Madan Mohan reddy
-
ఏసీబీ వలలో చిక్కిన అవినీతి అధికారులు అరెస్ట్
-
సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.. కారులో ఎమ్మెల్యే బంధువులు
మాచర్ల: గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల వద్ద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడు ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి అదుపుతప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు సురక్షితంగా బయటపడగా.. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ సుందరరామిరెడ్డి కుమారుడు మదనమోహన్‌రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి గుంటూరు వెళ్లారు. తిరిగి మాచర్ల వస్తుండగా కారు అదుపు తప్పి కుడికాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి మదన్‌మోహన్‌రెడ్డిని కాపాడారు. కారులో ఉన్న ఆయన భార్య, కుమార్తె ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గజఈతగాళ్లతో గాలింపు చేయిస్తున్నారు. సంఘటనపై విచారణ చేపట్టారు. -
కరోనాతో కంగారు వద్దు.. మొదటి దశ సురక్షితం
సాక్షి, చెన్నై : కరోనా వైరస్ సోకిందని కంగారుపడాల్సిన అవసరం లేదు, కనీస అప్రమత్తతను పాటిస్తే కరోనాను సులువుగా జయించవచ్చని అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, బర్డ్ ఆస్పత్రి (తిరుపతి) డైరెక్టర్ డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాజిటివ్ బారినపడగానే ప్రాణం పోదనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. కరోనాకు భయపడకూడదు, మనమే కరోనాను భయపెట్టి తరిమికొట్టాలని చెప్పారు. కరోనా వైరస్‌పై లేనిపోని అపోహలు, పాజిటివ్ వస్తే ప్రాణం పోవడం ఖాయమనే అనసర భయాందోళనలు, దీంతో కొందరు బలవన్మరణాలకు పాల్పడడం వంటి దయనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో చెన్నై అన్నానగర్‌లోని సన్వే క్లినిక్‌లో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ఒక కరోనా వైరస్సే కాదు ఏ వ్యాధినైనా నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకు వస్తుంది. వ్యాధిని ప్రాథమిక దశ లోనే గుర్తించడం, తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి. అయితే కరోనా విషయంలో మరికొంత అదనపు అప్రమత్తత అవసరం. కరోనా గురించి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. పాజిటివ్ బారినపడిన వారిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చనే భరోసా వైద్యరంగానికి కలిగింది. కోవిడ్–19 భారత్‌లోకి ప్రవేశించిన కొత్తల్లో కోవిడ్–19 కేవలం శ్వాసను మాత్రమే దెబ్బతీస్తుందని వైద్యరంగం భావించింది. రోగులకు చికిత్స చేసేకొద్దీ కాలక్రమేణా ఎంతో క్లారిటీ వచ్చింది. కరోనా ముదిరితే రక్తనరాలు దెబ్బతినడం, రక్తం కలుషితం కావడం, క్రమేణా ఆక్సిజన్ క్యారీ సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా ప్రాణాపాయ స్థితికి తీసుకెళుతుందని తేలింది. ఆ రెండు దశల్లోనే అదుపు సాధ్యం: కరోనా వైరస్ వ్యాప్తిని రెండు దశలుగా విభిజించాల్సి ఉంటుంది. తొలి దశను వైద్యపరిభాషలో వైరిమియా అంటారు. ఈ దశలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు రుగ్మతలతోపాటూ రుచి, వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాలు. మానవ శరీరంలో సహజంగా ఇమిడిఉండే రోగ నిరోధక వ్యవస్థ మూడు నుంచి ఐదు రోజుల్లో రోగిని కోలుకునేలా చేస్తుంది. లేదా పారాసిటమాల్ వంటి మాత్రలను తీసుకోవడం ద్వారా ఇంటిలోనే నయం చేసుకోవచ్చు. ఐదురోజులు దాటినా నయం కాకుంటే కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. తొలి దశలోనే చికిత్స తీసుకుంటే రోగి ఇతరత్రా ఆరోగ్యసమస్యలను బట్టి పూర్తిగా కోలుకునే అవకాశాలు 90 శాతం వరకు ఉంటాయి. రెండోదశలోనూ మెరుగైన అవకాశాలు: ఇక రెండో దశలోనే అసలైన కరోనా వైరస్ వ్యాధిని రోగి అధికంగా ఎదుర్కొంటాడు. జ్వరం తగ్గకపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, సహజంగా ఉండాల్సిన 95 నుంచి వందశాతం ఆక్సిజన్ క్యారీ సామర్థ్యం 85 శాతానికి పడిపోవడం దీని ప్రధాన లక్షణాలు. అయినా రోగి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. యాంటీ వైరల్ ట్రీట్మెంట్తో రక్షించవచ్చు. రోగిని బోర్లాపడుకోబెట్టి ముక్కు ద్వారా ఆక్సిజన్, డెక్సామెథాసొనె ఇంజక్షన్ ఇచ్చి రక్తనాళాలు చిట్లిపోకుండా అరికట్టవచ్చు. ఈ వైద్యవిధానంతో రికవరీ రేట్ పెరిగినట్లు గుర్తించాంపాజిటివ్ నుంచి కోలుకున్న వారు నుంచి సేకరించిన ప్లాస్మా కణాలను రోగికి ఎక్కించడం ద్వారా నయం చేసే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలోకి రాకుండా జాగ్రత్తలు పాటించాలి లేదా రెండో దశలోకి ప్రవేశించగానే చికిత్స తీసుకున్నపుడే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. వీరంతా జాగ్రత్త పొగతాగేవారు, కేన్సర్, షుగర్, అవయవాల మార్పిడి చేయించుకున్నవారు, స్థూలకాయం కలిగిన వారు అదనపు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. బాహ్యప్రపంచంలో తిరగడం పురుషుల్లోనే ఎక్కువ కావడం వల్ల మరణాలు కూడా వారిలోనే ఎక్కువగా ఉన్నాయి. వైద్య చికిత్స ఎంత ముఖ్యమో రోగి భయానికి లోనుకాకుండా ఉండడం అంతే ముఖ్యం. కేవలం భయంతో ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య పదిశాతం వరకు ఉంది. -
ఏపీఏటీ మాజీ సభ్యుడు మదన్‌మోహన్‌రెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) విశ్రాంత సభ్యుడు, న్యాయశాఖ మాజీ కార్యదర్శి టి.మదన్‌మోహన్‌రెడ్డి(68) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం ఉదయం 9గంటలకు విస్పర్ వ్యాలీలోని మహాప్రస్థానంలో అంత్యక్రియ లు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు హైకోర్టు న్యాయవాది టి.ప్రద్యుమ్న కుమార్‌రెడ్డి తెలిపారు. మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదు లు సందర్శించి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు రిజిస్ట్రార్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. -
సాహసవీరుడా.. ఇక సెలవ్!
వైవీయూ: కడప సాహసవీరుడు.. శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు.. మళ్లీ జన్మంటు ఉంటే సాహసవీరుడుగానే పుడతానంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లేవాకు మదన్‌మోహన్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి దివ్యధామరామం వాహనంలో పబ్బాపురం సమీపంలోని యాదవాపురానికి తీసుకెళ్లి అక్కడ ఆయన అన్న కుమారుడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భౌతికకాయం వద్ద చిన్నారులు సెల్యూట్ చేసి జాతీయగీతాలపన చేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు ప్రమీల, నరసింహారెడ్డి, ఆయన సతీమణి లతల రోదనలు అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించాయి. నివాళులర్పించిన మేయర్, ఎమ్మెల్యే... నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయానికి కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా నివాళులర్పించారు. సాహసకృత్యాలతో జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన మదన్‌మోహన్‌రెడ్డి మరణం అందరినీ కలిచివేసిందని వారు పేర్కొన్నారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. మదన్‌మోహన్‌రెడ్డి పేరుతో సాహస అవార్డు... పారామోటార్ గ్లైడర్ లేవాకు మదన్‌మోహన్‌రెడ్డి పేరుతో సాహస అవార్డును పెట్టేందుకు నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ (ఎన్‌ఏఎఫ్) నిర్ణయించిందని ఎన్‌ఏఎఫ్ జాయింట్ సెక్రటరీ, పారామోటార్ పైలెట్ సి.వి. సూర్యతేజ తెలిపారు. పూర్తి విధివిదానాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఈయన స్మారకార్థం జనవరిలో విజయవాడ, విశాఖ, కడప నగరాల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయానికి ఎయిర్‌ఫోర్స్ అధికారులు దామోదర్పటేల్, సుకుమార్, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ ఎం.ఐ.కె. రెడ్డి, వింగ్ కమాండర్ జయశంకర్, ఎన్‌ఏఎఫ్ డైరెక్టర్ వై. శ్రీనివాసరావు తదితరులు మదన్‌మోహన్‌రెడ్డికి నివాళులర్పించారు. -
అధికారం వైఎస్సార్సీపీదే
రాజంపేట, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని మాజీ శాసనసభ సభ్యుడు కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని టీఎస్ఆర్ కల్యాణ మండపంలో మదన్ వర్గీయులు, వైఎస్సార్ అభిమానులు, పార్టీకార్యకర్తలతో పెద్ద ఎత్తున నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తన మిత్రుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఆయనకు అండగా నిలుస్తానన్నారు. మాట ఇస్తే తప్పని తన మిత్రుడు వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయంగా దూరంగా ఉన్నా స్నేహితుడిగా ఆయనకు ఎప్పుడూ దగ్గరుండేవాడినన్నారు. ఏ విషయంలోనూ చంద్రబాబు మాటలు నమ్మదగినవి కావని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో జగన్ అధికారాన్ని చేపట్టబోతున్నారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సాధ్యం కాని హామీలను చంద్రబాబు గుప్పిస్తున్నారని, వాటిని జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోకు ప్రజల ఆదరణ లభించిందన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు, కిరణ్ ఇద్దరూ బాధ్యులేనన్నారు. రాష్ట్రంలో 135సీట్లు వైఎస్సార్సీపీకి వస్తున్నాయన్నారు. కేంద్రంలో ప్రధాని అభ్యర్థిని ఎన్నుకునే నిర్ణయాత్మక శక్తిగా జగన్ ఎదగబోతున్నారన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మదన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీలోకి రావడం శుభపరిణామమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్సార్ పాలన తిరిగి వస్తుందన్నారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి మదన్‌మోహన్‌రెడ్డి మద్దతు ఇవ్వడంతో తనలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు. ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మదన్‌మోహన్‌రెడ్డి పదవిలో లేకపోయినా బలమైన వర్గాన్ని కలిగి ఉన్నారన్నారు. మదన్ తనయుడు కసిరెడ్డి రామ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా పని చేస్తామన్నారు. అంతకు ముందు మదన్‌మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
రాజంపేటలో టీడీపీకి షాక్
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. రాజంపేట నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి సేవ చేసిన వారికి గాక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని మదన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా రాజంపేట లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఇక్కడి నుంచి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు.