child rapists
-
రేపిస్టులకు వణుకు.. సంచలన తీర్పు
మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టించే వార్త. మధ్యప్రదేశ్లో ఓ రేప్ కేసు దోషికి కోర్టు మరణ శిక్ష విధించింది. కేవలం 46 రోజుల్లోనే కేసులో నిందితుడికి శిక్ష పడటం గమనార్హం. భోపాల్ : 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలంటూ గతేడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసింది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో ఏప్రిల్ 21న చట్టం రూపం దాల్చింది. ఇదిలా ఉంటే రెహిల్ జిల్లా ఖమారియా గ్రామంలో ఓ ఆలయంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. మే 21న పటేల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుడిని దోషిగా తేల్చిన సాగర్ జిల్లా కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. అంతేకాదు త్వరగతిన శిక్షను అమలు చేయాలని పోలీస్ శాఖను కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్లో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దోషికి ఉరిశిక్ష పడడం ఇదే తొలిసారి. కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేరగాళ్లకు చెంపపెట్టు అవుతుందని, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవారు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. హోమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఇకపై అత్యాచారాలకు పాల్పడే వారికి వెన్నులో వణుకుపుట్టాలన్నారు. కొడుకులా చూసుకున్నాం, కానీ... -
అత్యాచారం చేస్తే ఉరిశిక్షే..
సాక్షి, న్యూఢిల్లీ: ‘పసిపిల్లలపై అకృత్యాలకు ఒడిగట్టే వారికి సమాజంలో బతికే అర్హత ఉండొద్ద’న్న వాదనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదని తేల్చిచెప్పింది. ఈ మేరకు లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోక్సో)కు సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమైంది. నిర్ణయం అనంతరం చట్టసవరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేసిన పిదప ఆర్డినెన్స్ వెలువడనుంది. ఇటీవల కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
పిల్లల జోలికెళ్తే మరణ శిక్షే!
నైనిటాల్ : చిన్నారులపై దాష్టీకాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. ఈ మేరకు గట్టి చట్టాలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు కేంద్రానికి పలుమార్లు సూచించింది. కానీ, శిక్షా స్మృతిలోని లోపాటు.. మానవ హక్కుల సంఘం అభ్యంతరాలతో అది కార్య రూపం దాల్చలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ హైకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిన్నారులపై మృగవాంఛ తీర్చుకునే వారికి మరణ శిక్ష తప్ప మరొక ప్రస్తావన ఉండకూడదని అభిప్రాయపడింది. ‘‘పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిపోతున్నాయ్. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడితే వారికి మరణ శిక్షే సరి. అందుకోసం అవసరమైన చట్టాలు చెయ్యండి అని జస్టిస్ రాజీవ్ శర్మ, అలోక్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించింది. 2016లో ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆ కేసులో దిగువ న్యాయస్థానం అతనికి మరణ శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శుక్రవారం దీనిపై హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టగా.. పై వ్యాఖ్యలు చేసింది. కాగా, జాతీయ నేర పరిశోధన రికార్డులను ప్రస్తావించిన బెంచ్.. భారత్లో ఇలాంటి నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయని చెప్పింది. 2014లో 489, 2015లో 635, 2016లో 676 కేసులు నమోదు అయ్యాయని పేర్కొంటూ ఈ అంశ తీవ్రతను తెలియజేసింది. -
'పిల్లలపై అత్యాచారాలకు అదే మందు'
పిల్లలపై అత్యాచారాలను అరికట్టాలంటే.. ఒకటే మందు ఉంటుందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. అదే.. విత్తుకొట్టడం. అవును.. మీరు సరిగ్గానే చదివారు. ఈ శిక్ష విధిస్తే మాత్రమే చిన్నారులపై అత్యాచారాలు తగ్గుతాయని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. కిరుబకరన్ వ్యాఖ్యానించారు. సంప్రదాయ చట్టాలు వీళ్లమీద ఎలాంటి ప్రభావం చూపించడం లేదని, వాస్తవానికి విత్తుకొట్టడం లాంటి శిక్షలు అరాచకంగా అనిపించినా.. అచారకమైన నేరాలకు తప్పనిసరిగా అరాచక శిక్షలే విధించాలని ఆయన అన్నారు. దీంతో చాలామంది అంగీకరించకపోవచ్చు గానీ, సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు ఇది మాత్రమే సరైన మందు అని ఆయన చెప్పారు. 2008 నుంచి 2014 వరకు చిన్నపిల్లలపై జరిగిన అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడినది కేవలం 2.4 శాతం మంది నేరస్థులకేనని, అయితే ఇదే సమయంలో పిల్లలపై నేరాలు 400 శాతం పెరిగాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అమెరికా సహా పలు దేశాల్లో ఇప్పటికే విత్తుకొట్టడం లాంటి శిక్షలు అమలులో ఉన్నాయని, అందుకే అక్కడ ఈ తరహా నేరాలు బాగా తగ్గాయని చెప్పారు. తమిళనాడులో పిల్లలపై అత్యాచారం చేసిన ఓ విదేశీయుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను కొట్టేసే సందర్భంగా జస్టిస్ ఎన్. కిరుబకరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో గత వారం ఇద్దరు చిన్నారులపై దారుణంగా జరిగిన సామూహిక అత్యాచారాల నేపథ్యంలో కోర్టు ఇంత తీవ్రంగా స్పందించింది. పిల్లలపై అత్యాచారాలు చేసిన వాళ్లకు విత్తుకొట్టే శిక్షలను ఇప్పటికే రష్యా, పోలండ్, ఈస్టోనియా, అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, తాజాగా ఆసియాలో మొట్టమొదటిగా దక్షిణ కొరియా కూడా ఈ శిక్షలను అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు.