బాలికను రేప్ చేసి.. ఎమ్మెల్యే పరార్ | RJD MLA from Nawada accused of kidnapping, molesting minor girl | Sakshi
Sakshi News home page

బాలికను రేప్ చేసి.. ఎమ్మెల్యే పరార్

Published Sun, Feb 14 2016 9:24 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

బాలికను రేప్ చేసి.. ఎమ్మెల్యే పరార్ - Sakshi

బాలికను రేప్ చేసి.. ఎమ్మెల్యే పరార్

పట్నా: బిహార్లో అధికార జేడీయూ, ఆర్జేడీ ఎమ్మెల్యేల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్బల్లాబ్ యాదవ్ ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్టు కేసు నమోదైంది. రాజ్బల్లాబ్ యాదవ్ను అరెస్ట్ చేయాల్సిందిగా బిహార్ డీజేపీ ఆదేశించారు.

కేసు పెట్టవద్దని, ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ ఎమ్మెల్యే తనకు 30 వేల రూపాయలు ఇవ్వజూపినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 6న ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లో బాధితురాలికి కాపలాగా ఉన్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఎమ్మెల్యే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు. శనివారం రాత్రి నవడా జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఇదే జిల్లా నుంచి రాజ్బల్లాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఇటీవల బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్ఫరాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement