ఆసారాం బాపు (ఫైల్ ఫోటో)
జోధ్‌పూర్ : సంచలనం సృష్టించిన 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో వివాదాస్పద స్వామీజీ ఆసారాం(77)కు జోధ్‌పూర్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటుగా రూ. లక్ష జరిమానాను విధించిన సంగతి తెలిసింది. జోధ్‌పూర్ సెంట్రల్ జైల్‌లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి మధుసూదన్ శర్మ ఈ తీర్పు వెలువరించారు. కాగా ఆసారం బాధితురాలు స్వామీజీ తనను లొంగిపోమ్మని ఆదేశించాడని అందుకు తగ్గట్టుగానే సీనియర్ అధికారులు అతడికి పాదాభివందనం చేసి వత్తాసు పలికారని తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానంలో బాధాతురాలు చెప్పిన కొన్ని వ్యాక్యలను కోర్టు పరిగణలోకి తీసుకుని ఆసారాంకు జీవిత ఖైదు శిక్ష విధించింది.
కోర్టులో బాధితురాలు.. ఆసారాం తనను సీఏ చదవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎంత పెద్ద అధికారి అయినా నా ముందు మోకరిల్లాల్సిందే...కాబట్టి నువ్వు సీఏ బదులు బీఈడీ చదువు. అప్పుడు నిన్నుతొలుత నా గురుకులంలో ఉపాధ్యాయురాలిగా నియమించి అనంతరం నిన్ను గురుకులానికి ప్రధానోపాధ్యాయురాలిని చేస్తానని చెప్పి తనను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. కోర్టు ఈ వ్యాక్యలను పరిగణలోకి తీసుకుని ఆసారాంకు జీవిత ఖైదు విధించింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నివాసి. ఆమె మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారలో ఆసారాం నెలకొల్పన ఆశ్రమంలో ఉండి చదువుకుంటుంది. 2013 సంవత్సరం ఆగస్టులో బాధితురాలికి దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించాల్సిందిగా బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసారాం వద్దకు తీసుకువచ్చారు.
ఆ సమయంలో ఆసారాం బాధితురాలితో మాట్లాడుతూ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటని ఆమెను అడిగాడు. దానికి సమాధానంగా బాలిక సీఏ చదివి గొప్ప ఆఫీసర్ కావాలనుకుంటున్నాని చెప్పగా ఆసారాం సీఏ చదవడం ఎందుకు? ఎంత పెద్ద అధికారి అయినా నా కాళ్ల మీద పడి నమస్కరిస్తాడు. అందుకే నువ్వు సీఏ బదులు బీఈడీ చదువు. అప్పుడు నిన్ను గురుకులానికి ప్రధానోపాధ్యాయురాలిని చేస్తానని చెప్పాడని బాలిక తెలిపింది. అనంతరం ఆమెకు నయం చేసే నెపంతో ఆమెను ఒంటరిగా తన గదికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం గురించి బయట ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. కానీ బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆసారాం మీద ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసును జోధ్‌పూర్‌కు బదిలీ చేశారు. బాలికతో ఆసారాం ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని.. తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేశారని తీర్పు సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ శర్మ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment