అత్యాచారం కేసు.. మాజీ మంత్రిపై సస్పెన్షన్ వేటు | RJD suspends its MLA from the party on rape charges | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసు.. మాజీ మంత్రిపై సస్పెన్షన్ వేటు

Published Sun, Feb 14 2016 5:55 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

అత్యాచారం కేసు.. మాజీ మంత్రిపై సస్పెన్షన్ వేటు - Sakshi

అత్యాచారం కేసు.. మాజీ మంత్రిపై సస్పెన్షన్ వేటు

పట్నా: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, పార్టీ ఎమ్మెల్యే రాజ్బల్లాభ్ యాదవ్ ఆర్జేడీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పార్టీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కిడ్నాప్, అత్యాచారం ఘటనలకు పాల్పడ్డాడని బాధితురాలు కేసు పెట్టడంతో పార్టీ ఆయనపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్ర పర్బే తమ పార్టీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినట్లు మీడియాకు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నవాడా నుంచి ఆర్జేడీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.

నలందకు చెందిన బాధిత మైనర్ బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెలయే రాజ్ బల్లాభ్ యాదవ్ పై శనివారం కేసు నమోదు చేశారు. ఈ నెల 6న ఎమ్మెల్యే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. మాజీ మంత్రిని అరెస్ట్ చేయాల్సిందిగా బిహార్ డీఐజీ షాలిన్ శనివారం పోలీసులను ఆదేశించిన విషయం విదితమే. తనపై కేసు నమోదయిందన్న విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి మాజీ మంత్రి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగిన ప్రాంతంలో  ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు టెస్టులకు పంపేందుకు పోలీస్ బృందం వెళ్లింది. అయితే, ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ టెస్టులు మేజిస్ట్రేట్ సమక్షంలోనే జరగాలంటూ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాభ్ యాదవ్ అనుచరులు, మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement