
ఔరా! పారా మోటార్ గ్లైడర్ విన్యాసం
కడప నగరం చేరుకున్న మదన్‌మోహన్‌రెడ్డి సాహసయాత్ర
వైవీయూ: వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన ఎల్.మదన్‌మోహన్‌రెడ్డి పారా మోటార్ గ్లైడర్ విన్యాసం ప్రజలను అబ్బురపరచింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మన్‌గా చేరిన మదన్ ప్రస్తుతం జూనియర్ వారెంట్ ఆఫీసర్‌గా కోయంబత్తూరులో పని చేస్తున్నారు. ఈయన ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్నారు.
10 వేల కిలోమీటర్ల లక్ష్యంతో ఐదుగురు సభ్యుల స్కైరైడర్స్ బృందం ‘ప్రదక్షిణ’ పేరుతో 45 రోజులపాటు 12 రాష్ట్రాల మీదుగా సాహసయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 3న పశ్చిమబెంగాల్‌లోని కొలైకొండ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా మదన్ మంగళవారం కడపలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో దిగారు. ఈయన వెంట టీం సభ్యులు సోలంకి, యాదవ్, విశాల్, కుల్‌దీప్, ధర్మవీర్‌సింగ్ ఉన్నారు.