గాలిలో తేలి.. తేలి.. తేలిపొండి! | Paramotoring event to mark Telangana Formation Day | Sakshi
Sakshi News home page

గాలిలో తేలి.. తేలి.. తేలిపొండి!

Published Mon, Jun 4 2018 4:26 AM | Last Updated on Mon, Jun 4 2018 4:26 AM

Paramotoring event to mark Telangana Formation Day - Sakshi

రైడింగ్‌కు సిద్ధమవుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆకాశంలో రైడింగ్‌ దృశ్యాలు

హైదరాబాద్‌: నగర యువతకు రాష్ట్ర టూరిజం అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ విభాగం పారా మోటర్‌ రైడింగ్‌ను ప్రారంభించింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని బైసన్‌పోలో మైదానంలో ఆదివారం ప్రారంభమైన ఈ రైడింగ్‌ మరో 2 రోజుల పాటు  అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ మహేందరెడ్డి, టూరి జం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, తెలంగాణ, ఆంధ్ర సబ్‌ఏరియా కమాండింగ్‌ ఆఫీసర్, మేజర్‌ జనరల్‌ ఎన్‌.శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డీజీ పీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ రైడ్‌ను ప్రజలు ఎంజాయ్‌ చేయాలన్నారు. టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రెట రీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ కేవలం రూ.2,500 చెల్లిస్తే గాలిలో డ్రైవ్‌ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ రైడ్‌ ఉంటుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement