rjd mla
-
బిహార్‌లో ఆగని ఫిరాయింపుల పర్వం
పట్నా: బిహార్‌లోని మహాఘఠ్బంధన్ కూటమిలో ఫిరాయింపుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీకి చెందిన మరో ఎమ్మెల్యే భరత్ బిండ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఎన్డీఏ పక్షంలోకి మారారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే నీతూ కుమారి పార్టీ లోక్‌సభ టిక్కెట్ ఇస్తే సరేసరి లేకుంటే బీజేపీలో చేరడం ఖాయమని ప్రకటించారు. ఇప్పటికే ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అదే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటేయడం, నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం తెలిసిందే. తాజా పరిణామాలతో 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్డీఏ బలం 135కు చేరుకుంది. -
అమిత్ షా బర్త్‌డే రోజు ట్రెండ్ అయిన అంకుశం రామిరెడ్డి.. వైరల్ ట్వీట్
RJD MLA Surendra Prasad Yadav Wishes On Amit Shah Birthday: అంకుశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటనతో తనకట్టు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామిరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. 2011లోనే ఆయన మరణించగా ఇప్పుడు హాట్ టాపిక్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది చదవాల్సిందే. వివరాల్లోకెళ్తే.. అక్టోబర్ 22న కేంద్రహోం మంత్రి అమిత్ షా 57వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలిపారు. ఆ క్రమంలోనే బీహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా 'మన హోం మంత్రి అమిత్‌షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ఓ ట్వీట్ చేశారు. అయితే అందులో అమిత్ షా ఫొటోకు బదులు రామిరెడ్డి ఫొటో వాడారు. దీంతో ప్రస్తుతం ఆర్జేడీ ఎమ్మెల్యే ట్వీట్ వైరల్‌గా మారింది. ఫొటోను గుర్తించిన నెటిజన్లు దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. Happy Birthday to our Home Minister @AmitShah Ji. 🙏🏻😌 pic.twitter.com/fPDoBo62x7 — Surendra Prasad Yadav (@iSurendraYadav) October 22, 2021 అయితే ఇది పొరపాటున జరిగినట్లు అందరూ భావిస్తున్న తరుణంలో ఆర్జేడీ ఎమ్మెల్యే మరో ట్వీట్ చేశారు. 'క్షమించండి.. ఉపఎన్నికల ప్రచారంలో ఉండి ఈ విషయాన్ని సరిగా చూసుకోలేదు.. మన అద్భుతమైన మోటా బాయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తమిళ విలన్ సంతాన భారతి ఫొటో పెట్టి మరోసారి అమిత్ షాకి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇదంతా సురేంద్ర ప్రసాద్ యాదవ్ కావాలనే చేసినట్లు నెటిజన్లకు అర్థమైపోయింది. I beg your pardon! Made a blunder in the midst of the hectic campaign of By-election. Happy Birthday to our amazing Mota Bhai! 🎂💐 :) https://t.co/dtevrJIqEL pic.twitter.com/wWz0WGmgPE — Surendra Prasad Yadav (@iSurendraYadav) October 22, 2021 -
కోర్టు హాల్లో కుప్పకూలిన ఎమ్మెల్యే
పాట్నా: నేరారోపణలపై నమోదైన కేసులపై కోర్టు హాల్లో విచారణ సాగుతుండగా ఓ ఎమ్మెల్యే కుప్పకూలిపోయాడు. విచారణ సమయంలో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కోర్టు హాల్లో గందరగోళం ఏర్పడింది. వెంటనే అతడిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ఘటన బిహార్‌లోని పాట్నాలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ మొదట డాన్. డాన్‌గా పేరుపొందిన ఆయన అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. 2005, 2010 జేడీయూ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఓ హత్య కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి సంచలనం సృష్టించాడు. దీంతో మోకామా నుంచి ఆయన 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యాడు. అయితే ఏకే-47, గ్రెనేడ్ల కేసు విషయమై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్పృహ తప్పిపడిపోయాడు. -
రేప్ కేసు.. ఎమ్మెల్యేపై ఛార్జ్ షీట్
పాట్నా: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ పై నలంద పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలుచేశారు. రెండు నెలల కిందట ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నవాడా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన 53 ఏళ్ల రాజ్ బల్లబ్ పరారయ్యాడు. అనంతరం గత నెలలో స్థానిక కోర్టులో లొంగిపోయాడు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో ఎమ్మెల్యే ఒకరని మహిళా పోలీస్ స్టేషన్లో 205 పేజీల ఛార్జ్ షీటు తయారుచేశారు. మరోవైపు నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ యాదవ్ పార్టీకి చెందిన బల్లభ్ యాదవ్ తాను అమాయకుడినని, కక్షపూరితంగా తనను కొందరు ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ కు అమ్మాయిలను పంపించే ఇద్దరు మహిళల పేర్లను కూడా ఈ ఛార్జ్ షీటులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సహా మరో వ్యక్తిని జిల్లాకోర్టులో ప్రవేశపెట్టినట్లు ఓ అధికారి వివరించారు. అత్యాచారానికి గురైన పదో తరగతి విద్యార్థిని ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా ఉంచిన ఓ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్స్ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ ఫిబ్రవరిలో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. -
రేప్ కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే
పట్నా: మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. బాలికపై అత్యాచారం కేసులో తనకు వ్యతిరేకంగా అరెస్టు ఉత్తర్వు జారీకావడంతో దాదాపు నెల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. బిహార్‌లోని నవాడా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన 53 ఏళ్ల రాజ్ బల్లబ్ ఫిబ్రవరి 6న పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ యాదవ్ పార్టీకి చెందిన బల్లభ్ యాదవ్ తాను అమాయకుడినని, కక్షపూరితంగా తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉండటంతోనే తాను కోర్టు ఎదుట లొంగిపోయానని ఆయన గురువారం తెలిపారు. సీఎం నితీశ్ కుమార్ సొంత నియోజకవర్గమైన నలందాలో ఈ రేప్ ఘటన జరగడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాగా, తనపై ఎమ్మెల్యే అమానుషంగా అత్యాచారం జరిపినప్పటికీ పదో తరగతి పరీక్షలు రాయాలని బాధిత బాలిక నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా ఉంచబడిన ఓ పరీక్ష కేంద్రంలో ఆ బాలిక పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాటుచేశారు. -
అత్యాచారానికి గురైనా టెన్త్ పరీక్షలకు సిద్ధం
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యే రాజ్ వల్లభ్ యాదవ్ కబంధ హస్తాల్లో అత్యాచారానికి గురైన నలందకు చెందిన 15 ఏళ్ల బాలిక గురువారం నుంచి బిహార్‌లో జరగనున్న పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. జరిగిన ఘోర కృత్యానికి కృంగిపోకుండా, చంపేస్తామంటూ ఎమ్మెల్యే అనుయాయుల నుంచి బెదిరింపులు వస్తున్నప్పటికీ మానసిక స్థైర్యాన్ని కూడదీసుకొని మరీ పరీక్షలకు చదువుతోంది. ఎవరో చేసిన పాపానికి తన జీవితాన్ని బలి తీసుకోకూడదనే ఉద్దేశంతో పదవ తరగతి ఫైనల్ పరీక్షలకు హాజరాకావాలని నిశ్చయించుకుంది. వెన్నంటి వచ్చే పోలీసు జవాన్ల భద్రత మధ్య ఎక్కడో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లడం, అందరి దృష్టిలో పడడం ఎంత అవమానకరమో ఆమె అర్థం చేసుకునే ఈ నిర్ణయానికి వచ్చింది. బెదిరింపుల కారణంగా ఆమెకు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. తొలుత ఆమెకు తానుంటున్న ఊరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రం పడింది. పోలీసుల సహాయంతో ప్రతిరోజు అంతదూరం వెళ్లి పరీక్షలు రాయడం కష్టమే కాకుండా, కాకుల్లా పొడిచే సమాజం నుంచి నష్టం కూడా జరుగుతుందని బాధితురాలి తండ్రి నలంద జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మానవతా దృక్పథంలో ఆ దరఖాస్తును పరిగణలోకి తీసుకున్న జిల్లా మేజేస్ట్రేట్ ఊరికి దగ్గర్లో పరీక్ష రాసేందుకు ఆ బాలికకు అవకాశం కల్పించారు. ఆ కేంద్రం వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. రాజ్ వల్లభ్ యాదవ్ ఇంట్లోనే ఫిబ్రవరి 6వ తేదీన ఆ బాలికపై అత్యాచారం జరిగింది. సులోచన అనే అమ్మాయి పుట్టిన రోజు పేరిట ఏర్పాటు చేసిన పార్టీకి ఆ బాలికపై వెళ్లినప్పుడు ఈ దారుణం చోటుచేసుకుంది. నెల రోజులు గడిచినా పరారీలో ఉన్న ఎమ్మెల్యే యాదవ్‌ను పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఆయన్ని పట్టుకోవడానికి ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినా, ఆస్తులను జప్తు చేసినా యాదవ్ జాడ లేదు. ఎమ్మెల్లే ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రెగ్యులర్ బెయిల్‌కు పిటీషన్ దాఖలు చేశారు. అది త్వరలోనే విచారణకు కోర్టు ముందుకు రాబోతోంది. -
అత్యాచారం కేసు.. మాజీ మంత్రిపై సస్పెన్షన్ వేటు
పట్నా: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, పార్టీ ఎమ్మెల్యే రాజ్బల్లాభ్ యాదవ్ ఆర్జేడీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పార్టీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కిడ్నాప్, అత్యాచారం ఘటనలకు పాల్పడ్డాడని బాధితురాలు కేసు పెట్టడంతో పార్టీ ఆయనపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్ర పర్బే తమ పార్టీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినట్లు మీడియాకు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నవాడా నుంచి ఆర్జేడీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. నలందకు చెందిన బాధిత మైనర్ బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెలయే రాజ్ బల్లాభ్ యాదవ్ పై శనివారం కేసు నమోదు చేశారు. ఈ నెల 6న ఎమ్మెల్యే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. మాజీ మంత్రిని అరెస్ట్ చేయాల్సిందిగా బిహార్ డీఐజీ షాలిన్ శనివారం పోలీసులను ఆదేశించిన విషయం విదితమే. తనపై కేసు నమోదయిందన్న విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి మాజీ మంత్రి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు టెస్టులకు పంపేందుకు పోలీస్ బృందం వెళ్లింది. అయితే, ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ టెస్టులు మేజిస్ట్రేట్ సమక్షంలోనే జరగాలంటూ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాభ్ యాదవ్ అనుచరులు, మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. -
బాలికను రేప్ చేసి.. ఎమ్మెల్యే పరార్
పట్నా: బిహార్‌లో అధికార జేడీయూ, ఆర్జేడీ ఎమ్మెల్యేల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌బల్లాబ్ యాదవ్ ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్టు కేసు నమోదైంది. రాజ్‌బల్లాబ్ యాదవ్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా బిహార్ డీజేపీ ఆదేశించారు. కేసు పెట్టవద్దని, ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ ఎమ్మెల్యే తనకు 30 వేల రూపాయలు ఇవ్వజూపినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 6న ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లో బాధితురాలికి కాపలాగా ఉన్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఎమ్మెల్యే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు. శనివారం రాత్రి నవడా జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఇదే జిల్లా నుంచి రాజ్‌బల్లాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవల బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్ఫరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోలీసుకు బెదిరింపులు.. ఎమ్మెల్యేపై కేసు
బిహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి వచ్చిందో లేదో.. అప్పుడే కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే మీద పోలీసు కేసు నమోదైంది. భోజ్‌పూర్ జిల్లాలోని చార్ పోఖ్రి పోలీసు స్టేషన్‌లోని ఎస్హెచ్ఓను ఫోన్లో తీవ్రంగా బెదిరించినందుకు ఎమ్మెల్యే సరోజ్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బర్హరా నియోజకవర్గానికి కొత్తగా ఎన్నికైన యాదవ్.. ఓ కేసు విషయంలో సదరు అధికారికి ఫోన్ చేశారు. ఆ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన జంట హత్యల విషయంలో కేసు నమోదు చేయనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇలాగైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారని ఎస్పీ నవీన్ చంద్ర ఝా తెలిపారు. దీంతో ఎమ్మెల్యేపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను మాత్రం ఎస్హెచ్ఓకు ఫోన్ చేసి బెదిరించలేదని ఎమ్మెల్యే సరోజ్ యాదవ్ అంటున్నారు. పైపెచ్చు, తననే ఆ పోలీసు అధికారి తిట్టారని, బెదిరించారని చెబుతున్నారు.