రేప్ కేసు.. ఎమ్మెల్యేపై ఛార్జ్ షీట్ | Charge sheet filed against RJD MLA Raj Ballabh in rape case | Sakshi
Sakshi News home page

రేప్ కేసు.. ఎమ్మెల్యేపై ఛార్జ్ షీట్

Published Fri, Apr 22 2016 6:02 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

రేప్ కేసు.. ఎమ్మెల్యేపై ఛార్జ్ షీట్ - Sakshi

రేప్ కేసు.. ఎమ్మెల్యేపై ఛార్జ్ షీట్

పాట్నా: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ పై నలంద పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలుచేశారు. రెండు నెలల కిందట ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నవాడా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన 53 ఏళ్ల రాజ్‌ బల్లబ్ పరారయ్యాడు. అనంతరం గత నెలలో స్థానిక కోర్టులో లొంగిపోయాడు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో ఎమ్మెల్యే ఒకరని మహిళా పోలీస్ స్టేషన్లో 205 పేజీల ఛార్జ్ షీటు తయారుచేశారు. మరోవైపు నితీశ్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ యాదవ్ పార్టీకి చెందిన బల్లభ్ యాదవ్ తాను అమాయకుడినని, కక్షపూరితంగా తనను కొందరు ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.

ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ కు అమ్మాయిలను పంపించే ఇద్దరు మహిళల పేర్లను కూడా ఈ ఛార్జ్ షీటులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సహా మరో వ్యక్తిని జిల్లాకోర్టులో ప్రవేశపెట్టినట్లు ఓ అధికారి వివరించారు. అత్యాచారానికి గురైన పదో తరగతి విద్యార్థిని ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా ఉంచిన ఓ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్స్ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ ఫిబ్రవరిలో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement