
ఏపీఏటీ మాజీ సభ్యుడు మదన్‌మోహన్‌రెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) విశ్రాంత సభ్యుడు, న్యాయశాఖ మాజీ కార్యదర్శి టి.మదన్‌మోహన్‌రెడ్డి(68) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం ఉదయం 9గంటలకు విస్పర్ వ్యాలీలోని మహాప్రస్థానంలో అంత్యక్రియ లు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు హైకోర్టు న్యాయవాది టి.ప్రద్యుమ్న కుమార్‌రెడ్డి తెలిపారు.
మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదు లు సందర్శించి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు రిజిస్ట్రార్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.