మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
మిర్యాలగూడ(నల్లగొండ): మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. మతిస్థిమితం లేని మైనర్ బాలికపై కొంత మంది యువకులు రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. కాగా, ఈ నెల 9న ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురువారం ఉదయం పరారీలో ఉన్న మురళీ, హరికుమార్, కొత్తపల్లి ప్రవీణ్, మనోజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కూడా ఇద్దరు మైనర్ బాలురున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కుక్కల ఉపేందర్ కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయి. నిందితులను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు.