'బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి' | ysr congress party mla pinnelli ramakrishna reddy slams tdp, yellow media | Sakshi
Sakshi News home page

'బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి'

Published Fri, May 30 2014 12:46 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

'బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి' - Sakshi

'బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి'

మాచర్ల : చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉంటే రోజూ పేజీలు పేజీలు రాసుకోండి అంతేకాని లేనిపోని అవాస్తవాలను రాసి ఎల్లో జర్నలిజం ద్వారా ప్రజలను మభ్యపెట్టవద్దని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎల్లో మీడియాకు సంబంధించిన ఓ పత్రికలో తాను టీడీపీలో చేరుతున్నట్లు ఊహాగానాలతో వార్త ప్రచురించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరితో ఎప్పుడూ చర్చలు జరపలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో బలమైన ప్రతిపక్షాన్ని... బలహీనపరిచేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండే తనలాంటి వారిపై తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైండ్ గేమ్ ప్రారంభించిందని  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అందుబలో భాగంగా నీచ రాజకీయాలకు పాల్పడుతూ బేరసారాలను కొనసాగిస్తోందన్నారు. ఎవరూ టీడీపీ బేరసారాల గురించి పట్టించుకోకపోవడంతో ఏదో ఒకవిధంగా బురద జల్లి ఎమ్మెల్యేలు అధికంగా టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో భాగంగా వైఎస్ కుటుంబం అండదండలతో మూడుసార్లు గెలుపొందిన తాను పార్టీ మారుతున్నానని విస్తృతంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్లే అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. నిరాధార కథనాలను రాస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement