త్వరలోనే మంచిరోజులు వస్తాయ్‌: ఆసారాం | Good days will come, Asaram says in viral audio clip | Sakshi
Sakshi News home page

త్వరలోనే మంచిరోజులు వస్తాయ్‌: ఆసారాం

Published Sun, Apr 29 2018 3:49 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

Good days will come, Asaram says in viral audio clip - Sakshi

జోధ్‌పూర్‌: మైనర్‌ బాలికపై రేప్‌ కేసులో జీవితఖైదు శిక్షపడి జో«ద్‌పూర్‌ జైలులో ఉన్న వివాదాస్పద గురువు ఆసారాం బాపు ఓ శిష్యుడితో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. 15 నిమిషాల నిడివి ఉన్న ఆ క్లిప్‌లో ఆసారాం మాట్లాడుతూ.. ‘జైలులో నేనుండేది తాత్కాలికమే. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మనం చట్టాలు, వ్యవస్థను గౌరవించాలి’ అని చెప్పాడు.

తన ఆశ్రమాన్ని  స్వాధీనం చేసుకునేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆసారాం ఆరోపించాడు. ఈ ఆడియో క్లిప్‌పై జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు డీఐజీ విక్రమ్‌ స్పందించారు. ప్రతి ఖైదీకి నెలకు ఇద్దరు వ్యక్తులతో 80 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. శుక్రవారం ఆసారాం సబర్మతీలోని ఓ శిష్యుడితో మాట్లాడినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement