రేప్‌ కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే | Rape accused RJD MLA Raj Ballabh Yadav surrenders after a month | Sakshi
Sakshi News home page

రేప్‌ కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే

Mar 10 2016 5:40 PM | Updated on Jul 28 2018 8:53 PM

రేప్‌ కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే - Sakshi

రేప్‌ కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే

మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌ బల్లభ్ యాదవ్‌ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు

పట్నా: మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌ బల్లభ్ యాదవ్‌ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. బాలికపై అత్యాచారం కేసులో తనకు వ్యతిరేకంగా అరెస్టు ఉత్తర్వు జారీకావడంతో దాదాపు నెల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. బిహార్‌లోని నవాడా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన 53 ఏళ్ల రాజ్‌ బల్లబ్ ఫిబ్రవరి 6న పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నితీశ్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ యాదవ్ పార్టీకి చెందిన బల్లభ్ యాదవ్ తాను అమాయకుడినని, కక్షపూరితంగా తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు.

న్యాయవ్యవస్థపై గౌరవం ఉండటంతోనే తాను కోర్టు ఎదుట లొంగిపోయానని ఆయన గురువారం తెలిపారు. సీఎం నితీశ్‌ కుమార్ సొంత నియోజకవర్గమైన నలందాలో ఈ రేప్ ఘటన జరగడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాగా, తనపై ఎమ్మెల్యే అమానుషంగా అత్యాచారం జరిపినప్పటికీ పదో తరగతి పరీక్షలు రాయాలని బాధిత బాలిక నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా ఉంచబడిన ఓ పరీక్ష కేంద్రంలో ఆ బాలిక పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాటుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement