
మాచర్ల: గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల వద్ద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడు ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి అదుపుతప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు సురక్షితంగా బయటపడగా.. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ సుందరరామిరెడ్డి కుమారుడు మదనమోహన్‌రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి గుంటూరు వెళ్లారు.
తిరిగి మాచర్ల వస్తుండగా కారు అదుపు తప్పి కుడికాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి మదన్‌మోహన్‌రెడ్డిని కాపాడారు. కారులో ఉన్న ఆయన భార్య, కుమార్తె ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గజఈతగాళ్లతో గాలింపు చేయిస్తున్నారు. సంఘటనపై విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment