సాక్షి, గుంటూరు: అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. అవినీతికి తావులేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది ఓర్చుకోలేక టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి. వార్డు మెంబర్‌గా కూడా లోకేష్ గెలవలేరు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు' అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పల్నాడు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే కాలంలో పల్నాడు వెనుకబడిన ప్రాంతంగా ఉండదు. అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తోంది. పల్నాడుకు టీడీపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే టీడీపీకి తెలుసు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment