
మాచర్ల రూరల్: కారు అదుపుతప్పి సాగర్ కుడి కాలువలో పడిన ఘటనలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి భార్య లావణ్య (30), కుమార్తె సుదీక్షిత (9) కన్నుమూశారు. మంగళవారం రాత్రి మదన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు సాగర్ కుడి కాలువలో పడిపోయిన విషయం తెలిసిందే.
అడిగొప్పల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే సమయంలో కారు కాలువలో పడింది. మదనమోహన్‌రెడ్డిని స్థానికులు కాపాడారు. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లు కాలువలో గాలించారు. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో కారును గుర్తించారు. కారులోనే ఉన్న లావణ్య, సుదీక్షిత అప్పటికే విగతజీవులుగా మారారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.