
తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు పల్నాడులో ఏదో చేయాలని నిప్పు రాజేస్తున్నరని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పల్నాడు వచ్చి లోకేస్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, లోకేష్ పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటే ఒక జోకర్‌లా కనిపించాడన్నాడని పిన్నెల్లి విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పిన్నెల్లి.. పల్నాడులో తండ్రీ కొడుకులు ఏదో చెయ్యాలని నిప్పు రాజేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘లోకేష్‌కు శుభకార్యానికి, పరామర్శకి తేడా తెలియదు.పల్నాడు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నిన్న లోకేష్ ముఖంలో నిరాశ, నిస్పృహ కన్పిస్తున్నాయి. జల్లయ్య గురించి నీకు తెలుసా...ఆయనపై మీ ప్రభుత్వంలోనే 10 కేసులు ఉన్నాయి.నిన్నటి దాకా నువ్వు ఇక్కడ లేవు...అసలు బ్రహ్మారెడ్డి గురించి నీకు తెలుసా?, నువ్వెక్కడో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నావు.బ్రహ్మా రెడ్డి తల్లి ఎమ్మెల్యేగా ఉన్నపుడు వాళ్ళ సొంత గ్రామంలో 13 హత్యలు జరిగాయి. 7 మందిని చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మా రెడ్డి. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు పల్నాడు వచ్చి ఫ్యాక్షన్ రెచ్చగొట్టాలి అనుకుంటున్నావా?, ఇలాంటివి చేస్తే ఆ 23 సీట్లు కూడా రావు’ అని పిన్నెల్లి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment