adventure sports
-
చీర...శక్తికి చిహ్నం
సంప్రదాయానికి ప్రతీకగానే కాదు... దక్షిణాసియా అంతటా సొగసైన వైభవంగా ఐకానిక్ సిక్స్ యార్డ్‌గా పేరొందింది చీరకట్టు.ఈ ఎవర్గ్రీన్ చీర కట్టును సాహసోపేతమైన క్రీడల ప్రపంచంలోనూ వాడచ్చని నిరూపిస్తోంది అఫ్సానా బేగం. జపాన్‌లోని చిబా విశ్వవిద్యాలయంలో డాక్టోరల్ విద్యార్థి అఫ్సానా దక్షిణాసియాలోని సాంస్కృతిక వారసత్వాన్ని సగర్వంగా ప్రదర్శిస్తోంది. చీరకట్టుతో సైక్లింగ్, స్కై డైవింగ్, సర్ఫింగ్, గ్లైడింగ్.. వంటి క్రీడల్లో పాల్గొంటోంది.‘క్రీడలకు నిర్దిష్ట యూనిఫాం అవసరమనే సంప్రదాయాన్ని చీరకట్టుతో సవాల్ చేస్తున్నాను. తరతరాలుగా చీర మన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది. దక్షిణాసియా అంతటా ఉత్సవ వైభవంతో వెలిగిపోతుంటుంది. అయినప్పటికీ, స్నోబోర్డింగ్, స్కైడైవింగ్ వంటి సాహసోపేతమైన క్రీడల కోసం ఈ ఐకానిక్ సిక్స్– యార్డ్ ఫాబ్రిక్ ఎంపిక చేయదగిన వస్త్రం కాదనే అపోహ ఉంది. దీనిని ఎలా ఉపయోగించవచ్చో చూపాలనుకున్నాను. మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూనే, సాహసోపేతమైన క్రీడల ప్రపంచంలో చీర బలం, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాలనుకున్నాను.చరిత్రలో బలమైన శక్తినాకు సైకిల్ తొక్కడం వంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. మా యూనివర్శిటీలో చీరకట్టుతో సైక్లింగ్ చేస్తుంటాను. అయితే, రైడింగ్ టైమ్‌లో చీరలు అంత అనుకూలమైనవి కావని నా స్నేహితులు అందులోని అసౌకర్యాన్ని ఫీలవుతుండేవారు. పైగా ఏవేవో కామెంట్స్ చేస్తుండేవారు. ఈ దృక్పథాన్ని మార్చాలనే ఆలోచన రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ‘చీర’ మన రోజువారీ కార్యకలపాలలో ఒక చైతన్యాన్ని తీసుకువస్తుంది.దక్షిణాసియాలో ముఖ్యమైన సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాల సమయాల్లో చరిత్రలో మహిళలు ఈ వస్త్రాన్ని ఎలా ధరించారో నాకు తెలుసు. చీర ఎప్పుడూ నాకు శక్తికి చిహ్నంగా ఉంది. ఈ విషయాన్ని నా 30వ పుట్టినరోజు సందర్భంగా అసౌకర్యాన్ని సౌకర్యంగా, అత్యంత శక్తిమంతంగా ఎలా చూపించవచ్చో క్రీడల్లో ఆధునిక వస్త్రధారణ విధానాలను ఎలా సవాల్ చేయచ్చో నిరూపించాలనుకున్నాను. చీరలో స్కై డైవింగ్ చేసి ఆ శక్తిని చూపాను. దీంతో మా యూనివర్శిటీ విద్యార్థులందరికీ ఈ నా సవాల్ వెనక ఉన్న అంతరార్థం అర్థం అయ్యింది.మార్పు కోసమే సవాల్నేను పుట్టి పెరిగింది బంగ్లాదేశ్‌లో. అక్కడ సంప్రదాయ దుస్తులకు చాలా ్రపాధాన్యత ఉంటుంది. నేను జపాన్‌లోనూ నా సంప్రదాయ దుస్తుల్లోనే కాలేజీకి వెళ్లడం, రోజువారి కార్యకలాపాల్లో పాల్గొనడం చేసేదాన్ని అయితే, ఇక్కడి వారిలో చీరపైన సరైన అవగాహన లేదు. దాంతో నా చుట్టూ ఉన్న వారినుంచే కొన్ని కామెంట్స్ ఎదుర్కొనేదాన్ని. చీరకట్టు వల్ల కలిగే శక్తి, ప్రయోజనాల గురించి చాలా చెప్పాల్సి వచ్చేది. వాదించాల్సి వచ్చేది. ఇక్కడ మార్పు తీసుకురావాలనుకున్నాను.ముందుగా ప్రజా రవాణాలో చీరకట్టుకు గౌరవం పెరగడానికి కృషి చేశాను. అదే ఇప్పుడు సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనేలా చేసింది. ఢాకా యూనివర్శిటీ విద్యార్థిగా అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న రోజుల్లో చీరతోనే నా ప్రయాణం మొదలైంది. ప్రెజెంటేషన్ ల కోసం సంప్రదాయ దుస్తులను ధరించమని నా స్నేహితులను ్రపోత్సహించేదాన్ని. అసౌకర్యం అంటూ అయిష్టత చూపేవారు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి కుట్టు లేకుండా తన అసమానమైన శక్తిని మనలోకి చేర్చే గుణం చీరకు ఉంది. భద్రతా సమస్యలను సవాల్ చేస్తూ!సాహసోపేతమైన క్రీడలలో భద్రత చాలా ముఖ్యమైనది. కోచ్‌లు కూడా తమ ్రపోటోకాల్స్ దృష్ట్యా వారు సూచించిన దుస్తులనే ధరించాలంటారు. కానీ, భద్రతా సమస్యలను పరిష్కరించడానికే నేను చీరకట్టుతో సవాల్ చేస్తున్నాను అనే విషయం పట్ల అవగాహన కలిగించి, మరీ ఈ డ్రెస్‌ను ధరించాను. నా అభిరుచి కూడా ఇలాగే కొనసాగుతుంది. స్కైడైవింగ్ సమయంలో చీరకట్టుపై నుంచి బెల్ట్‌తో సెట్ చేసుకున్నాను. పెటికోట్కు బదులుగా జీన్స్ ధరించాను. స్నోబోర్డింగ్‌లో నా కదలికకు చీర అంతరాయం కలిగించకుండా, వెచ్చగా ఉండటానికి వేడిచేసిన గేర్ ధరించాను. ఈ జాగ్రత్తల మార్పుతో భద్రతకు భరోసానిస్తూ సాంస్కృతిక ్రపామాణికతను కాపాడుకోవడానికి అనుమతి లభించింది.ప్రయత్నాలకు ప్రతిస్పందనచీరతో సాహసోపేతమైన క్రీడా ప్రయత్నాలకు మంచి ప్రతిస్పందన, ప్రశంసలు లభించింది. నా ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా మంచి ఉత్సుకత రేకెత్తించింది. చాలా మంది ఆశ్చర్యపోయారు. తెల్లటి మంచులో ప్రకాశవంతమైన రంగుల చీరను చూసి ఎంతో మంది అభినందించారు. ఒకసారి, కిమోనోస్లో స్నోబోర్డింగ్ చేస్తున్నప్పుడు జపనీస్ జంటను ఎదురుపడింది. వారు ఎన్ని ప్రశ్నలు అడిగారో! ‘సాంస్కృతిక వస్త్రధారణ ఏదైనా అభిరుచిలో భాగమ’ని వారితో నా అనుభవాలను పంచుకున్నాను. భవిష్యత్తు కోసంవాటర్ స్కీయింగ్ లేదా చీరలో సర్ఫింగ్ వంటి మెరైన్ స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నాను. సాంస్కృతిక వారసత్వాన్ని అత్యాధునిక క్రీడలతో మిళితం చేసి కొనసాగించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆధునిక, అసాధారణమైన మార్గాల్లో సంప్రదాయాలను పరిచయం చేయడానికి, ఎంతోమందిలో స్ఫూర్తి నింపడమే నా లక్ష్యం. దీని వల్ల ఈ సాంస్కృతిక వైభవం ప్రపంచ వస్త్రాలలోనే సుసంపన్నం అవుతుంది. ఇతరులను శక్తివంతం చేయడానికి నా సాహసాన్ని అంకితం చేస్తున్నాను.మహిళలు తమ సాంస్కృతిక దుస్తులను ధరిస్తూనే అసాధారణ క్రీడల్లో పాల్గొనవచ్చు. ఎవరికైనా వారి సొంత ఎంపిక చాలా ముఖ్యం. వారి కంఫర్ట్ జోన్ నుండి బయటపడి కొత్తదాన్ని ప్రయత్నించేలా నా ఈ ప్రయత్నం ఉపయోగపడితే అది వారి వ్యక్తిగత వృద్ధికి దారితీస్తుందని నమ్ముతాను. సంప్రదాయం మనల్ని బంధించదు. కొత్త మార్గాల్లో ప్రయత్నించేందుకు కొత్త శక్తిని ఇస్తుంది’’ అంటుంది అఫ్సానా. -
హైదరాబాద్‌లో అడ్వెంచర్స్.. వీకెండ్లో చిల్ అవ్వండి
హైదరాబాద్‌లో అంటేనే నోరూరించే కమ్మని వంటకాలు, అనేక పర్యాటక ప్రదేశాలకు ఫేమస్. వీకెండ్ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. అడ్వెంచర్ యాక్టివిటిస్కి కూడా హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. ఒకప్పుడు పారాగ్లైడింగ్ అంటే గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఎన్నో అడ్వెంచర్ స్పాట్స్, అది కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. బంగీ జంపింగ్ లైఫ్‌లో ఒక్కసారైనా బంగీ జంపింగ్‌ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొండలు, బ్రిడ్జి వంటి ఎత్తైన ప్రదేశాల నుంచి తాళ్లతో శరీరాన్ని కట్టుకొని కిందకు దూకండి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బంగీజంపింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ యాక్టివిటి కోసం మన హైదరాబాద్‌లోనే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వాటిలో రామోజీ ఫిల్మ్ సిటీ,లియోనియా రిసార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో అందుబాలో ఉంది. దీని ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా బంగీ జంప్ చేయొచ్చు. దీనికోసం ముందుగానే బీపీ, హార్ట్‌రేట్ వంటివి చెక్ చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులకే బంగీ జంపింగ్ అనుమతిస్తారు. పారాగ్లైడింగ్ రెక్కలు కట్టుకొని ఆకాశలో ఎగురుతూ భూమిపై ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే పారాగ్లైడింగ్ బెస్ట్ ఛాయిస్.ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను ఆస్వాదించవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. హైదరాబాద్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర్లో అందుబాటులో ఉంది. ధర రూ.3500 జిప్‌లైన్ చాలా ప్రాంతాల్లో జిప్‌లైన్ కోసం 50 మీటర్ల నుంచి ఎత్తులో బ్యూటిఫుల్ నేచర్‌ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్‌లో శామీర్‌పేట్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, ఎక్సోటికా బొటిక్ రిసార్ట్ వంటి ప్రాంతాల్లో జిప్‌లైన్ యాక్టివిటి అందుబాలో ఉంటుంది. ధర రూ. 700-1000 వరకు ఉంటుంది. వీకెండ్స్‌లో ధర మారుతుంది) స్కై డైవింగ్ ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి గాల్లోకి దూకే సాహసక్రీడను స్కై డైవింగ్ అంటారు. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండోర్‌లో కూడా పొందచ్చు. అది ఎక్కడంటే..గండిపేట సమీపంలో గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఈ ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందిచ్చు. ఇందుకోసం ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. ధర సుమారు రూ. 3300 నుంచి 4300 వరకు ఉంటుంది. (వీకెండ్స్‌లో ధర మారుతుంటుంది) ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కోసం సిటీలో చాలా ప్రాంతాలు ఉన్నా అనంతగిరి హిల్స్ బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. వీకెండ్ వస్తే చాలు ఇక్కడికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా హైదరబాదీలో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఇందుకోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. క్లౌడ్ డైనింగ్ సాధారణంగా రెస్టారెంట్లో ఎవరైనా భోజనం చేస్తారు. కానీ ఆకాశానికి, భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తే ఆ ఫీలింగే వరే. గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తూ భోజనం చేస్తే ఆ థ్రిల్లింగ్ చెప్పక్కర్లేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే హైదరాబాద్‌లోని క్లౌడ్ డైనింగ్‌కు వెళ్లాల్సిందే. ఇది హైటెక్ సిటీ సమీపంలో ఉంటుంది. ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ భోజనం చేయాలంటే.. రూ.5,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రపంచంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
Andhra Pradesh: సాహస పర్యాటకంపై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల, సాహస క్రీడల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వివిధ జిల్లాల్లో బోటింగ్‌కు అనువైన జల వనరులను, అడ్వెంచర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్‌కు వీలుండే ప్రాంతాలను గుర్తించింది. ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్లను ఆహ్వానించగా.. 50 ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలోనే ఏపీటీడీసీ ఆయా సంస్థలతో ఏపీటీడీసీ పూర్తిస్థాయి అగ్రిమెంట్లు పూర్తి చేసుకోనుంది. అనంతరం సుమారు రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులతో జల, సాహస క్రీడల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఇలా.. విశాఖపట్నం డివిజన్లో జోడుగుళ్లపాలెం, భీమిలి, సాగర్ నగర్, హిరమండలం డ్యామ్, శృంగవరపు కోట, తాండవ రిజర్వాయర్, పూడిమడక, కొండకర్ల ఆవ, మంగమారి పేట, యండాడ, శారదా రివర్, గోస్తనీ నది, కాకినాడ డివిజన్లో భూపతిపాలెం రిజర్వాయర్, హోప్ ఐలాండ్, పాలవెల్లి, అంతర్వేది, కర్నూలు డివిజన్లో సంగమేశ్వర, సుంకేసుల, గార్గేయపురం, చిన్న చెరువు, నెల్లూరు డివిజన్లో గుండ్లకమ్మ, ఏపూరపాలెం–చీరాల, కొత్తపట్నం బీచ్, పాపాయపాలెం, కొత్తకోడూరు, మైపాడు, నెల్లూరు ట్యాంక్, కడప డివిజన్లో పీర్ గైబుషా కోట, కర్నూలు డివిజన్లో ఒంటిమిట్ట, విజయవాడ డివిజన్లో హంసలదీవి, సూర్యలంక, అనుపు–నాగార్జున సాగర్, మోటుపల్లి బీచ్, రివెరా బీచ్ రిసార్ట్ ఫ్రంట్, రామాపురం–వేటపాలెం, తిరుపతి డివిజన్లో రాయలచెరువు, కడప డివిజన్లో బుక్కరాయ చెరువు (బుక్కరాయపట్నం), చిత్రావతి రివర్ (పుట్టపర్తి) ప్రాంతాల్లో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అడ్వెంచర్, ఫన్ జోన్లు ఇలా.. విజయవాడ డివిజన్లోని బెరంపార్కు, ఎత్తిపోతల జలపాతం(పల్నాడు)లో ఫన్‌జోన్, గాలి బెలూన్ల గేమ్స్, కర్నూలు డివిజన్లోని శ్రీశైలం, విశాఖ డివిజన్ బొర్రా గుహల వద్ద వర్చువల్ క్రికెట్, 12డీ షోలు, బొర్రా గుహల ప్రాంతంలో స్కై సైకిల్, స్కై వాక్, బార్మా వంతెన, గాలికొండలో జిప్‌లైన్, కాకినాడ డివిజన్ దిండి, ద్వారకా తిరుమల, తిరుపతి డివిజన్ పులిగుండు, హార్సిలీ హిల్స్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విశాఖలోని జింధగడ ట్రెక్కింగ్, నెల్లూరులోని నరసింహ కొండలో ప్రత్యేకంగా ట్రెక్కింగ్ సెంటర్లను ప్రవేశపెడుతున్నారు. -
బహుముఖం: ‘జెమ్’వాల్
చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాహసికుల గురించి వింటూ పెరిగింది ఇషానిసింగ్ జమ్వాల్. అయితే ఆ సాహసాలు ఆమె చెవికి మాత్రమే పరిమితం కాలేదు. ‘ఛలో... మనమెందుకు చేయకూడదు’ అని అనిపించేలా చేశాయి. తాజాగా కార్గిల్‌లోని కున్ శిఖరాన్ని అధిరోహించి ‘జెమ్’ అనిపించుకుంది... ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (ఐఎంఎఫ్)కు చెందిన తొమ్మిదిమంది సభ్యులు కార్గిల్‌లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్ శిఖరాన్ని అధిరోహించడానికి గత నెల చివరి వారంలో బయలుదేరారు. తాజాగా కున్ శిఖరాన్ని అధిరోహించిన ఇషానిసింగ్ జమ్వాల్ జేజేలు అందుకుంటుంది. ‘ఈ సాహసయాత్రలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని పర్వతారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది ఇషా. హిమాచల్‌ప్రదేశ్‌లోని పహ్నల గ్రామానికి చెందిన ఇషానిసింగ్కు చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆరవతరగతి నుంచే రకరకాల సాహసక్రీడల్లో పాల్గొనేది. స్కీయింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. పర్వతారోహణపై ఆసక్తితో మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ తీసుకుంది. చిన్నప్పుడు ఇషా తన పుస్తకాలలో రాసుకున్న ‘ఎడ్వెంచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ’ ‘నెవర్ గివ్ అప్’ ‘లైఫ్ ఈజ్ యాన్ ఎడ్వెంచర్’లాంటి వాక్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన రకరకాల విషయాలను ఇషాకు చెబుతుండేవారు. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పర్వతారోహణలో రికార్డ్ సృష్టించిన ఫ్రెంచ్ మహిళ మేరీ ప్యారడైస్ నుంచి ఆల్ఫ్లోని మ్యాటర్‌హార్న్ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ లూసీ వాకర్ వరకు ఎంతోమంది సాహహికులైన మహిళలు గురించి చెబుతుండేది తల్లి నళినీసింగ్. పుస్తకాల విషయానికి వస్తే అలనాటి ‘నో పిక్నిక్ ఆన్ మౌంట్ కెన్యా’ నుంచి ఇప్పటి ‘నో షార్ట్ కట్స్ టు దీ టాప్’ వరకు ఇషాకు ఎన్నో ఇష్టం. విన్న మాట కావచ్చు, చదివిన అక్షరం కావచ్చు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఇషానిసింగ్కు ఉపయోగపడ్డాయి. ‘ఇషా కున్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు తండ్రి శక్తిసింగ్. ఇషానిలోని మరోకోణం... మోడలింగ్. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఇషాని ‘తనిష్క్’ కోసం చేసిన ఒక యాడ్‌లో ఆమెను ‘మౌంటెనీర్’ ‘అథ్లెట్’ ‘మోడల్’ అంటూ పరిచయం చేస్తారు. అయితే ఆ వరుసలో చేర్చాల్సిన మరో విశేషణం... మోటివేషనల్ స్పీకర్. ఆమె ఉపన్యాసాలు ఆకట్టుకోవడమే కాదు స్ఫూర్తిని ఇస్తాయి. ‘మనకు మనం కొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి’ అంటుంది ఇషానిసింగ్. అప్పుడే కదా విజయాలు మన దరి చేరేవి! -
లుక్కుండాలె.. లెక్కుండాలె..!
సాక్షి, హైదరాబాద్: ఇక ఇష్టారాజ్యంగా సాహసక్రీడలు నిర్వహించడం కుదరదు. వీటిపై ఓ లుక్కుండాలి.. వీటికో లెక్కుండాలని కేంద్రం స్పష్టం చేసింది. విధివిధానాలు రూపొందించింది. భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్టతోపాటు భువనగిరి గుట్ట వద్ద ట్రెక్కింగ్ చేస్తున్న యువ కులు కనిపిస్తారు.. ఈ ట్రెక్కింగ్‌కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఏంటి? వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టల్లో తరచూ మోటారు సైకిల్, సాధారణ బైసికిల్ రేసులు కనిపిస్తాయి. కానీ, వీటిని నిర్వహిస్తున్నదెవరు? వీటి గురించి తెలంగాణ పర్యాటకశాఖ వద్ద ఎలాంటి సమాచారం ఉండదు. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. సాహస క్రీడలు నిర్వహిస్తున్న సంస్థలేవో కూడా సమాచారం లేకుండా పర్యాటకశాఖ ఉండటమేంటని ప్రశ్నించింది. ఇక నుంచి సాహస క్రీడలకు సంబంధించి విధివిధానాలను అనుసరిం చాల్సిందేనని స్పష్టం చేసింది. ఎవరు పడితేవారు నిర్వహించొద్దు రాష్ట్రంలో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మోటారు బైక్స్ రేసింగ్, సైక్లింగ్, టెర్రయిన్ కార్ స్పోర్ట్స్... ఇలాంటివి చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేసుకుని గో కార్టింగ్లు నిర్వహిస్తున్నాయి. కొన్నిసంస్థలు క్లబ్‌గా ఏర్పడి సభ్యులను చేర్చుకుని తరచూ సైక్లింగ్, బైక్ రైడింగ్ లాంటివి నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ధనార్జన లక్ష్యంగా లేకున్నా, సాహసక్రీడలను నిర్వహించే కుతూహలం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైక్లింగ్, ట్రెక్కింగ్ లాంటి భూమి మీద నిర్వహించే 15 రకాల సాహస క్రీడలు, నీటిలో, గాలిలో నిర్వహించే ఏడు చొప్పున క్రీడలకు సంబంధించి ఈ విధివిధానాలను సిద్ధం చేసింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలంటే ఈ సాహస క్రీడలను విస్తృతం చేయాలని గతంలోనే కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో స్థానిక వనరుల ఆధారంగా సాహస క్రీడలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ రూపంలో 430 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని అంచనా వేసింది. ఇది వచ్చే కొద్ది సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. కానీ, మనదేశంలో చాలా ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని నిర్వహిస్తున్న తీరును గుర్తించింది. విదేశీ పర్యాటకులు సైతం వీటిపై ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొంది. చాలాచోట్ల కనీస జాగ్రత్తలు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త విధివిధానాలను రూపొందించింది. మనోహర్, ఎండీ, టీఎస్‌టీడీసీ సాహస క్రీడల విధివిధానాలపట్ల కేంద్ర పర్యాటక శాఖ కచ్చితంగా వ్యవహరిస్తోంది. ఇది మంచి పరిణామమే. ఇటీవలే ఢిల్లీలో దీనిపై సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఎవరికి వారుగా వాటిని నిర్వహించే పద్ధతి ఇక ఉండదు. దీనిపై నిర్వాహకులకు కూడా త్వరలో స్పష్టతనిస్తాం ఇలా ఉండాలి.. ఇక నుంచి సాహసక్రీడలు నిర్వహించే సంస్థలన్నీ తెలంగాణ పర్యాటకశాఖలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ ఎలాంటి క్రీడలు నిర్వహించబోతున్నారో ముందుగా స్థానిక పర్యాటక శాఖ కార్యాలయంలో సమాచారం ఇచ్చి అనుమతి పొందాలి ఆయా క్రీడలకు సంబంధించి కనీసం మూడేళ్ల నిర్వహణ అనుభవం ఉన్నట్టుగా పర్యాటక శాఖ నుంచి సర్టిఫికెట్ పొందినవారే వాటి నిర్వహణకు అర్హులు నిర్వాహకులు, కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు ఆయా క్రీడల్లో కనీస శిక్షణ తీసుకుని ఉండాలి. వారు కనీస విద్యార్హతలను కూడా కలిగి ఉండాలి పర్యాటక శాఖ నిర్దేశించిన పరికరాలనే వినియోగించాలి. వాటిల్లో పాల్గొనేవారు కచ్చితంగా హెల్మెట్లులాంటి రక్షణపరికరాలు వాడాలి. క్రీడలు నిర్వహించే ప్రాంతంలో ప్రమాద నియంత్రణ పరికరాలుండాలి. గాయపడ్డవారికి చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండాలి -
గాలిలో తేలి.. తేలి.. తేలిపొండి!
హైదరాబాద్: నగర యువతకు రాష్ట్ర టూరిజం అడ్వెంచర్ స్పోర్ట్స్ విభాగం పారా మోటర్ రైడింగ్‌ను ప్రారంభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బైసన్‌పోలో మైదానంలో ఆదివారం ప్రారంభమైన ఈ రైడింగ్ మరో 2 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ మహేందరెడ్డి, టూరి జం ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, తెలంగాణ, ఆంధ్ర సబ్‌ఏరియా కమాండింగ్ ఆఫీసర్, మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డీజీ పీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ రైడ్‌ను ప్రజలు ఎంజాయ్ చేయాలన్నారు. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెట రీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ కేవలం రూ.2,500 చెల్లిస్తే గాలిలో డ్రైవ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ రైడ్ ఉంటుందన్నారు. -
హిడింబకు ఓ ఆలయం...
తెలుసుకుందాం అత్యద్భుతమైన ప్రకృతి అందాలతో, సాహస క్రీడలు జరిగే ప్రదేశాలతో మనాలి గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేసవిలో 14 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు, శీతాకాలంలో 7 డిగ్రీల నుండి 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ హిడింబి ఆలయం ఉంది. మహాభారతంలోని పాండవులలోని భీమసేనుని భార్య హిడింబి. ఈమె రాక్షస సంతతికి చెందినది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు హిడింబాసురుని సోదరి అయిన హిడింబి భీముడిని పెళ్లాడింది. వీరి సంతానం ఘటోత్కచుడు. హిమాలయాల పాదాల దగ్గర ఉన్న ఈ ఆలయం చుట్టూ అటవీ ప్రాంతం కలిగి ఉండి ఎంతో రమణీయంగా ఉంటుంది. నాలుగు అంతస్థుల గోపురంతో, దారు చెక్కడాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆలయం. ఈ నాలుగు అంతస్థులలోను, మొదటి మూడు అంతస్థులు చతురస్రాకారంగా ఉండి, దారుఫలకాలతో నిర్మించబడ్డాయి. ఆలయం 24 మీటర్ల ఎత్తు ఉంటుంది కానీ, హిడింబా దేవి విగ్రహం మాత్రం 7.5 సెం.మీ. ఎత్తు మాత్రమే ఉండటం విశేషం. - బాచి -
వొలానోలో లైఫ్‌టైమ్ వెల్నెస్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అడ్వంచర్ స్పోర్ట్స్ నిర్వహణ సంస్థ వొలానో ఎంటర్టైన్మెంట్లో తాజాగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ అనుబంధ సంస్థ లైఫ్‌టైమ్ వెల్నెస్ ఆర్ఎక్స్ ఇన్వెస్ట్ చేసింది. అయితే, ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెల్లడి కాలేదు. నటుడు రామ్‌చరణ్ తేజ్.. వొలానోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా నాలుగు ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి 1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించినట్లు బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు అద్నాన్ అదీబ్ తెలిపారు. మరో 6 నెలల్లో ఇంకో 6 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు వివరించారు. మూడేళ్లలో రూ. 100 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే 34 అడ్వంచర్ రేస్‌లు నిర్వహించనున్నట్లు అదీబ్ తెలిపారు. ప్రస్తుతం డెవిల్స్ సర్క్యూట్ పేరుతో నిర్వహిస్తున్న రన్నింగ్ సిరీస్‌కు మంచి స్పందన వస్తోందని అదీబ్ పేర్కొన్నారు. టీవీ షో ఆధారిత కార్పొరేట్ అబ్స్టకిల్ చాలెంజ్ రూపొందిస్తున్నామని, ఎన్డీటీవీలో ఇది ప్రసారమవుతుందన్నారు. స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌ని ఇష్టపడే వారికి ఇదొక కొత్త వేదికగా నిలవగలదని ఈ సందర్భంగా రామ్‌చరణ్ తెలిపారు. -
ధోని చేతికి హాకీ స్టిక్
రాంచీ జట్టును కొనుగోలు చేసిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రాంచీ: భారత కెప్టెన్‌గా క్రికెట్లో అత్యున్నత స్థాయి విజయాలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోని వరుసగా ఇతర క్రీడల్లో కూడా కీలక పాత్ర పోషించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. మహీమోటార్ రేసింగ్ టీమ్‌తో పాటు ఇటీవలే ఐఎస్ఎల్లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ జట్టును కొనుగోలు చేసిన ధోని... ఇప్పుడు హాకీలో కూడా అడుగు పెట్టాడు. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) జట్టు ‘రాంచీ రేస్’ను ధోని సొంతం చేసుకున్నాడు. సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ లిమిటెడ్ ఇందులో సహ భాగస్వామిగా ఉంటుంది. 2013లో జరిగిన తొలి హెచ్ఐఎల్లో టైటిల్ గెలుచుకున్న రాంచీ రైనోస్ టీమ్ ఈ ఏడాది మూడో స్థానంలో నిలిచింది. అయితే ఆ జట్టు యజమానుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా హాకీ ఇండియా ఈ జట్టును రద్దు చేసింది. దాంతో ధోని, సహారా ఈ టీమ్‌ను కొని జట్టు పేరును ‘రాంచీ రేస్’గా మార్చారు. ఈ కార్యక్రమంలో టీమ్ లోగో, జెర్సీని ఆవిష్కరించారు. నగరంతో అనుబంధం వల్లే: భవిష్యత్తులో హాకీ క్రీడకు మరింత ప్రచారం కల్పించేందుకు తాను అన్ని విధాలా సహకరిస్తానని ధోని అన్నాడు. ‘హాకీతో అనుబంధం ఏర్పరచుకున్న ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. నేను ఇక్కడే పుట్టి పెరిగినవాడిని. గత రెండేళ్లుగా రాంచీ టీమ్ చాలా బాగా ఆడుతోంది. కాబట్టి ఈ అవకాశం వచ్చినపుడు మరో ఆలోచన లేకుండా ఇందులో అడుగు పెట్టాను. ఈ ప్రాంతంలో ప్రతిభను ప్రోత్సహించి హాకీని అభివృద్ధి చేయాలనేదే నా ప్రధాన ఉద్దేశం. అందుకోసం రేస్ జట్టు తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని ఈ సందర్భంగా ధోని వ్యాఖ్యానించాడు. -
సాహసం సమ్మోహనం!
ఫొటోలు తీయడం మజా రేకెత్తించే పని. ‘థ్రిల్’ అనిపించే ఫొటోలను తీయడం ‘దిల్’కు ఖుషీ అనిపించే పని. డైవింగ్, సర్ఫింగ్, స్టంట్స్,స్నో బోర్డింగ్... ఇలా ‘థ్రిల్’ అనిపించే ఫొటోలకు ‘రెడ్ బుల్ ఇల్యుమ్’ చిరునామాగా మారింది. యాక్షన్, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లోని ఆకట్టుకునే ‘అంశ’ను ప్రపంచానికి చాటడానికి ‘రెడ్ బుల్ ఇల్యుమ్’ అడ్వెంచర్ స్పోర్ట్స్, యాక్షన్ విభాగాలలో ఛాయచిత్రాల పోటీలు నిర్వహిస్తోంది. రెడ్ బుల్ ఇల్యుమ్ ఫొటో కాంటెస్ట్-2013కి మొత్తం 28,000 ఇమేజెస్ వచ్చాయి. రెప్పపాటులో తీసిన ఈ ఛాయాచిత్రాల్లో ఫొటోగ్రాఫర్ల సృజన, పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. పోటీకి వచ్చిన ఫొటోల్లో బహుమతి గెలుచుకున్నవి, గెలుచుకోనివి అనే విభజనను పక్కన పెడితే ప్రతి ఫొటో కూడా ‘శభాష్’ అనిపించేలా ఉంది. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల హాంకాంగ్‌లో ఘనంగా జరిగింది. ‘‘మనకు టాలెండెడ్ ఫొటోగ్రాఫర్లతో పాటు గిఫ్టెడ్ ఫొటోగ్రాఫర్లు కూడ ఉన్నారు’’ అన్నారు సీనియర్ ఫొటోజర్నలిస్ట్ జిమ్ విల్సన్. యాభై మంది న్యాయనిర్ణేతలలో విల్సన్ కూడా ఒకరు. ‘‘ఇవి కేవలం యాక్షన్ ఫొటోలు మాత్రమే అనుకోనక్కర్లేదు. సాంకేతిక, కళాత్మక విలువలు కూడా అందులో ఉన్నాయి’’ అంటాడు ఆయన. ‘‘మంచు వర్షంలో ఫొటో తీయడం తేలికైన విషయమేమీ కాదు’’ అంటున్న ఫొటోగ్రాఫర్ క్రిస్ బకార్డ్ తన పనిలోని సాధకబాధకాలను గురించి ఆసక్తిగా వివరించగలరు. క్రిస్‌కు మాత్రమే కాదు... సాహసం ఉట్టిపడే ఫొటోలను తీసిన ప్రతి ఫొటోగ్రాఫర్‌కి విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి!