Madanmohan reddy
-
ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డితో పాటు కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మదన్‌మోహన్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాలాపూర్ మండలం గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి 14 గుంటల పట్టా భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి దీన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ను కలిసి అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇ–సెక్షన్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించారు. విషయం అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, రూ.8 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు స్కెచ్చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మదన్‌మోహన్‌రెడ్డిని గుర్రంగూడ ఎక్స్‌రోడ్‌కు ముత్యంరెడ్డి పిలిపించాడు. మాటు వేసి.. సీనియర్ అసిస్టెంట్ తన స్విఫ్ట్ డిజైర్ టీఎస్ 08ఎఫ్ఆర్ 1134 కారులో అక్కడికి చేరుకోగా ముత్యంరెడ్డి రూ.8 లక్షల నగదుతో కూడిన సంచిని అందజేశాడు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు మదన్‌మోహన్‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అతను అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు చెప్పడంతో అతనితో భూపాల్‌రెడ్డికి ఫోన్ చేయించారు. నగదు తీసుకుని ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట్ ఎగ్జిట్ వద్దకు రావాలని భూపాల్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఇన్నోవా కారు (టీఎస్ 07జీకే0459)లో రాత్రి 10.41 గంటలకు పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మదన్మోహన్ తన కారులో ఉన్న నగదును భూపాల్‌రెడ్డి వాహనంలో పెట్టారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు భూపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్‌కు తీసుకొచ్చి విచారించారు. తెల్లారేవరకు అక్కడే ఉంచారు. కీలక ఫైళ్లను స్వా«దీనం చేసుకున్నారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాదీనం హయత్‌నగర్ పరిధిలోని తట్టిఅన్నారం వద్ద ఇందు అరణ్య విల్లాస్‌లో ఉంటున్న భూపాల్‌రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మదన్‌మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలను ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఐదుగురిని పట్టించిన ముత్యంరెడ్డిగుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డి గతంలో తుర్కయాంజాల్‌కు చెందిన ఓ వీఆర్వో, మున్సిపల్ పరిధిలోని బిల్ కలెక్టర్‌తో పాటు ఓ ఎస్ఐని కూడా వివిధ కేసుల్లో ఏసీబీకి పట్టించడం గమనార్హం. కాగా ఇప్పుడు ఏకంగా ఓ అదనపు కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ను కూడా పట్టించారు. -
కారు ప్రమాదంలో ఎమ్మెల్యే బంధువులు దుర్మరణం
మాచర్ల రూరల్: కారు అదుపుతప్పి సాగర్ కుడి కాలువలో పడిన ఘటనలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి భార్య లావణ్య (30), కుమార్తె సుదీక్షిత (9) కన్నుమూశారు. మంగళవారం రాత్రి మదన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు సాగర్ కుడి కాలువలో పడిపోయిన విషయం తెలిసిందే. అడిగొప్పల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే సమయంలో కారు కాలువలో పడింది. మదనమోహన్రెడ్డిని స్థానికులు కాపాడారు. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లు కాలువలో గాలించారు. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో కారును గుర్తించారు. కారులోనే ఉన్న లావణ్య, సుదీక్షిత అప్పటికే విగతజీవులుగా మారారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. -
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
బోడుప్పల్ ఈదయ్యనగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈదయ్యనగర్‌లో కె. మదన్‌మోహన్‌రెడ్డి(31), జగన్‌రెడ్డి(32), బీరు శివ(28), మాధవరెడ్డి(58), పి. శ్రీనివాస్‌రెడ్డి(38), అవినాష్(22)లు పేకాట ఆడుతున్నారు. ఇది గమనించిన స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 8640లు నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఔరా! పారా మోటార్ గ్లైడర్ విన్యాసం
కడప నగరం చేరుకున్న మదన్‌మోహన్‌రెడ్డి సాహసయాత్ర వైవీయూ: వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన ఎల్.మదన్‌మోహన్‌రెడ్డి పారా మోటార్ గ్లైడర్ విన్యాసం ప్రజలను అబ్బురపరచింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్మన్గా చేరిన మదన్ ప్రస్తుతం జూనియర్ వారెంట్ ఆఫీసర్‌గా కోయంబత్తూరులో పని చేస్తున్నారు. ఈయన ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. 10 వేల కిలోమీటర్ల లక్ష్యంతో ఐదుగురు సభ్యుల స్కైరైడర్స్ బృందం ‘ప్రదక్షిణ’ పేరుతో 45 రోజులపాటు 12 రాష్ట్రాల మీదుగా సాహసయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 3న పశ్చిమబెంగాల్లోని కొలైకొండ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా మదన్ మంగళవారం కడపలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో దిగారు. ఈయన వెంట టీం సభ్యులు సోలంకి, యాదవ్, విశాల్, కుల్దీప్, ధర్మవీర్సింగ్ ఉన్నారు.