అత్యాచారం చేస్తే ఉరిశిక్షే.. | Union Govt Clears Executive Order On Death For Rape Of Children | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేస్తే ఉరిశిక్షే..

Published Sat, Apr 21 2018 2:44 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Union Govt Clears Executive Order On Death For Rape Of Children - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘పసిపిల్లలపై అకృత్యాలకు ఒడిగట్టే వారికి సమాజంలో బతికే అర్హత ఉండొద్ద’న్న వాదనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదని తేల్చిచెప్పింది. ఈ మేరకు లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోక్సో)కు సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమైంది. నిర్ణయం అనంతరం చట్టసవరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేసిన పిదప ఆర్డినెన్స్‌ వెలువడనుంది. ఇటీవల కథువా, ఉన్నావ్‌ ఘటనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement