కోర్టు హాల్‌లో కుప్పకూలిన ఎమ్మెల్యే | RJD MLA Ananth Singh Collapsed In Court Hall, Patna | Sakshi
Sakshi News home page

కోర్టు హాల్‌లో కుప్పకూలిన ఎమ్మెల్యే

Published Mon, Mar 15 2021 6:23 PM | Last Updated on Mon, Mar 15 2021 7:17 PM

RJD MLA Ananth Singh Collapsed In Court Hall, Patna - Sakshi

పాట్నా: నేరారోపణలపై నమోదైన కేసులపై కోర్టు హాల్‌లో విచారణ సాగుతుండగా ఓ ఎమ్మెల్యే కుప్పకూలిపోయాడు. విచారణ సమయంలో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కోర్టు హాల్‌లో గందరగోళం ఏర్పడింది. వెంటనే అతడిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ఘటన బిహార్‌లోని పాట్నాలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ మొదట డాన్‌.

డాన్‌గా పేరుపొందిన ఆయన అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. 2005, 2010 జేడీయూ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఓ హత్య కేసులో ఆయన అరెస్ట్‌ అయ్యాడు. దీంతో ఆయనకు ఏ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి సంచలనం సృష్టించాడు. దీంతో మోకామా నుంచి ఆయన 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యాడు. అయితే ఏకే-47, గ్రెనేడ్ల కేసు విషయమై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్పృహ తప్పిపడిపోయాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement