ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. దమ్ముంటే ముసుగు తీసి బయటకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు ఎక్కడికి రమ్మంటే అక్కడి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పక్కాప్లాన్ ప్రకారమే తనపై హత్యాయత్నం చేయించారని నిప్పులు చెరిగారు. ఆయన ఆస్తులను కాపాడుకునేందుకే అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై హత్యాయత్నం చేసింది.. రైతులు కాదని.. టీడీపీ గూండాలేనని పేర్కొన్నారు.