Live Updates..l
⇒పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు: వైఎస్ జగన్
⇒టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు.
⇒వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు
⇒శిశుపాలుని పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు పండుతాయి
⇒లెక్క జమ చేసి ప్రజలు చంద్రబాబుకు గట్టిగా జవాబిచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి.
⇒బడులు ప్రారంభమైన అమ్మ ఒడి ఇవ్వడం లేదు
⇒రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు
⇒ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు
⇒కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు లేవు
⇒మే 14న ఘటన జరిగితే, మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
⇒నిజం దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు?
⇒అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్
⇒నెల్లూరు సెంట్రల్ జైల్‌లో పిన్నెల్లిని కలిసిన వైఎస్ జగన్
⇒నెల్లూరు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
⇒సెంట్రల్ జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్న వైఎస్ జగన్
⇒భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు
⇒కాసేపట్లో వైఎస్ జగన్ నెల్లూరు చేరుకోనున్నారు.
⇒వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాకతో నెల్లూరులో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నెల్లూరు జైలు వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకున్నారు.
⇒నెల్లూరు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
⇒కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్న జగన్
⇒వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అక్రమ కేసులు, దాడులకు బలైన వారికి రక్షణ కల్పించేందుకు, బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు.
⇒నేడు నెల్లూరు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. పిన్నెళ్లిపై తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక, రానున్న రోజుల్లో వైఎస్ జగన్.. పార్టీ కేడర్ కోసం న్యాయ పోరాటం చేస్తూనే బాధితులను కలుస్తూ వారికి భరోసా ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment