రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేనని మాజీ శాసనసభ సభ్యుడు కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
రాజంపేట, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేనని మాజీ శాసనసభ సభ్యుడు కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని టీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో మదన్ వర్గీయులు, వైఎస్సార్ అభిమానులు, పార్టీకార్యకర్తలతో పెద్ద ఎత్తున నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తన మిత్రుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఆయనకు అండగా నిలుస్తానన్నారు. మాట ఇస్తే తప్పని తన మిత్రుడు వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోవడం దురదృష్టకరమన్నారు.
రాజకీయంగా దూరంగా ఉన్నా స్నేహితుడిగా ఆయనకు ఎప్పుడూ దగ్గరుండేవాడినన్నారు. ఏ విషయంలోనూ చంద్రబాబు మాటలు నమ్మదగినవి కావని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో జగన్ అధికారాన్ని చేపట్టబోతున్నారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సాధ్యం కాని హామీలను చంద్రబాబు గుప్పిస్తున్నారని, వాటిని జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోకు ప్రజల ఆదరణ లభించిందన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు, కిరణ్ ఇద్దరూ బాధ్యులేనన్నారు. రాష్ట్రంలో 135సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తున్నాయన్నారు. కేంద్రంలో ప్రధాని అభ్యర్థిని ఎన్నుకునే నిర్ణయాత్మక శక్తిగా జగన్ ఎదగబోతున్నారన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మదన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి రావడం శుభపరిణామమన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్సార్ పాలన తిరిగి వస్తుందన్నారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి మదన్‌మోహన్‌రెడ్డి మద్దతు ఇవ్వడంతో తనలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు. ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మదన్‌మోహన్‌రెడ్డి పదవిలో లేకపోయినా బలమైన వర్గాన్ని కలిగి ఉన్నారన్నారు. మదన్ తనయుడు కసిరెడ్డి రామ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ గెలుపే ధ్యేయంగా పని చేస్తామన్నారు. అంతకు ముందు మదన్‌మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.