయోభిలాషులు అందరూ తల్లడిల్లిపోయారు. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాం. పిన్నెల్లిపై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు.చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్ళీ పునరావృతమవుతాయి. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తే అధికారులు బలి అవుతతారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన, లోకేశ్‌తో హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. అధికారులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పిన చంద్రబాబును ప్రజలు చీ కొడుతున్నారు. చంద్రబాబు పాలన చూసి ప్రజలు చీ కొడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేసులకు, అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తే లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
YSRCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్
-
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్
సాక్షి, అమరావతి/వెంకటాచలం: రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని పిన్నెల్లిని ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు వారంలో ఒక రోజు సంబంధిత ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని చెప్పింది. పాస్‌పోర్టును మేజిస్ట్రేట్ కోర్టులో స్వాధీనం చేయాలని, అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని, ఎప్పుడు అవసరమైనా దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను వాటిని కోర్టుకు, పోలీసు అధికారికి తెలియజేయకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది. నివాస స్థలం, మొబైల్ నంబరు వివరాలను దర్యాప్తు అధికారికి తెలపాలని, ఒకవేళ అవి మారితే వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పింది. ప్రస్తుత కేసుల్లో తన పాత్ర గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడరాదని ఆదేశించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు శుక్రవారం తీర్పు చెప్పారు. దర్యాప్తు అధికారి పిన్నెల్లిని విచారణకు పిలిచినప్పుడు వెంట న్యాయవాదిని తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోరగా.. ఆ పరిస్థితి వస్తే కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి çసూచించారు. పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు గురజాల కోర్టు నిరాకరించడంతో పిన్నెల్లి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గురువారం విచారణ జరిపారు. ఈ కేసులో పిటిషనర్ నుంచి పోలీసులు రాబట్టాల్సిన విషయాలేవీ లేనందున, ఆయన్ని నిరవధికంగా నిర్బంధించడం సమర్థనీయం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిన్నెల్లి 4 సార్లు ఎమ్మెల్యే అని, ఆయనకు బలమైన సామాజిక సంబంధాలున్నాయని, ఆయన విచారణ నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. నేడు జైలు నుంచి పిన్నెల్లి విడుదలబెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందజేయడంలో ఆలస్యం కావడంతో శుక్రవారం పిన్నెల్లిని విడుదల చేయడానికి వీలుకాలేదు. ఆయన్ని శనివారం విడుదలయ్యే అవకాశముంది. -
పిన్నెల్లికి రెండు కేసుల్లో బెయిల్ ' మంజూరు చేసిన ఏపీ హై కోర్ట్
-
బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: పోలింగ్ రోజున, ఆ మరుసటి రోజున తనపై రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం విచారణ జరపనున్నారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసి.. టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారంటూ రెంటచింతల పోలీసులు రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారంటూ కారంపూడి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అనంతరం పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఇటీవల గురజాల కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురజాల కోర్టు రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై హత్యాయత్నం కింద నమోదు చేసిన కేసులు చెల్లవని.. అందుకు ఎలాంటి ఆధారాలు లేవని పిన్నెల్లి వివరించారు. రాజకీయ ప్రోద్భలంతో పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తాను జైలు నుంచి బయటకు రాకూడదని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విన్నవించారు. 37 రోజులుగా జైల్లో ఉన్నానని.. పోలీసులు దర్యాప్తు కూడా పూర్తయ్యిందని.. బెయిల్ మంజూరు సందర్భంగా ఏ షరతు విధించినా కట్టుబడి ఉంటానన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును పిన్నెల్లి కోరారు. -
పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక
ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు.. రోజులు మీవే ఉండవని గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు క్షమించని పరిస్థితి వస్తుంది. కచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికినట్లే. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేప్పొద్దున మళ్లీ మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి తప్పదు. అటు వంటి తప్పుడు సంప్రదాయాలు ఇప్పటికైనా ఆపండి. ఇలాంటివి ఎవరు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం దుర్మార్గం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఊరుకునేది లేదు. రియాక్షన్ అనేది కచ్చితంగా ఉంటుంది. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్‌లో రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దాడులు, విధ్వంసాలు ఆపాలని కోరడం లేదని, హెచ్చరిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇది ఏ మాత్రం న్యాయం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై, మంచి పాలన అందించడంపై చంద్రబాబు దృష్టి పెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం వైఎస్ జగన్ ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసక చర్యలు జరుగుతున్నాయి. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటు వైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచిని అర్హత ప్రామాణికంగా ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాం. ఈ రోజు చంద్రబాబునాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఆ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను విరగ్గొడుతున్నారు.. పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశు పాలుని పాపాల మాదిరిగా పండుతాయి. నెల్లూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అందుకే చంద్రబాబులో మార్పు రావాలి. లేదంటే ప్రజలు లెక్కా జమా సరిచేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..పిన్నెల్లిపై ఇంత అన్యాయంగా కక్ష సాధింపా?⇒ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. ఏ రకంగా అన్యాయంగా అతన్ని జైల్లో నిర్బంధించారో చూస్తున్నాం. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో టీడీపీ ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలోని మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినందున వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి బయల్దేరాడు. ⇒ కారంపూడికి అటు వైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే.. ఎమ్మెల్యే ఊర్లోకి ప్రవేశించక ముందే ఇటు వైపు అడ్డగించారు. గొడవ టౌన్లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు. నారాయణస్వామి అనే సీఐని పిన్నెల్లి చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న గొడవ జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23న ఆయనకేదో జరిగింది అన్నట్లుగా ఆ సీఐ, రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. ఆ సీన్లో లేని వ్యక్తిపై ఈ కేసు బనాయించారు. ఇది అన్యాయం కాదా? ⇒ అసలు ఇన్సిడెంట్ నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగి ఉంటే మే 15న మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం సిట్ వేసింది. 17 నుంచి 20వ తేదీ వరకు పల్నాడు ప్రాంతంలో ఆ సిట్ బృందం తిరిగి ఘటనపై రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఎందుకు ఈ అంశం రాలేదు? అలాంటప్పుడు ఈ రకంగా హత్యాయత్నం కేసులో ఒక మనిషిని ఇరికించడం ధర్మమేనా?ప్రతి దశలో ఓ రెడ్‌బుక్⇒ ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల స్థాయిలో రెడ్‌బుక్స్ అని చెప్పి పెట్టుకున్నారు. చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్‌బుక్, లోకేశ్ స్థాయిలో ఒక రెడ్‌బుక్, ఎమ్మెల్యే స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇలా రెడ్‌బుక్‌లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ⇒ మీ విధ్వంసాలు, దాడులను రాష్ట్రం మొత్తం చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడటం లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. చీనీ చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలు, పొక్లెయిన్ల మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్ట వేసి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, దాడులు, దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.ఎమ్మెల్యే 10 సార్లు ఫోన్ చేసినా ఎస్పీ స్పందించలేదు⇒ మే 13న ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గరకు అప్పటి ఎమ్మెల్యే వెళ్లినప్పుడు జరిగిన ఘటన మీద మరో కేసు పెట్టారు. అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది? అక్కడ ఉన్న ఎస్సీ సామాజిక వర్గం వారు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేనప్పుడు ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్లారు. ఆ పరిస్థితులను చూసి ఎస్పీకి 10 సార్లు ఫోన్ చేసినా కూడా స్పందించని పక్షంలో కనీసం సీఐని, ఎస్సైని పంపించండనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సెన్సిటివ్ బూత్‌లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఘటన జరిగింది. ఆ ఈవీఎం పగలగొట్టిన కేసులో తనకు బెయిల్ వచ్చింది. కానీ ఎవరిపైనో హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టి ఇవాళ జైలు పాలు చేశారు. ⇒ ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున కేసులు పెట్టారు. రిగ్గింగ్‌ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే, హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కదా? 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు పిన్నెల్లి గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంత వరకు ధర్మం? ఈ రోజు ఇది రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇలానే జరుగుతోంది. ⇒ వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు పిన్నెల్లితో ములాఖత్‌లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి తదితరులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు.ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకు?⇒ ప్రజలకు మంచి చేసి వైఎస్సార్సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులయ్యారు. 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్నారు. ఖరీఫ్‌లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు.⇒ బడులు మొదలయ్యాయి. అమ్మ ఒడి కింద జగన్ రూ.15 వేలు ఐదేళ్ల పాటు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తానని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని ప్రతి తల్లీ అడుగుతోంది. ⇒ 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. ప్రతి నెలా రూ.1500 ఇస్తానన్నావు, ఏమైంది? అని వీరందరూ ఈ రోజు అడుగుతున్నారు. ⇒ వీటన్నింటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రజలు ఎందుకు తమకు ఓటు వేశారు అని చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు నెలకొల్పాలి.. రాష్ట్రంలో రావణకాష్టం రగిలించాలి.. దొంగ కేసులు పెట్టి ఇరికించాలి.. ఆస్తులను ధ్వంసం చేయాలి.. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారెవరినీ ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం. -
పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు: వైఎస్ జగన్
Live Updates..l⇒పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు: వైఎస్ జగన్⇒టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు.⇒వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు⇒శిశుపాలుని పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు పండుతాయి⇒లెక్క జమ చేసి ప్రజలు చంద్రబాబుకు గట్టిగా జవాబిచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి.⇒బడులు ప్రారంభమైన అమ్మ ఒడి ఇవ్వడం లేదు⇒రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు⇒ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు⇒కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు లేవు⇒మే 14న ఘటన జరిగితే, మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు.⇒నిజం దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు?⇒అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్⇒నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని కలిసిన వైఎస్ జగన్⇒నెల్లూరు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి⇒సెంట్రల్ జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్న వైఎస్ జగన్⇒భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు⇒కాసేపట్లో వైఎస్ జగన్ నెల్లూరు చేరుకోనున్నారు. ⇒వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో నెల్లూరులో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నెల్లూరు జైలు వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకున్నారు. ⇒నెల్లూరు బయలుదేరిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి⇒కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్న జగన్⇒వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అక్రమ కేసులు, దాడులకు బలైన వారికి రక్షణ కల్పించేందుకు, బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు.⇒నేడు నెల్లూరు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. పిన్నెళ్లిపై తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక, రానున్న రోజుల్లో వైఎస్ జగన్.. పార్టీ కేడర్ కోసం న్యాయ పోరాటం చేస్తూనే బాధితులను కలుస్తూ వారికి భరోసా ఇవ్వనున్నారు. -
నెల్లూరుకు వైఎస్ జగన్
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరో కేసు నమోదు
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో అక్రమ కేసు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో పిన్నెల్లిపై టీడీపీ నేత శివ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. పిన్నెల్లిని కదలనివ్వకుండా అడ్డంగా నిలబడిన శివ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించాడు.పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేత దౌర్జన్యానికి దిగాడు. శివ ఇచ్చిన ఫిర్యాదుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.. అయితే పిన్నెల్లిపై దాడికి యత్నించిన శివపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పిన్నెల్లిపై అక్రమంగా కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.పిన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు.కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు.పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
పిన్నెల్లిపై దొంగ కేసు... ఆ పొలిసు అధికారి పనే
-
పిన్నెల్లి అరెస్ట్ పై గోపిరెడ్డి రియాక్షన్
-
పిన్నెల్లికి రిమాండ్
సాక్షి, నరసరావుపేట/నెల్లూరు (క్రైం): పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించింది. మరో రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఎస్. శ్రీనివాస కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ రోజు, తరువాత జరిగిన ఘటనలపై తనపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తోసిపుచ్చడం, ఆ వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి నరసరావుపేట ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మాచర్లకు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాస కల్యాణ్ ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన నాలుగు కేసులపై విడివిడిగా ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వాదనలు కొనసాగాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం కేసు, పోలింగ్ బూత్ ముందు మహిళను బెదిరించారంటూ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కారంపూడి సీఐ నారాయణస్వామి, టీడీపీ నేత నంబూరి శేషగిరిరావుపై దాడి కేసుల్లో రిమాండ్ విధించింది. పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. వెంటనే ఆయన్ని పటిష్ట భద్రత మధ్య నెల్లూరు తీసుకెళ్లారు. గురువారం ఉదయం 8.30 గంటలకు నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా కేంద్ర కారాగారం వద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎవరూ అక్కడికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.కోర్టు వద్దే పిన్నెల్లిపై దాడికి యత్నంపెన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు. పోలీసులు అడ్డుకోకపోవడంతో పిన్నెల్లి అతన్ని తోసుకొని కోర్టులోకి వెళ్లిపోయారు. కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు. పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
పల్నాడు, సాక్షి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమేర శివ అడ్డుగా నిలబడ్డారు. .. పిన్నెల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి.. మెజిస్ట్రేట్ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శివపైన అనేక కేసులు పెండింగ్‌లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10గం. టైంలో మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఇక.. పిన్నెల్లిని కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన టైంలో ఆయన ప్రత్యర్థి వర్గం బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే యత్నం చేసింది.ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట, మార్గంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లారు. -
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి, గుంటూరు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు, పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగగా.. పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించాడు. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్‌లను తెలుగుదేశం నేతలు కబ్జా చేసి, రిగ్గింగ్ చేశారని, ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్‌కు తాను వెళ్లానని పిన్నెల్లి హైకోర్టుకు తెలిపాడు. జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలు రాగా.. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల వైఎస్సార్సిపి క్యాడర్‌పై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. పలువురు కార్యకర్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి మిన్నకుండిపోయిన పోలీసులు.. టిడిపి నేతల ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని వైఎస్సార్సిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవ్వాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రాగానే పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. -
పిన్నెల్లి వ్యాజ్యాలపై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్‌లో పాల్గొనేందుకు పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తరువాత ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు.. తీవ్రంగా పరిగణించండిఈ సందర్భంగా పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం, పోలీసుల తీరును ఎండగట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులిచ్చిందని, గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈవీఎం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో ఆ వెంటనే హత్యాయత్నం కేసులు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారన్నారు. గత నెల 22న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా, 23న ఇతర కేసుల్లో పిన్నెల్లిని నిందితునిగా చేర్చారని తెలిపారు. హైకోర్టుకు మాత్రం 22నే చేసినట్లు చెప్పారని, తరువాత ఇది అబద్ధమని తేలడంతో 23నే నిందితునిగా చేర్చినట్లు పోలీసులు అంగీకరించక తప్పలేదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదుకు వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై పెట్టిన మరో కేసు చెల్లదని చెప్పారు.నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోండిపోలీసుల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశామని తెలిపారు. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైందన్నారు. మధ్యంతర ముందుస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి, అతని అనుచరుల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారన్నారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు, ప్రశ్నించిన మరో మహిళపై పిన్నెల్లి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు.అశ్వనీ కుమార్ నియామకం చట్ట విరుద్ధంఅనంతరం పిన్నెల్లి న్యాయవాది నిరంజన్‌రెడ్డి పోలీసుల తరఫున అశ్వనీ కుమార్ హాజరు కావడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన నియామకం సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనల్లో ఉంది తప్ప, స్పెషల్ కౌన్సిల్ గురించి లేదన్నారు. తప్పును సరిచేసుకుని చట్ట ప్రకారం ఆయన్ను నియమించుకుంటే అభ్యంతరం లేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
సాక్షి, అమరావతి : మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి వ్యాజ్యాలను విచారించేందుకు తగినంత సమయం లేకపోవడం, అప్పటికే రాత్రి 10.30 గంటలు కావడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లుఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆ వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు.టీడీపీ నేతలు అస్మిత్‌రెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులు కూడా ఇదే రకమైన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉందని అభ్యర్థించడంతో ఈ నెల 6వ తేదీ వరకు వారందరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.వాదనలు ముగిసేలోపు అర్ధరాత్రి అవుతుందిపిన్నెల్లి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. హైకోర్టుకు వేసవి సెలవుల కారణంగా అత్యవసర కేసులను విచారిస్తుండటంతో ఈ వ్యాజ్యాలు రాత్రి 9.30 గంటల సమయంలో విచారణకు వచ్చాయి. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు.అంతేకాక ఈ నెల 6న విచారణకు రానున్న వ్యాజ్యాలను పరిష్కరించాలని హైకోర్టుకు తెలిపిందన్నారు. తమ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలన్నింటినీ కోర్టు ముందు ఉంచి వాదనలు పూర్తి చేసేందుకు సమయం పడుతుందన్నారు. ఆ తరువాత తమ వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు స్పందించాల్సి ఉంటుందని, ఇవన్నీ పూర్తయ్యే లోపు అర్థరాత్రి దాటుతుందని నిరంజన్‌రెడ్డి వివరించారు. పైపెచ్చు సుప్రీంకోర్టు 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించి తీరాలని చెప్పలేదని, ఎలాంటి గడువు నిర్దేశించకుండా ఆ రోజున విచారణకు వచ్చే వ్యాజ్యాలను పరిష్కరించాలని మాత్రమే చెప్పిందన్నారు.అనంతరం ఆయన కేసుకు సంబంధించిన వాదనలను వినిపించారు. పోలీసులు తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు సైతం స్పష్టంగా పేర్కొందని వివరించారు. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు దురుద్దేశపూర్వకంగా ఉందన్నారు. ఉదయం 10.30 నుంచి విరామం లేకుండా వరుసగా అనేక కేసులు విచారణ జరిపి న్యాయమూర్తి తీవ్రంగా అలసిపోయినట్లు ఉండటాన్ని గమనించిన నిరంజన్‌రెడ్డి.. విచారణను శనివారానికి వాయిదా వేయాలని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వినిపిస్తామని చెప్పారు. శనివారం తాను కేసు వినేందుకు నిబంధనలు అనుమతించవని, ప్రధాన న్యాయమూర్తి అనుమతించాల్సి ఉంటుందని జస్టిస్ విజయ్ స్పష్టం చేశారు.అలా అయితే విచారణను వచ్చే వారానికి (13వ తేదీకి) వాయిదా వేయాలని, ఆ రోజున పూర్తిస్థాయి వాదనలు విని నిర్ణయాన్ని వెలువరించవచ్చని నిరంజన్ రెడ్డి చెప్పారు. తాము కూడా ఉదయం నుంచి పలు కేసుల్లో వాదనలు వినిపిస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పుడే వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదుల అభిప్రాయం కోరారు.వాదనలు విని తీర్పు చెప్పేలోపు తెల్లారుతుందిఫిర్యాదుదారు శేషగిరిరావు తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. మూడు క్రైం నంబర్లు ఒకే అంశానికి సంబంధించినవైనందున, అన్నింటినీ కలిపే విచారించాలని కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. అన్ని వ్యాజ్యాలపై వచ్చే వారం విచారణ జరుపుతానని తెలిపారు. ఇప్పటికే 10.20 అయిందని, ఇప్పుడు వాదనలు విని, తీర్పు చెప్పేలోపు తెల్లారి అవుతుందని, తాను అందుకు సిద్ధమేనని, అయితే కోర్టు సిబ్బంది ఇళ్లకు వెళ్లాల్సి ఉందని గుర్తు చేశారు. విచారణను వాయిదా వేయడంపై పోసాని వెంకటేశ్వర్లు అభిప్రాయం కోరగా, ఆయన కూడా అందుకు అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పిన్నెల్లి అరెస్ట్ విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాయిదాకు ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు అంగీకరించిన విషయాన్ని కూడా తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు.అలాంటి మాటలు ఇంకెవరి ముందైనా చెప్పండిపోలీసు అధికారి నారాయణ స్వామి (పిన్నెల్లి ఫిర్యాదు మేరకు ఇతన్ని ఎన్నికల సంఘం విధులకు దూరంగా ఉంచింది) తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు చేయకుంటే బాగుండదన్నారు. దీనిపై మళ్లీ ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఈ వాదనపై న్యాయమూర్తి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘సుప్రీం కోర్టుకు వెళితే వెళ్లనివ్వండి. ఎవరో వెళతారని మీరెలా చెబుతారు? ఇలాంటివన్నీ ఇంకెవరి ముందైనా చెప్పండి. ఈ కోర్టుకు కాదు.కోర్టు పని వేళలు సాయంత్రం 4.15 గంటల వరకే. ఈ సమయం దాటి కేసులు విచారించకూడదు. మరి దీని గురించి ఏమంటారు’ అంటూ న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. దీంతో వెనక్కి తగ్గిన అశ్వనీ కుమార్ కోర్టును క్షమాపణలు కోరారు. అల్లర్లలో నారాయణస్వామి తలకు తీవ్ర గాయమైందన్నారు. దీనికి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. నారాయణస్వామి తలకు తగిలిన గాయం స్వల్పమైనదేనని, ఈ విషయాన్ని ఆయన సమర్పించిన మెడికల్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుందని చెప్పారు. స్వల్ప గాయమని డాక్టర్లు చెబుతుంటే, తీవ్రమైనదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. -
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్స్పెక్టర్ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. -
పిన్నెల్లి పిటిషన్‌పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
అమరావతి:ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై సీఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో రెండు రోజుల క్రితం హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపిందిదాంతో రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు పన్నిన కుట్రలు పటాపంచలు అయ్యాయి. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. -
పిన్నెల్లి పిటిషన్ పై విచారణ.. సీఈసీకి హైకోర్టు ఆదేశం