'వైఎస్ ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు' | AndhraPradesh wouldn't be in dire state if YSR was alive: Pinnelli Ramakrishna Reddy | Sakshi

'వైఎస్ ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు'

Sep 2 2013 9:26 AM | Updated on Jul 7 2018 3:19 PM

గుంటూరు : వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టేది కాదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

గుంటూరు : వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టేది కాదని ఎమ్మెల్యే  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఓట్లు-సీట్లు కోసం కాంగ్రెస్ రాజకీయ డ్రామా ఆడుతోందని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ నాలుగోవ వర్థంతి సందర్భంగా ఆ వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించింది. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, పేదలకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు.

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వైఎస్ఆర్ వర్థంతి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ నేత మద్దాల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు చేపట్టారు. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఇక చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement