
పట్నా: బిహార్‌లోని మహాఘఠ్‌బంధన్ కూటమిలో ఫిరాయింపుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్‌జేడీకి చెందిన మరో ఎమ్మెల్యే భరత్ బిండ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఎన్‌డీఏ పక్షంలోకి మారారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే నీతూ కుమారి పార్టీ లోక్‌సభ టిక్కెట్ ఇస్తే సరేసరి లేకుంటే బీజేపీలో చేరడం ఖాయమని ప్రకటించారు.
ఇప్పటికే ఆర్‌జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అదే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటేయడం, నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం తెలిసిందే. తాజా పరిణామాలతో 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్‌డీఏ బలం 135కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment