థానే : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడయ్యాడు. ట్యూషన్‌కు వచ్చిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపాడు. ఈ ఘటన మంగళవారం పట్టణంలోని గారిబాచ్చా టౌన్‌షిప్‌లో ఉన్న వద్ద చోటుచేసుకుంది. ‘సునీప్ మహేలే అనే వ్యక్తి తన ఇంటిలో ట్యూషన్ నడుపుతున్నాడు. ట్యూషన్‌కు వచ్చిన బాలికపై అత్యాచారం జరిపాడు’ అని స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ వీఎస్ సూర్యవంశి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని, పీవోసీఎస్‌వో చట్టం-2012 ప్రకారం సెక్షన్ 4,8 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.