పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పాత చిత్రం)
సాక్షి, గుంటూరు: తన నియోజకవర్గంలోని సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ లేఖ రాశారు. మాచర్లలోని సమస్యలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు మోక్షం కలుగుతుందని ప్రశ్నించారు. విజయపురి సౌత్‌లో మెగా టూరిజం ప్రాజెక్టును ఎప్పుడు తీసుకువస్తారని నిలదీశారు. ఎస్‌కేబీఆర్ కాలేజ్‌లో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే.. మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూని ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గ సమస్యలను చెప్పాటానికి కలుస్తానంటే సీఎం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి సీఎంను గతంలో ఎప్పుడు చూడలేదని.. అందుకే బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment