child rape
-
చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
-
ఆగని అత్యాచారాల పర్వం
రాంచీ/న్యూఢిల్లీ/గ్వాలియర్: ప్రభుత్వం ఎన్నిచట్టాలు తీసుకొస్తున్నా దేశంలో కామాంధుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా జార్ఖండ్‌లో ఓ ఎన్జీవో సంస్థకు చెందిన ఐదుగురు మహిళల్ని దుండుగులు ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడగా.. మధ్యప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్యచేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ఓ మైనర్ బాలికపై 10 మంది నీచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వలసలు, మనుషుల అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు 11 మందితో కూడిన ఓ ఎన్జీవో బృందం ఈ నెల 19న జార్ఖండ్‌లోని కుంతి జిల్లా ఛోఛంగ్ గ్రామానికి వెళ్లి వీధి నాటకాన్ని ప్రదర్శించింది. ఇంతలో అక్కడికి బైక్‌లపై వచ్చిన దుండగులు తుపాకీ గురిపెట్టి ఐదుగురు మహిళల్ని సమీపంలోని అటవీప్రాంతానికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని మొబైల్ ఫోన్లతో రికార్డు చేసి పోలీసులకు చెబితే ఈ వీడియోలను వైరల్ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై డీఐజీ అమోల్ హోమ్కర్ మాట్లాడుతూ.. గ్యాంగ్‌రేప్‌కు సంబంధించి తమకు ఫిర్యాదులేవీ అందలేదని తెలిపారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ఆధారంగా 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు జాతీయ మహిళా కమిషన్(ఎన్డబ్ల్యూసీ) ముగ్గురు సభ్యుల విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు బొకారో జిల్లాలో ఓ మైనర్ ఆదివాసీ బాలికపై నలుగురు యువకులు గురువారం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. మైనర్ బాలిక రేప్,హత్య.. తల్లిదండ్రులతో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆరేళ్ల చిన్నారిపై మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా గొంతునులిమి హత్యచేశాడు. అర్థరాత్రి సమయంలో బాలిక నీళ్లు తాగేందుకు వెళ్లింది. ఎంతసేపయినా రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టగా వివాహ వేదికకు సమీపంలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక(15)పై 10 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. జహంగీరాబాద్ సర్కిల్ అధికారి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి సోమవారం ఓ వివాహ వేడుకకు హాజరయిందని తెలిపారు. ఇంతలో బాలికకు పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు సమీపంలోని పుణ్యక్షేత్రానికి వెళ్దామంటూ బాధితురాలిని బైక్‌పై ఎక్కించుకున్నారు. అనంతరం వీరితో పాటు మరో 8 మంది దుండగులు మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నిందితులపై ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో ఆరేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. -
గుంటూరులో మరో దారుణం: ఏడేళ్ల చిన్నారిపై..
సాక్షి, గుంటూరు: మొన్నటి దాచేపల్లి ఘటనను మర్చిపోకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. మోదుకూరులో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 'ఆడబిడ్డకు రక్షగా కదులుదాం' అంటూ టీడీపీ ప్రభుత్వం చైతన్యర్యాలీలు చేపట్టినరోజే మరో కీచకపర్వం వెలుగులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న ఈ కేసు వివరాలివి.. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల నాగుల్‌మీరా అనే యువకుడు అత్యాచారం జరిపాడు. పాపకు బావ వరసయ్యే నిందితుడు.. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చాక్లెట్లు కొనిపెడతా రమ్మంటూ తీసుకెళ్లి ఘోరానికి ఒడిగట్టాడు. సాయంత్రానికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి కంగారుతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెప్పిన వివరాలను బట్టి నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. కాగా, వారం రోజుల కిందట ఇదే గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ చిన్నారిపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఘటన తర్వాత నిందితుడు సుబ్బయ్య ఉరివేసుకుని చనిపోయాడు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతున్నదని, సాక్షాత్తూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నా పోలీసులు మిన్నకుండిపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
‘బ్రహ్మజ్ఞాని’ రేప్ చేయటం పాపం కాదట!
జోధ్‌పూర్: బాలికలను తనలాంటి బ్రహ్మజ్ఞాని రేప్చేయడం పాపం కాదని ఆసారాం బాపు చెప్పేవాడని అతని మాజీ శిష్యుడు రాహుల్ కె.సచార్ జోధ్‌పూర్ కోర్టుకు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ఓ బాలికను రేప్‌చేసిన కేసులో ఆసారాంకు యావజ్జీవ జైలు శిక్ష పడటం తెల్సిందే. కోర్టు తన తీర్పులో ప్రత్యక్ష సాక్షి రాహుల్ సచార్ చెప్పిన విషయాలను వెల్లడించింది. పుష్కర్(రాజస్తాన్), భివానీ (హర్యానా), అహ్మదాబాద్ (గుజరాత్)లోని ఆశ్రమాల్లో 2003లో ఆసారాం బాలికలను వేధించటం చూశానని సచార్ చెప్పాడు. ‘ఆశ్రమంలో ఆసారాం వెంటే ముగ్గురు బాలికలుండేవారు. వారితో ఆశ్రమంలో కలియ దిరుగుతూ టార్చిలైట్‌తో సైగలు చేసేవాడు. అలా ఎంపిక చేసిన బాలికను ఆ ముగ్గురూ బాబా నివాసంలోకి పంపేవారు. ఈ ముగ్గురు బాలికలే ఆసారాం పాపానికి బలైన బాధితులకు గర్భస్రావం చేయించేవారు. అహ్మదాబాద్‌లో బాబా ఓ బాలికను వేధిస్తుంటే ప్రత్యక్షంగా చూశా. బాబాను నిలదీశా. బ్రహ్మజ్ఞాని అలాంటివి చేయటం పాపం కాదని ఆసారాం బదులిచ్చాడు. ప్రశ్నించినందుకు నన్ను బయటకు గెంటించాడు. లైంగిక సామర్థ్యం పెంపు కోసం నల్లమందుతోపాటు ఇతర మందులను వాడే వాడు’ అని సచార్ తెలిపారు. ఆశ్రమం నుంచి బయటకొచ్చాకా దాడికి పాల్పడ్డారన్నారు. -
అత్యాచారం చేస్తే ఉరిశిక్షే..
సాక్షి, న్యూఢిల్లీ: ‘పసిపిల్లలపై అకృత్యాలకు ఒడిగట్టే వారికి సమాజంలో బతికే అర్హత ఉండొద్ద’న్న వాదనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదని తేల్చిచెప్పింది. ఈ మేరకు లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోక్సో)కు సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమైంది. నిర్ణయం అనంతరం చట్టసవరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేసిన పిదప ఆర్డినెన్స్ వెలువడనుంది. ఇటీవల కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
8 నెలల పాపను రేప్ చేసిన బంధువు
న్యూఢిల్లీ : దేశరాజధానిలో మరో దారుణ సంఘటన. ఎనిమిది నెలల పసిగుడ్డుపై దగ్గరి బంధువే లైంగికదాడిచేశాడు. రక్తపుమడుగులో పడిఉన్న పాపను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. పశ్చిమఢిల్లీలోని సుభాష్ నగర్లో చోటుచేసుకున్న ఈఘటన సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పాపను ఆడిస్తానని వెళ్లి.. : అత్యాచారానికి గురైన పాప తల్లి గృహకార్మికురాలిగా, తండ్రి అడ్డా కూలీగా పనిచేస్తున్నారు. ఆదివారం పాప ఒంటరిగా ఉన్న సమయంలో వరుసకు బావయ్యే 28 ఏళ్ల యువకుడు ఇంట్లోకి వెళ్లాడు. అతిదారుణంగా లైంగికదాడిచేసి పారిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికొచ్చిన తల్లి.. రక్తపుమడుగులో పడిఉన్న పాపను చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ‘పాపను కాస్త చూడమని వాళ్లమ్మ నాకు చెప్పివెళ్లింది. కొద్దిసేపటికి వాళ్ల బావ(నిందితుడు) వచ్చి పాపను నేను ఆడిస్తానని చెప్పాడు’’ అని పక్కింటావిడ పేర్కొన్నారు. నిర్ధారించిన వైద్యులు : రక్తస్త్రావం ఎక్కువ కావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే చిన్నారి అపస్మారక స్థితిలో ఉందని, ఎమర్జెన్సీ కేసుగా పరిగణించి చికిత్స అందించామని డాక్టర్లు చెప్పారు. పాపపై లైంగికదాడి జరిగిందని నిర్ధారించారు. ప్రాణాలు నిలపగలిగినప్పటికీ ఎప్పటికి కోలుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఆదివారం లైంగికదాడి అనంతరం పరారైన యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, పోక్సో, ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని చెప్పారు. ఇదే ఢిల్లీలో గత అక్టోబర్‌లో 11 నెలల పాపపై లైంగికదాడి ఘటన అప్పట్లో కలకలంరేపింది. విర్రవీగే సేనలు ఎక్కడ? : లైంగికదాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఘాటుగా స్పందించారు. ‘‘ఇప్పుడే ఆస్పత్రికి వెళ్లొచ్చాను. ఎనిమిది నెలల పసిగుడ్డుపై ఇంత దారుణంగా అత్యాచారం జరిగితే ఢిల్లీ ఎలా నిద్రపోగలుగుతున్నది? మన సమాజం ఇంత మొద్దుబారిందా, ఇది ఆడపిల్లల తలరాత అనుకోవాలా! వాళ్లేరి? మహిళల గౌరవాన్ని కాపాడుతామంటూ స్కూల్ బస్సులపై దాడులు చేసిన సేనలు ఎక్కడ?’’ అని మాలివాల్ ప్రశ్నించారు. -
చిన్నారిపై అత్యాచారం.. హత్య
జహీరాబాద్: వరుసకు చిన్నాన్నే ఆ చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి చిన్నారిపై అత్యాచారం చేసి.. బతికి ఉండగానే బావిలో పడేసి హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో గురువారం వెలుగు చూసింది. మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌కి చెందిన స్వప్న, అంజయ్య దంపతుల ఏకైక కుమార్తె గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. అంజయ్య చిన్నాన్న కుమారుడైన శివకుమార్.. బుధవారం మధ్యాహ్నం సాయిప్రియకు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి దగ్గరకు పిలిపించుకున్నాడు. తన వెంట గ్రామానికి అర కిలో మీటరు దూరంలోని వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో తోసేశాడు. సాయంత్రం పాఠశాల వదిలిన అనంతరం కుమార్తె ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పాప ఆచూకీ కోసం వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో చిరాగ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి.. శివకుమార్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరాన్ని అంగీకరించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు సైకోగా వ్యవహరించే వాడని గ్రామస్తులు పేర్కొన్నారు. -
కాటేసిన కర్కశత్వం
మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం బాధితురాలి తల్లి, నిందితుడు పారిశుధ్య కార్మికులే బాధిత బాలికను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కృష్ణ మాదిగ అమలాపురం టౌన్ : నోరు తెరిచి కనీసం అమ్మా అని కూడా పలకలేదు... కాళ్లు చేతులు కదపలేదు....కేవలం కళ్లతో మాత్రం దీనంగా చూడగలుగుతుంది. అమ్మే కంటికి రెప్పలా చూసుకుంటూ సాకుతున్న ఆ మైనర్ మానసిక వికలాంగురాలిని ఓ కామాంధుడు కాటేశాడు. స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన పదిహేనేళ్ల మైనర్ మానసిక వికలాంగరాలిపై అదే కాలనీకి చెందిన కొప్పనాతి సతీష్ మంగళవారం తెల్లవారుజామున అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలైన తల్లే సాకుతోంది. తండ్రి లేని ఆ బాలికపై ఇంటి సమీపంలో నివాసముంటున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడైన సతీష్ కన్నేశాడు. సోమవారం అర్ధరాత్రి కాలనీలో ఓ మహిళ చనిపోవడంతో ఇరుగుపొరుగంతా అక్కడే మంగళవారం తెల్లవారు జాము దాకా ఉండిపోయారు. ఇదే అదనుగా తెల్లవారు జాము నాలుగు గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో తల్లి రావడాన్ని గమనించిన సతీష్ ఆమెను నెట్టి పరారయ్యాడు. తల్లి కేకలకు ఇరుగుపొరుగంతా అక్కడికి చేరుకుని పరిస్థితి గమనించి సతీష్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. జరిగిన ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సతీష్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బాలికను అత్యవసర చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్టుతో మరో ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. సతీష్‌కు జీవిత ఖైదు విధించాలి: కృష్ణ మాదిగ నిందితుడు కొప్పనాతి సతీష్‌కు జీవిత ఖైదే సరైన శిక్ష అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందతున్న బాలికను ఆయన మంగళవారం పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నిర్భయ కేసు కూడా నమోదు చేయాలని డిమాండు చేశారు. కృష్ణమాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వరరావు, రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యుడు ఆకుమర్తి సూర్యనారాయణ, కోనసీమ అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్ తదితరులు బాలికను పరామర్శించారు. రాష్ట్ర ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్ కూడా ఓ ప్రకటనలో బాలికపై అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. -
బాలికపై లైంగికదాడి
గర్భవతిని చేసిన మేనమామ నిందితుడి కోసం పోలీసుల గాలింపు ఉప్పలగుప్తం : మేనమామ పశువాంఛకు ఓ బాలిక బలైపోయింది. అన్నెంపున్నెం తెలియని ఆమె తనపై జరిగిన అకృత్యాన్ని అటు తల్లికి కానీ, ఇటు బంధువులకు కానీ చెప్పుకోలేక నరకం అనుభవించింది. ఆరు నెలలుగా రుతుక్రమం జరగకపోవడంతో తల్లి ప్రతీ నెలా ప్రశ్నించినా ఆ బాలిక దాటవేసింది. ఆమెకు బ్లీడింగ్ జరుగుతుండడంతో తల్లి ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఆ బాలిక గర్భవతి అని వైద్యులు తేల్చి చెప్పారు. దాంతో దిమ్మెర పోయిన ఆతల్లి ఆమెను నిలదీయగా వాస్తవాలు వెలుగు చూశాయి. ఉప్పలగుప్తం ఎస్సై రుద్రరాజు భీమరాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. స్థానిక ఉన్నత పాఠశాలలో పెద్దకుమార్తె 9వ తరగతి చదువుతుండగా చిన్నకుమార్తె 7వ తరగతి చదువుతోంది. అదే గ్రామంలో కూతవేటు దూరంలో వారి మేనమామ మస్తాన్ సాహెబ్ నివాసముంటున్నాడు. అతను కూలిపని చేస్తుంటాడు. మస్తాన్ సాహెబ్ భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. మస్తాన్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దామెకు ఇటీవలే వివాహం చేశాడు. చిన్న కుమార్తె అమ్మమ్మ వద్ద ఉంటోంది. మస్తాన్ తల్లితో కలసి గోపవరంలో ఉంటున్నాడు. భార్య చనిపోయిన మస్తాన్ సాహెబ్ కన్ను పెద్దమేనకోడలిపై పడింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు, బంధువులకు చెబితే ఏం గొడవ వస్తుందో అని భయపడిన ఆబాలిక తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టలేదు. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లి ఆమెను గురువారం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్సై భీమరాజు బాలికపై జరిగిన లైంగిక దాడిపై కేసు నమోదు చేశారు. ఆమెను గర్భవతిని చేసిన మస్తాన్ కోసం గాలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
రేప్ కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే
పట్నా: మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. బాలికపై అత్యాచారం కేసులో తనకు వ్యతిరేకంగా అరెస్టు ఉత్తర్వు జారీకావడంతో దాదాపు నెల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. బిహార్‌లోని నవాడా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన 53 ఏళ్ల రాజ్ బల్లబ్ ఫిబ్రవరి 6న పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ యాదవ్ పార్టీకి చెందిన బల్లభ్ యాదవ్ తాను అమాయకుడినని, కక్షపూరితంగా తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉండటంతోనే తాను కోర్టు ఎదుట లొంగిపోయానని ఆయన గురువారం తెలిపారు. సీఎం నితీశ్ కుమార్ సొంత నియోజకవర్గమైన నలందాలో ఈ రేప్ ఘటన జరగడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాగా, తనపై ఎమ్మెల్యే అమానుషంగా అత్యాచారం జరిపినప్పటికీ పదో తరగతి పరీక్షలు రాయాలని బాధిత బాలిక నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా ఉంచబడిన ఓ పరీక్ష కేంద్రంలో ఆ బాలిక పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాటుచేశారు. -
కీచక ఉపాధ్యాయుడు
థానే : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడయ్యాడు. ట్యూషన్‌కు వచ్చిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపాడు. ఈ ఘటన మంగళవారం పట్టణంలోని గారిబాచ్చా టౌన్షిప్లో ఉన్న వద్ద చోటుచేసుకుంది. ‘సునీప్ మహేలే అనే వ్యక్తి తన ఇంటిలో ట్యూషన్ నడుపుతున్నాడు. ట్యూషన్‌కు వచ్చిన బాలికపై అత్యాచారం జరిపాడు’ అని స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ వీఎస్ సూర్యవంశి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని, పీవోసీఎస్‌వో చట్టం-2012 ప్రకారం సెక్షన్ 4,8 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. -
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
-
బాలికపై లైంగిక దాడి.. బీరువాలో బందీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం విషయం బయట పడుతుందని బాలిక గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. బాలిక చేతులు కట్టేసి ఊపిరాడకుండా బట్టలు కప్పి బీరువాలో కుక్కి పరారయ్యాడు. ఓ మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా తల్లిదండ్రులు తమ చిన్నారిని ప్రాణాలతో కాపాడుకోగలిగారు. నివ్వెరపోయే ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సీఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట దావుద్బస్తీకి చెందిన బాలిక(9) కుటుంబం, బీహార్‌కు చెందిన బబ్లూ(25) కుటుంబం పక్క పక్క గదుల్లో అద్దెకు ఉంటున్నారు. స్థానికంగా ఓ ఆటో సర్వీసింగ్ సెంటర్లో పని చేస్తున్న బబ్లూ ఆ కుటుంబంతో చాలా చనువుగా ఉండేవాడు. బబ్లూ భార్య ప్రసవం నిమిత్తం బీహార్‌కు వెళ్లటంతో అతడి కన్ను బాలికపై పడింది. బబ్లూ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి బాలికను నాలుగో అంతస్తులోని తన గదికి తీసుకువెళ్లాడు. అనంతరం బాలికపై ఆత్యాచారం జరిపి చేతులు కట్టేసి బీరువాలో కుక్కి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం కుమార్తె కోసం గాలిస్తున్న బాలిక తల్లిదండ్రులతోనే ఏమీ తెలియనట్లు కొద్దిసేపు గడిపాడు. బాలికను బబ్లూ తీసుకెళుతుండగా చూసినట్లు ఓ మహిళ రాత్రి 7 గంటల సమయంలో వెల్లడించటంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. బబ్లూ గది తాళాన్ని పగులగొట్టిన బాలిక తల్లిదండ్రులు బీరువా నుంచి శబ్దాలు రావటంతో తెరచి చూశారు. బీరువాలో బాలికను చేతులు కట్టేసి ఉంచటంతో అపస్మారక స్థితికి చేరుకుంది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు నిందితుడు బబ్లూపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరణశిక్షల తగ్గింపుపై సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారం కేసుల్లో మరణశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ఖైదీలకు శిక్షను తగ్గిస్తూ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షకు వచ్చింది. శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్రానికి నోటీ సు జారీ చేసింది. పిల్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని బెంచ్ అంగీకరించింది. ప్రతిభాపాటిల్ అప్పట్లో మరణశిక్షను తగ్గించిన మొత్తం 35 కేసుల్లో 5కేసులు బాలికలపై క్రూరాతిక్రూరమైన అత్యాచారాలకు సంబంధించినవని పిటిషనర్ పేర్కొన్నారు.