
(ఫైల్ ఫోటో)
సాక్షి, గుంటూరు: చలమల – శ్రీరాంపురం తండా మధ్య జరిగిన లారీ ప్రమాదంలో గాయపడి మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి.. వారిని ఓదార్చారు. తన సొంత నిధుల నుంచి రూ.50 వేలు, వైఎస్సార్ బీమా పథకం నుంచి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి తన నిధుల నుంచి పదివేలు ప్రకటించారు. ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. (మృత్యు ఘోష)
Comments
Please login to add a commentAdd a comment