పల్నాడు, సాక్షి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమేర శివ అడ్డుగా నిలబడ్డారు.
.. పిన్నెల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి.. మెజిస్ట్రేట్ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శివపైన అనేక కేసులు పెండింగ్‌లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు.
ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10గం. టైంలో మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఇక.. పిన్నెల్లిని కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన టైంలో ఆయన ప్రత్యర్థి వర్గం బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే యత్నం చేసింది.
ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట, మార్గంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment