హైదరాబాద్ : బలవంతపు భూ సేకరణ చేపడతామని మంత్రులు చెప్పడం... రైతులను బ్లాక్మెయిల్ చేయడమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.... భూములు ఇవ్వని రైతుల పంటలను తగలబెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బలవంతపు భూ సేకరణకు తమపార్టీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా రైతులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు.
రైతులను బ్లాక్మెయిల్ చేయడమే
Published Fri, Oct 30 2015 1:12 PM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM
Advertisement
Advertisement