ఉత్కంఠభరితంగా సాగిన కోడిపోరు | Fighting cocks in a thrilling stretch | Sakshi
Sakshi News home page

ఉత్కంఠభరితంగా సాగిన కోడిపోరు

Published Sun, Dec 13 2015 6:43 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Fighting cocks in a thrilling stretch

గుంటూరు జిల్లా కారంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధనోత్సవాలలో నాలుగో రోజు ఆదివారం కోడి పోరు ఉత్సవం ఉత్కంఠభరితంగా సాగింది. అలనాటి కోడి పందేలను తలపించేలా కోడి పోరును వీరులగుడి ఆవరణలో నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోడిపోరులో పాల్గొన్నారు.

బ్రహ్మనాయుడు కోడిపుంజును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, నాయకురాలు నాగమ్మ కోడిపుంజును ఎమ్మెల్యే ఆంజనేయులు బరిలోకి వదిలారు. సంప్రదాయం కోసం మూడు విడతలుగా నిర్వహించిన పోరులో రెండుసార్లు బ్రహ్మనాయుడు పుంజు గెలిచింది. రాజ్యాన్ని వీడి అరణ్యవాసం చేయాలనే షరతుతో జరిగిన మూడో పందెంలో నాయకురాలు పుంజు గెలిచినట్లుగా పోరును ముగించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement