cricet betting
-
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
గరివిడి(చీపురుపల్లి) : ఓ పాన్ షాప్‌లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కిందనున్న సురేష్ పాన్‌షాప్‌లో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందన్న రహస్య సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్న పాన్‌షాప్ యజమాని సురేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.53,030 నగదును, ఒక ఆండ్రాయిడ్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బెజవాడలో 10మంది బుకీల అరెస్ట్
విజయవాడ : ఓ వైపు వరల్డ్ కప్ మ్యాచ్‌లు కొనసాగుతుంటూ మరోవైపు బెట్టింగ్ బాబుల జోరు ఊపందుకుంది. విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 10మంది బుకీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.42 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లు గుట్టుగా నడుస్తున్నాయి. భారత్, సౌతాఫ్రికా మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెట్టింగ్ జోరందుకుంది. తమ అభిమాన క్రికెటర్ బౌలర్, బ్యాట్ మెన్లపై వ్యక్తిగత పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు టీం జయాపజయాలపై పందాలు కాస్తున్నారు.